వర్షాకాల ఆఫర్: రూ.849కే విమాన టిక్కెట్ | Vistara Offers Rs. 849 Tickets In Five-Day Sale. Details Here | Sakshi
Sakshi News home page

వర్షాకాల ఆఫర్: రూ.849కే విమాన టిక్కెట్

Published Wed, Jun 14 2017 9:40 AM | Last Updated on Tue, Sep 5 2017 1:37 PM

వర్షాకాల ఆఫర్: రూ.849కే విమాన టిక్కెట్

వర్షాకాల ఆఫర్: రూ.849కే విమాన టిక్కెట్

వర్షాకాలం ఇలా వచ్చిందో లేదో అలా విమానయానసంస్థలన్ని మాన్ సూన్ ఆఫర్లతో పోటీపడుతున్నాయి. ఇండిగో, గోఎయిర్ సంస్థలు విమానటిక్కెట్లపై బంపర్ ఆఫర్లు ప్రకటించగా.. తాజాగా విస్తారా కూడా వర్షాకాల ఆఫర్ ను తీసుకొచ్చింది. ఐదు రోజుల పాటు విస్తార 'గ్రేట్ మాన్ సూన్ సేల్' ను నిర్వహిస్తోంది. ఈ ఆఫర్లో భాగంగా పరిమిత కాలవ్యవధిలో 849 రూపాయలకే ఎకానమీ క్లాస్ టిక్కెట్లను విక్రయిస్తున్నట్టు పేర్కొంది. ఈ సేల్ లో భాగంగా  ప్రీమియం ఎకానమీ సీట్ల కోసం టిక్కెట్లను రూ.2,099కు విక్రయిస్తోంది. ఈ ఆఫర్ టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ఈ సేల్ జూన్ 13 అర్థరాత్రి నుంచి, జూన్ 17 వరకు అందుబాటులో ఉంటుంది.
 
జూన్ 28 నుంచి సెప్టెంబర్ 20 మధ్య ప్రయాణాలకు ఈ టిక్కెట్లు వర్తిస్తాయని విస్తారా ఎయిర్ లైన్స్ తన ప్రకటనలో తెలిపింది. గోవా, పోర్టు బ్లయిర్, లడఖ్, జమ్ము, శ్రీనగర్, గౌహతి, అమృత్ సర్, భువనేశ్వర్, ఢిల్లీ, కోల్ కత్తా, ముంబై, బెంగహూరు వంటి మార్గాలను ఈ స్కీమ్ కవర్ చేస్తోంది. డైరెక్ట్ విమానాలకు మాత్రమే ఇది వాలిడ్ లో ఉంటుందని, భారత్ లోనే ఈ ఆఫర్ వర్తిస్తుందని విస్తారా పేర్కొంది. జమ్ము-శ్రీనగర్ మార్గంలో వన్-వే ఎకానమీ క్లాస్ టిక్కెట్లను రూ.849కే విక్రయిస్తోంది. తమ వెబ్ సైట్  airvistara.com, మొబైల్ యాప్స్ ద్వారా ఈ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని విస్తారా తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement