Festive Sales: Amazon and Flipkart Records the Best First Day Sales Ever on Smart Phones, Fashion and Many More Products - Sakshi
Sakshi News home page

ఫెస్టివ్‌ సేల్‌ : దుమ్ము లేపిన అమ్మకాలు

Published Mon, Sep 30 2019 11:20 AM | Last Updated on Mon, Sep 30 2019 11:52 AM

Amazon Flipkart claims Record  sales In fesitve lase - Sakshi

సాక్షి, ముంబై : పండుగ సీజన్‌లో భారతీయ వినియోగదారులు స్మార్ట్‌ఫోన్ల కొనుగోళ్లలో దుమ్ము లేపారు. ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఈ సీజన్ మొదటి రోజు రికార్డు స్థాయిలో అమ్మకాలు సాధించినట్టు తెలుస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో రూ. 750 కోట్ల విలువైన ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించినట్టు తెలిపింది. కేవలం 36 గంటల్లో ఈ రికార్డ్‌ సేల్‌ను నమోదు చేసినట్టు  ప్రకటించింది.

అమెజాన్‌: బిగ్ బిలియన్ డేస్ అమ్మకం మొదటి రోజున రెండు రెట్లు వృద్ధిని సాధించినట్లు వాల్‌మార్ట్ సొంతమైన ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.  ప్రీమియం బ్రాండ్‌లైన వన్‌ప్లస్, శాంసంగ్,  యాపిల్‌  స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలతో 36 గంటల్లో 750 కోట్ల రూపాయలకు మించి సాధించినట్టు తెలిపింది. తమకు ఇదే అతిపెద్ద ప్రారంభ రోజు అమ్మకాలని అమెజాన్‌ గ్లోబల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్,  కంట్రీ హెడ్ అమిత్ అగర్వాల్ తెలిపారు.  బ్యూటీ అండ్‌ ఫ్యాషన్‌ రంగంలో 5 రెట్ల వృద్ధినీ, గ్రాసరీస్ అమ్మకాల్లో  ఏకంగా 7 రెట్ల వృద్ధిని సాధించినట్టు వెల్లడించారు.  ప్రధానంగా తమకొత్త కస్టమర్లలో 91శాతం,  టైర్‌ 2, 3 పట్టణాలదేనని పేర్కొన్నారు. 

ఫ్లిప్‌కార్ట్‌: ఫ్లిప్‌కార్ట్‌లో దాదాపు ఇదే స్థాయిలో అమ్మకాలు నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో రెండురెట్ల ఎక్కువ అమ్మకాలను సాధించింది. ఫ్యాషన్‌, బ్యూటీ, ఫర్నిచర్‌ సంబంధిత విక్రయాలు బాగా వున్నాయని ఫ్లిప్‌కార్ట్‌ సీఈవో కల్యాణ​ కృష్ణమూర్తి తెలిపారు. మొబైల్స్‌, ఇతర ఎలక్ట్రానిక్స్‌ అమ్మకాలు రెండో రోజు పుంజుకోనున్నాయని చెప్పారు. ఇది ఇలా వుంటే ఈ ఫెస్టివ్‌ సీజన్‌ అమ్మకాల్లో మొత్తం మీద రెండు సంస్థలు 5 బిలియన్‌ డాలర్లకుమించి ఆదాయాన్ని ఆర్జించే అవకాశం వుందని తాజా రిపోర్టుల అంచనా. స్నాప్‌డీల్‌, క్లబ్‌ ఫ్యాక్టరీ లాంటి సంస్థలు కూడా ఇదే జోష్‌ను కొనసాగిస్తున్నాయి. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ పండుగ అమ్మకాలు అక్టోబర్ 4 న ముగియనున్నాయి. 

కాగా ఈ కామర్స్‌ సంస్థ పండుగ అమ్మకాల సమయంలో వాస్తవ మార్కెట్ ధరపై కాకుండా రాయితీ ధర అమ్మకాలతో జీఎస్‌టీ ద్వారా ప్రభుత్వానికి భారీగా నష్టాన్ని కలిగిస్తున్నాయని ట్రేడర్స్ బాడీ సీఐఐటీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement