
హువావే సబ్ బ్రాండ్ హానర్ స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. తాజా స్మార్ట్‌పోన్లపై ఈ ఆఫర్‌ను అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో నాలుగు రోజులు హానర్ డే సేల్ రేపటినుంచి (మంగళవారం సెప్టెంబర్18నుంచి) శుక్రవారం వరకూ కొనసాగనుంది. వీటిల్లో హానర్ 9 లైట్, హానర్ 10, హానర్ 9ఎన్ హానర్ 9ఐ ఉన్నాయి. అలాగే హానర్ 9 ఎన్ లో కొత్త కలర్ ఆప్షన్స్‌లో లావెండర్ పర్పుల్ , రాబిన్ ఎగ్ బ్లూ లో తీసుకొస్తున్నట్టు కూడా కంపెనీ ప్రకటించింది. హానర్ 10 పై రూ. 5 తగ్గింపు. అలాగే హానర్ 9 ఐ పై వెయ్యి రూపాయల డిస్కౌంట్ ప్రకటించింది.
హానర్ 9 లైట్ 4జీబీ / 64జీబీ నిల్వ వేరియంట్ రూ. 14,999 దీనిపై ఎక్స్చేంజ్ ఆఫర్ రూ. 3,000.
హానర్ 10 6జీబీ ర్యామ్ /128జీబీ నిల్వ వేరియంట్ 5,000 రూపాయలు తగ్గింపు తరువాత రూజ 27,999 లభ‍్యంకానుంది. దీని అసలు ధర రూ. 32.999. నాలుగు కెమెరా సెటప్ కలిగిన హానర్ మొట్టమొదటి స్మార్ట్‌పోన్ హానర్ 9ఐ రూ. 16,999 కు అందుబాటులో ఉంటుంది. అసలు దర ధర రూ .17,999
వెయ్యి రూపాయల డిస్కౌంట్‌తో హానర్ 9 ఐ (3జీబీ /32జీబీ నిల్వ వేరియంట్) రూ. 11,999 లకు, 4జీబీ / 64జీబీ నిల్వ వేరియంట్ రూ. 13,999 లకు లభ్యం.
Comments
Please login to add a commentAdd a comment