ఎయిరిండియా స్వచ్ఛంద విభజన పథకం(వాలెంటరీ సెపరేషన్ స్కీమ్)తో పాటు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని (వీఆర్‌ఎస్) రూపొందించింది. కంపెనీలో ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులకు వీఆర్‌ఎస్ స్కీమ్ అందుబాటులో ఉంటుందని, ఐదేళ్ల లోపు సర్వీస్ ఉన్నవారికి వీఎస్‌ఎస్ వర్తిస్తుందని పేర్కొంది. ఈ పథకాలను నాన్ ఫ్లైయింగ్ పర్మనెంట్ స్టాఫ్ కోసం తయారుచేసినట్లు చెప్పింది. అయితే వీటికి సంబంధించిన నిర్దిష్ట వివరాలను మాత్రం వెల్లడించలేదు.
ఎయిరిండియాను ప్రైవేటీకరణ చేసిన తర్వాత శాశ్వత ఉద్యోగుల కోసం స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని ప్రవేశపెట్టడం ఇది మూడోసారి. విస్తారా ఎయిర్‌లైన్స్ టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియాలో విలీనానికి సిద్ధమవుతున్న తరుణంలో ఇలాంటి పథకాలు రావడం గమనార్హం. ఈ నెల ప్రారంభంలో రెండు ఎయిర్‌లైన్స్‌లోని దాదాపు 600 మంది ఉద్యోగులపై ఈ విలీనం ప్రభావం చూపుతుందని కొన్ని సంస్థలు నివేదికలు తెలిపాయి. ఎయిరిండియా, విస్తారాలో కలిపి సుమారు 23,000 మంది ఉద్యోగులు ఉన్నారు.
ఇదీ చదవండి: కంపెనీలు వెళ్లిపోతాయ్..!
విలీన ప్రక్రియలో భాగంగా ఫిట్‌మెంట్ విధానాలు, ఉద్యోగ స్థానాల కేటాయింపు పూర్తయిన తర్వాత విస్తారా కూడా ఇలాంటి స్కీమ్‌లను ప్రకటించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. విస్తారా సింగపూర్ ఎయిర్‌లైన్స్, టాటా గ్రూప్ మధ్య జాయింట్ వెంచర్‌గా ఉంది. రెండు సంస్థల విలీనం పూర్తయితే ఎయిరిండియాలో సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు 25.1 శాతం వాటా దక్కుతుంది.
Comments
Please login to add a commentAdd a comment