
న్యూఢిల్లీ: పలు ప్రధాన రూట్లలో భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నట్లు విస్తారా ఎయిర్‌లైన్స్, బడ్జెట్ ఎయిర్‌లైన్ ఇండిగో ప్రకటించాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 26 నుంచి సెప్టెంబర్ 28 వరకు చేసే జర్నీలపై సోమవారం నుంచి బుధవారం వరకు ఈ ఆఫర్ ఇస్తున్నట్లు ఇండిగో ప్రకటించింది. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలపై ఈ ఆఫర్లు వర్తిస్తాయని వెల్లడించింది. దేశీ విమానాల్లో రూ.899కే విమాన టికెట్‌ను అందిస్తుండగా.. అంతర్జాతీయ రూట్లలో టికెట్ ప్రారంభ ధర రూ.3,399 నుంచి ఉన్నట్లు కంపెనీ తెలియజేసింది.
ఇక ఫిబ్రవరి 27 నుంచి సెప్టెంబర్ 18 వరకు జరిగే ప్రయాణాలకు సంబంధించిన బుకింగ్స్‌ను మంగళవారం ప్రారంభిస్తున్నట్లు విస్తారా ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. కేవలం రెండు రోజులు మాత్రమే కొనసాగే ఈ డిస్కౌంట్ ఆఫర్ రేపటితో ముగియనుంది. ఢిల్లీ–అహ్మదాబాద్, ఢిల్లీ–కోల్‌కతా, ఢిల్లీ–చెన్నై, ముంబై–గోవా రూట్లలో ఇరు సంస్థలు ఆఫర్లను ఇస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment