ముంబైలోని ఓ పెట్రోల్ బంక్ ముందు క్యూ కట్టిన వాహనదారులు
ముంబై : ఇటీవలి కాలంలో పెట్రో ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) వినియోగదారులకు కాసింత ఊరట కల్పించాలని భావించింది. గురువారం ఎంఎన్‌ఎస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే జన్మదినాన్ని పురస్కరించుకుని.. వాహనదారులకు 4 నుంచి 5 రూపాయల మేర తగ్గింపుపై పెట్రోలు అందించాలని ఆ పార్టీ శ్రేణులు నిర్ణయించాయి. అందులో భాగంగా ఈ రోజు రాష్ట్రంలో ఎంపిక చేసిన పెట్రోలు బంక్‌ల్లో ద్విచక్ర వాహనదారులకు ఈ సదుపాయం కల్పించింది. మరికొన్ని చోట్ల 9 రూపాయల వరకు కూడా తగ్గింపు ఇస్తున్నారు. దీంతో చాలా మంది వాహనదారులు ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్నారు. ఎంపిక చేసిన పెట్రోలు బంక్‌ల ముందు వందల మీటర్ల మేర వాహనదారులు బారులు తీరారు.
ఈ రోజు మహారాష్ట్రలో పెట్రోల్ ధర 84.26 రూపాయలుగా ఉంది. ఈ తగ్గింపు వల్ల పెట్రోల్ బంక్ యాజమానులపై పడే భారాన్ని ఎంఎన్‌ఎస్ చెల్లించనుంది. దీనిపై ద్విచక్ర వాహనదారులు హర్షం చేస్తున్నారు. ఓ వాహనదారుడు మాట్లాడుతూ.. రాజ్ ఠాక్రేలాగే మోదీ కూడా పెట్రోలు ధరలు తగ్గిస్తారని ఆశిస్తున్నామన్నారు. తాను ట్యాంక్ ఫూల్ చేయించడం ఇదే తొలిసారి అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment