‘ఫ్రీడమ్‌’ ఆఫర్‌.. బస్‌ టికెట్‌ ధరతో ఫ్లైట్‌ జర్నీ | Vistara freedom sale Flight tickets starting at rs 1578 | Sakshi
Sakshi News home page

‘ఫ్రీడమ్‌’ ఆఫర్‌.. బస్‌ టికెట్‌ ధరతో ఫ్లైట్‌ జర్నీ

Published Wed, Aug 14 2024 9:25 PM | Last Updated on Wed, Aug 14 2024 9:25 PM

Vistara freedom sale Flight tickets starting at rs 1578

తక్కువ ధరకు విమాన ప్రయాణం చేయాలనుకుంటున్నారా? అది కూడా బస్‌ టికెట్‌ ధరకే. ఈ సూపర్‌ ఆఫర్‌ను టాటా గ్రూప్ ఎయిర్‌లైన్ కంపెనీ 'విస్తారా' తీసుకొచ్చింది. ఈ ఆఫర్‌లో టికెట్లను బుక్ చేసుకుంటే రూ.1,578లకే ఎంచక్కా ఫ్లైట్‌ ఎక్కేయచ్చు.

ఈ ఆఫర్‌లో టికెట్లను బుక్ చేసుకోవడం ద్వారా నవరాత్రి, దసరా వరకు ప్రయాణించవచ్చు. అయితే దీని కోసం ఆగస్టు 15లోగా టికెట్లు బుక్ చేసుకోవాలి. టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్‌లైన్ విస్తారా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రీడమ్ సేల్‌ను ప్రారంభించింది. ఈ ఆఫర్‌లో అక్టోబర్ 31 నుంచి ఆగస్టు 15 వరకు చౌకగా విమాన టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

ఈ మార్గంలో రూ.1578
విస్తారా సేల్‌లో బాగ్‌డోగ్రా నుంచి డిబ్రూగఢ్‌కు ప్రయాణించడానికి ఎకానమీ క్లాస్‌లో ఒకవైపు దేశీయ ఛార్జీ రూ.1,578 నుంచి ప్రారంభమవుతుంది. అదే సమయంలో ముంబై నుంచి అహ్మదాబాద్‌కి ప్రీమియం ఎకానమీ క్లాస్ ప్రారంభ ధర రూ.2,678. ఇక ముంబై నుంచి అహ్మదాబాద్‌కి బిజినెస్ క్లాస్ ధర రూ.9,978 నుంచి ప్రారంభమవుతుంది. ఢిల్లీ నుంచి ఖాట్మండుకు అంతర్జాతీయ విమానానికి ఎకానమీ క్లాస్ ధర రూ.11,978 నుంచి ప్రారంభమవుతుంది. అదే ప్రీమియం ఎకానమీ విభాగంలో ఢిల్లీ నుంచి ఖాట్మండుకు ప్రారంభ ధర రూ.13,978.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement