నేడు పాఠశాలల బంద్: ఏబీవీపీ
సాక్షి, హైదరాబాద్: కేజీ టు పీజీ ఉచిత విద్య విధివిధానాలు తక్షణమే ప్రకటించాలని, విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ.. అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చింది. సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ మాట్లాడుతూ..
విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు విద్యా సంస్థల్లో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు కేటాయించాలన్నారు. కేజీ టు పీజీ విధివిధానాలను ప్రభుత్వం తక్షణమే వెల్లడించాలన్నారు. నేడు జరిగే ఈ పాఠశాలల బంద్‌కు పరీక్షలు రాసే విద్యార్థులకు ఆటంకాలు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో ఏబీవీపీ నేతలు శ్రీధర్, రాజేంద్ర ప్రసాద్, అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు.