
సాక్షి, న్యూఢిల్లీ : పండుగ సీజన్ ఇంకా వినియోగదారులను మురిపిస్తూనే ఉంది. భారీ భారీ డిస్కౌంట్లతో బ్రాండ్లు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. దీనిలో విమానయాన సంస్థలు తామేమీ తక్కువ కాదంటూ నిరూపించుకుంటున్నాయి. తాజాగా యూకేకి చెందిన విస్తారా 48 గంటల లాంగ్ దివాలి సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్ కింద ఎంపికచేసిన రూట్లలో టిక్కెట్‌ను రూ.1,149కే విక్రయించనున్నట్టు పేర్కొంది. 2017 అక్టోబర్ 26 నుంచి 2018 మార్చి 24 మధ్య ప్రయాణాలకు ఈ టిక్కెట్ సేల్ అందుబాటులో ఉంటుంది. అక్టోబర్ 13 వరకు ఈ 'ఫెస్టివల్ ఆఫ్ లైట్స్' సేల్ అందుబాటులో ఉంటుంది. గోవా, పోర్ట్ బ్లయిర్, లడఖ్, జమ్ము, శ్రీనగర్, కొచ్చి, గౌహతి, అమృత్‌సర్, భువనేశ్వర్, మెట్రో నగరాలు ఢిల్లీ, కోల్‌కత్తా, ముంబై, బెంగళూరు వంటి ప్రాంతాల నుంచి, ప్రాంతాలకు కస్టమర్లు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.
నిన్నటి నుంచి ప్రారంభమైన ఈ సేల్ రేపటి(అక్టోబర్ 13) వరకు ఉంటుంది. వన్ వే, ఎకానమీ క్లాస్, ప్రీమియం ఎకానమీలో రిటర్ను ట్రావెల్‌కు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. ఈ సేల్‌లో చాలా తక్కువ సేల్ శ్రీనగర్-జమ్ము మార్గంలో ఉంది. ఇతర మార్గాలలో అద్భుతమైన ధరలను విస్తారా అందిస్తోంది. ఈ సేల్ కింద బుకింగ్స్ చేసుకున్న టిక్కెట్లు, మరే ఇతర డిస్కౌంట్ కిందకు రావని విస్తారా తెలిపింది. ఇండియాలో, డైరెక్ట్ విమానాలకు మాత్రమే ఇది వాలిడ్‌లో ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment