Akhil Bharatiya Vidyarthi Parishad
-
దేశ నిర్మాణంలో భారత విద్యార్థి పాత్ర
భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించిన తొలినాళ్లలో దేశంలోని విద్యార్థి యువకుల శక్తిని సంఘటిత పరిచేందుకు పురుడు పోసుకుంది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. వ్యక్తి నిర్మాణం ద్వారానే జాతీయ పునర్నిర్మాణం సాధ్యమని స్వామి వివేకానంద స్ఫూర్తితో అంచె లంచెలుగా విస్తరిస్తూ, 73 ఏళ్ళ సుదీర్ఘ ప్రస్థానంలో నేడు ప్రపంచంలోనే శక్తిమంతమైన విద్యార్థి సంస్థగా వెలుగొందుతోంది. దేశం పేరు భారత్ ఉంచాలన్న తొలి డిమాండ్, వందేమాతర గీతాన్ని జాతీయ గీతంగా గుర్తించా లనే రెండవ డిమాండ్ చేస్తూ, జ్ఞాన్, శీల్, ఏకతా అని నినదిస్తూ, కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు విరాజిల్లుతూ, పొరుగు దేశం నేపాల్లోనూ తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. దేశంలోని అనేక మంది కీలక రాజకీయ నాయకులు ఒక ప్పుడు ఏబీవీపీ కార్యకర్తలే అని గమనిస్తే, అది యువతలో నాయకత్వ లక్షణాలను నింపే కర్మా గారం అన డంలో ఎలాంటి సందేహం లేదు. దేశ వ్యాప్తంగా కళాశాల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు 4,500 నగరాలు, పట్టణాల్లో 33 లక్షల సభ్యత్వం కలిగివుండటంతో పాటు, ప్రపంచ దేశాల నుండి భారత్ వచ్చి చదువుకునే విద్యార్థుల కోసం డబ్ల్యూఓఎస్‌వై, సామాజిక స్పృహతో పని చేయడానికి ఎస్ఎఫ్డీ, ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులకై రాష్ట్రీయ కళామంచ్, కేంద్రీయ విద్యా సంస్థల్లో థింక్ ఇండియా... ఇలా ప్రజాస్వామ్య ప్రపం చంలోనే అతి పెద్ద విద్యార్థి సంస్థగా ఏబీవీపీ అవతరించింది. కశ్మీరీ విద్యార్థుల కోసం దేశవ్యాప్తంగా 1990 సెప్టెంబర్ 11న చేపట్టిన చలో కశ్మీర్ యువతను చైతన్యపరిచిన ఒక మహోద్యమం. అస్సాం చొరబాటు దారులకు వ్యతిరేకంగా అస్సాంను కాపా డండి, దేశాన్ని రక్షించండి అనే నినాదంతో 1983 అక్టోబర్ 2న గౌహతిలో భారీ ప్రదర్శన జరిపింది. బంగ్లాదేశ్ చొరబాటుదారులకు వ్యతిరేకంగా చలో చికెన్‌నెక్ పేరుతో 2008 డిసెంబర్ 17న బెంగాల్ సరిహద్దుల్లో 40 వేల మంది విద్యార్థులతో భారీ ఆందోళన నిర్వహించింది. భారతీయులను బానిస లుగా మార్చే మెకాలే విద్యా విధానాన్ని మార్చి జాతీయ విద్యా విధానం–2020 కార్యరూపం దాల్చేలా పోరాడింది. మహమ్మారి ఆపత్కాలంలో మేమున్నామంటూ పరిషత్ నిర్ణయంతో దేశవ్యాప్తంగా తరలిన కార్యకర్తల సేవాభావం వెలకట్టలేనిది. కరోనా సోకి దిక్కుతోచని స్థితిలో ఉన్న కుటుంబాలకు వైద్య సహాయం, భోజనాలు అందించడం, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం, ఉపాధి కోల్పోయిన పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువుల పంపిణీ, ఏడాదిన్నర నుండి తరగతి గది అభ్యసనానికి దూరమైన విద్యార్థులకు ఎక్కడికక్కడ పరిషత్ పాఠశాల పేరుతో ట్యూషన్స్ చెప్పడంలాంటి అనేక కార్య క్రమాలను ఏబీవీపీ చేపట్టింది. - ప్రవీణ్‌రెడ్డి రాష్ట్ర కార్యదర్శి, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, తెలంగాణ -
మళ్లీ ‘రాజద్రోహం’!
నిండా ఆర్నెల్లు పూర్తి కాకుండానే మరోసారి ‘రాజద్రోహం’ తెరపైకి వచ్చింది. ఈసారి అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్పై ఆ నింద పడింది. స్వాతంత్య్ర దినోత్సవానికి రెండురోజుల ముందు ఆ సంస్థ ఆధ్వర్యాన బెంగళూరులో నిర్వహించిన సదస్సులో దేశ వ్యతిరేక, పాక్ అనుకూల నినాదాలు హోరెత్తాయన్నది ఆ నింద సారాంశం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెంగళూరు పోలీసులు కేసు పెట్టారు. ఇది జరిగిన రెండురోజులకే ఆమ్నెస్టీకి వస్తున్న నిధులపై దర్యాప్తు జరుపుతామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మొన్న ఫిబ్రవరిలో ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్యకుమార్‌పైనా, మరికొందరు ఇతర విద్యార్థి నాయకులపైనా రాజద్రోహం కేసులు పెట్టి అరెస్టుచేశారు. ఆ తర్వాత రాజద్రోహానికి సంబంధించిన భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 124-ఏ పై సమగ్ర సమీక్ష జరపమని లా కమిషన్‌ను కోరామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజూ ప్రకటించారు. రాజద్రోహానికి చట్టం చెబుతున్న నిర్వచనం విస్తృతమైనది కావడంవల్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారందరిపైనా దాన్ని ప్రయో గించే వీలున్నదని ఆ సందర్భంగా ఆయన అంగీకరించారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ యాభైయ్యేళ్లుగా ప్రపంచ దేశాలన్నిటా చురుగ్గా పని చేస్తున్న సంస్థ. అందువల్లే అఫ్ఘాన్‌లో తాలిబన్ ఆగడాలైనా, ఇరాక్, సిరియాల్లో ఐఎస్ ఘాతుకాలైనా ప్రపంచానికి వెల్లడయ్యాయి. బలూచిస్తాన్‌లో, ఆక్రమిత కశ్మీర్లో పాకిస్తాన్ సైన్యం సాగిస్తున్న మానవ హక్కుల ఉల్లంఘనల్ని సవివరంగా బయటపెట్టింది కూడా ఆమ్నెస్టీయే. అమెరికాలో నల్ల జాతీయుల హక్కుల అణిచి వేతనూ, పాలస్తీనాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న అమానుషాలనూ ఈ సంస్థ నివేదికలు ప్రశ్నించాయి. ప్రపంచ భద్రతకు ముప్పు తెస్తున్న అగ్రరాజ్యాల ఆయుధ వ్యాపా రాన్నీ, మహిళలపై వివిధ దేశాల్లో అనేక రూపాల్లో సాగుతున్న హింసనూ ఆమ్నెస్టీ ప్రపంచం దృష్టికి తెచ్చింది. బెంగళూరు సదస్సు కూడా మానవ హక్కుల ఉల్లం ఘనలకు, బాధిత కుటుంబాలకు న్యాయం లభించకపోవడంవంటి అంశాలకు సంబంధించిందే. సైన్యం చేతుల్లో మాయమైన, కాల్పుల్లో మరణించిన కశ్మీర్ యువకులకు చెందిన కుటుంబాలవారు ఈ సదస్సులో తమ అనుభవాలనూ, తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులనూ వివరించారు. వారితోపాటు కశ్మీరీ పండిట్ల ప్రతినిధి ఆర్.కె. మట్టూ కూడా పాల్గొని కశ్మీర్ లోయలో తమ మానవ హక్కులకు భంగం కలుగుతున్న వైనాన్ని చెప్పారు. కేవలం ఒకవైపు వారి వాదననే వినిపిస్తే, వారికి మద్దతుగా మాత్రమే సదస్సు నిర్వహిస్తే ఆమ్నెస్టీకి ఉద్దేశాలను ఆపాదించడాన్ని అర్ధం చేసుకోవచ్చు. సదస్సులో మాట్లాడిన ఒక వక్త 2010నాటి మాఛిల్ ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురిలో ఒక యువకుడి తండ్రి. ఆ కేసులో నిరుడు మన సైనిక న్యాయస్థానం కల్నల్, కెప్టెన్లతోసహా అయిదు గురు సైనిక సిబ్బందికి యావజ్జీవ శిక్ష విధించింది. బాధిత కుటుంబాలు చెప్పినవి తమ అనుభవాలు, అక్కడ నెలకొన్న పరిస్థితులే తప్ప వేర్పాటువాదానికి లేదా మిలిటెంట్ చర్యలకు అనుకూలంగా కాదు. సదస్సులో జాతి వ్యతిరేక ప్రసంగాలు చేశారని, నినాదాలిచ్చారని ఆరోపణలొచ్చిన ఆమ్నెస్టీ ప్రతినిధి, అధ్యాపకురాలు సింధుజా అయ్యంగార్ ఆ సదస్సులోనే పాల్గొనలేదు. సీనియర్ జర్నలిస్టు సీమా ముస్తఫా బాధిత కుటుంబాలు చెబుతున్నదేమిటో సదస్సుకు వివరించారు తప్ప ఆమె విడిగా ప్రసంగించలేదు. మరొకరు తారా రావు కశ్మీర్‌పై 2015నాటి ఆమ్నెస్టీ నివేదికలో పొందుపరిచిన అంశాలను ప్రస్తావించారు. ఆ కార్యక్రమం ఆద్యం తమూ వీడియో, సీసీ టీవీ ఫుటేజ్లలో రికార్డయింది. సదస్సు ముగిసిన సమ యంలో ప్రేక్షకులుగా వచ్చినవారు ఆజాదీ నినాదాలిచ్చారని సంస్థ కూడా అంగీ కరిస్తోంది. అయితే ఒక మాటో, నినాదమో, ప్రసంగమో హింసకు కారణమ య్యాయని రుజువైన పక్షంలో తప్ప వాటిని రాజద్రోహ నేరాలుగా పరిగణించడా నికి వీల్లేదని ఈమధ్యే సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేసింది. బెంగళూరు సదస్సు తర్వాత అలాంటి హింసాత్మక ఘటనలు జరిగిన దాఖలాలు లేవు. ఆమ్నెస్టీ నిర్వాహకులపై దాఖలైన కేసులో ఎటూ దర్యాప్తు జరుగుతుంది. కానీ యావజ్జీవ శిక్షకు ఆస్కారమిచ్చే స్థాయి తీవ్రమైన చట్టాన్ని సరైన ఆధారాలు లేకుండా ఇష్టానుసారం ప్రయోగించడం సరైందేనా? ఈ కేసులో దర్యాప్తు పూర్తయితే తప్ప ముందస్తు అరెస్టులుండవని కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్ ప్రకటిస్తున్నారు. ఆ రకంగా కర్ణాటక ప్రభుత్వం చాలా ప్రజాస్వామ్యయుతంగా పనిచేస్తుందన్నట్టు చెబుతున్నారు. కానీ ఈ చట్టాన్ని విచక్షణారహితంగా ప్రయోగించడంలో కాంగ్రెస్ చరిత్ర తక్కువేమీ కాదు. ఎక్కువ కాలం దేశాన్ని పాలించడంవల్ల కావొచ్చు... ఎక్కువసార్లు దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఆ పార్టీకే దక్కింది! ముంబైలో నాలుగేళ్ల క్రితం కార్టూనిస్టు ఆసీమ్ త్రివేది ఉదంతానికి ముందూ, వెనకా ఎన్నిసార్లు ఆ చట్టాన్ని ఎవరెవరిపై అక్రమంగా, అన్యాయంగా బనాయించారో అందరికీ గుర్తుంది. బ్రిటిష్ వలసపాలకులు 1870లో రాజద్రోహ నేరాన్ని శిక్షాస్మృతిలో చేర్చారు. దేశంలో స్వాతంత్య్ర భావనలను, ఆకాంక్షలను చిదిమేయడం కోసమే ఈ దుర్మా ర్గమైన చట్టాన్ని తీసుకొచ్చారు. లోకమాన్య బాలగంగాధర తిలక్‌ను 1908లో ఈ చట్టంకిందే శిక్షించారు. మహాత్మాగాంధీ 1922లో ఈ చట్టానికి బాధితుడు. స్వతంత్ర భారతంలో వాస్తవానికి ఇలాంటి చట్టానికి చోటుండకూడదు. కానీ మన పాలకులు దాన్ని యధావిధిగా కొనసాగించారు. దుర్వినియోగం చేయడానికి అనువుగా ఎంతో అస్పష్టమైన నిబంధనలతో రూపొందిన ఈ చట్టాన్ని కనీసం మారిన పరిస్థితులకు అనుగుణంగా సవరిద్దామన్న ఆలోచన కూడా వారికి లేక పోయింది. ఆమ్నెస్టీ చరిత్ర, దాని కృషి తెలిసినవారు ఈ మాదిరి కేసులు పెట్టడాన్ని హర్షించలేరు. రాజద్రోహం సెక్షన్‌పై లా కమిషన్ వీలైనంత త్వరలో సముచిత నిర్ణయం తీసుకుంటుందని, భావ ప్రకటనాస్వేచ్ఛకు హారతులు పడుతుందని ఆశించాలి. -
నేడు పాఠశాలల బంద్: ఏబీవీపీ
సాక్షి, హైదరాబాద్: కేజీ టు పీజీ ఉచిత విద్య విధివిధానాలు తక్షణమే ప్రకటించాలని, విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ.. అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చింది. సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ మాట్లాడుతూ.. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు విద్యా సంస్థల్లో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు కేటాయించాలన్నారు. కేజీ టు పీజీ విధివిధానాలను ప్రభుత్వం తక్షణమే వెల్లడించాలన్నారు. నేడు జరిగే ఈ పాఠశాలల బంద్‌కు పరీక్షలు రాసే విద్యార్థులకు ఆటంకాలు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో ఏబీవీపీ నేతలు శ్రీధర్, రాజేంద్ర ప్రసాద్, అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. -
బాబూ.. జాబు ఎక్కడ?
నిరుద్యోగ భృతి ఏమైంది.. జాతీయ విద్యాసంస్థలను అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలి {పాంతీయ వివక్ష తగదు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఏబీవీపీ నాయకులు వైవీయూ : జాబు రావాలంటే బాబు రా వాంటూ ఎన్నికల ముందు ఊదరగొట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి ఊసే లేకుండా ఉన్నారని ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు అంజనీ శ్రీనివాస్ విమర్శిం చారు. శుక్రవారం కడప నగరంలోని హ రిత హోటల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలుత వి వేకానందుడు, సరస్వతీ చిత్రపటాలకు పూలమాల వేసి జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో అమలుకు సాధ్యం కాని హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి సంగతే మర్చిపోయారన్నారు. రైతు రుణాలు, డ్వాక్రా మహిళల రుణాల మాఫీకి నియమ నిబంధనలను వర్తింపచేసి ప్రజలను మోసం చేశారన్నారు. జాతీయ ప్రాజెక్టు పోలవరాన్ని ప్రారంభించకుండా ఎవరికో మేలు చేసేందుకు పట్టిసీమ పథకాన్ని ప్రారంభించారన్నారు. ఏబీవీపీ జాతీయ కార్యదర్శి పనతల సురేష్ మాట్లాడుతూ నిరుద్యోగులకు రూ. 2 వేలు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, తర్వాత విస్మరించారని పేర్కొన్నారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి సునీల్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయకుండా క్లస్టర్ పాఠశాలల పేరుతో విద్యార్థులు తక్కువ ఉన్నారన్న నెపంతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సమావేశంలో ఏబీవీపీ జాతీయ సహ సంఘటన కార్యదర్శి గుంతా లక్ష్మణ్, రాష్ట్ర సంఘటన కార్యదర్శి ఆదిశేషు, క్షేత్రియ సంఘటన కార్యదర్శి రామ్మోహన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమణారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు మల్లికార్జున, మాధవ, నాయకులు దామోదర్‌రెడ్డి, ఏబీవీపీ జిల్లా ప్రముఖ్ పోతుగుంట రమేష్‌నాయుడు, కన్వీనర్ రమణ, కో కన్వీనర్ సుబ్బరాజు, బాబు, 13 జిల్లాలకు చెందిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
ఏబీవీపీ కలెక్టరేట్ ముట్టడి
ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ ప్రగతినగర్ : పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. అయితే పోలీసులు అంతకుముందు గేటువేసి విద్యార్థులు కలెక్టరేట్‌లోకి రాకుండా నిలువరించారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. దీంతో ఏబీవీపీ నాయకులను పోలీసులు చెదరగొట్టారు. కొంతమందిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర నాయకురాలు గాయత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయిం బర్స్మెంట్ 2012-2013లో 1500కోట్లు ,2013-2014 లో 4,900కోట్లు పెండింగ్ లో ఉన్నాయన్నారు. దీంతో కళాశాలల యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలని పేదవిద్యార్థులపై ఒత్తిడి పెంచుతున్నాయని ఆరోపించారు. ఫీజులు చెల్లించలేక కొందరు విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. విద్యార్థి సమస్యలపై పోరాటం చేసున్న విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు అరెస్టు చేయడం, అక్రమంగా వారిపై కేసులు బనాయించడం దారుణమన్నారు. దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. అరెస్టులతో విద్యార్థుల ఉద్యమాలను అణిచివేయడం అసాధ్యమన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు విష్ణు,రాకేష్,సురేష్,తుకారంతో పాటు సుమారు రెండు వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు. -
విద్యార్థుల సమస్యలపై ఏబీవీపీ ధర్నా
శంషాబాద్: విద్యార్థుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అఖిలభారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో విద్యార్థులు శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం భారీ ధర్నా నిర్వహిం చారు. ఆయా కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తీవ్ర జాప్యం చేస్తున్నాయని, సమన్వయంతో ఈ సమస్యను పరిష్కరించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎంసెట్ కౌన్సిలింగ్ ఆలస్యం అవుతుండడంతో విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందన్నారు. ప్రభుత్వం వెంటనే సమస్యల పరిష్కారానికి చొరవచూపాలని కోరారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ రాజేందర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్.మహేందర్, ఏబీవీపీ నాయకులు నర్సింగ్, హరీష్, నరేష్, సతీష్, అశోక్, విజయ్, నాగేందర్, మనిష్, హరిష్, అరవింద్, రాజు, శ్రావణ్, భరత్, సాయికిరన్, ఆదర్శ, విష్ణు తదితరులు పాల్గొన్నారు. సాగర్ రోడ్డుపై రాస్తారోకో యాచారం: పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలభారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో శుక్రవారం సాగర్ రోడ్డుపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. గంటపాటు మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఉన్న రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు పుప్పాల శాంతికుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందని అన్నారు. వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. నిధుల మంజూరు విషయంలో నాన్చుడి ధోరణి అవలంబిస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. విద్యార్థుల ఆందోళన కారణంగా ట్రాఫిక్ జాం కావడంతో సమాచారం అందుకున్న ఎస్ఐ నర్సింహ అక్కడికి చేరుకున్నారు. విద్యార్థులకు నచ్చజెప్పి ఉప తహసీల్దార్ అన్వర్‌కు వినతిపత్రం ఇప్పించి ఆందోళన విరమింపజేశారు. మాల్లో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మారగోని శేఖర్ ఆధ్వర్యంలో సాగర్ రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమాల్లో పలువురు నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
పెరోల్‌ను రద్దు చేయండి
ముంబై: బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు పరోల్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ అఖిల బారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కార్యకర్తలు ఆయన ఇంటి ముందు గురువారం ఆందోళనకు దిగారు. అక్రమంగా ఆయుధాలు సరఫరా చేశాడన్న కేసులో అరెస్టయి జైలు శిక్ష అనుభవిస్తున్న సంజయ్‌కు పదేపదే పరోల్ ఇవ్వడం సబబు కాదని మండిపడ్డారు. నెలరోజుల పాటు సంజయ్‌కు ఇచ్చిన పరోల్‌ను రద్దు చేసి పుణేలోని యెరవాడ సెంట్రల్ జైలుకు తరలించాలని ఏబీవీపీ నగర కార్యదర్శి యదునాథ్ దేశ్‌పాండే డిమాండ్ చేశారు. కఠిన శిక్షలు పడిన ఓ వ్యక్తికి రెండు నెలల్లో రెండుసార్లు పరోల్ ఇవ్వడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. భార్య మన్యతకు ఆరోగ్యం బాగా లేదన్న విషయం ఒప్పించేలా లేదని, ఆమె అర్ధరాత్రి పార్టీలకు హాజరవుతోందని తెలిపారు. ఇక్కడ ఆందోళన జరుగుతుందన్న విషయం తెలిసిన నగర పోలీసులు దత్ నివాసానికి చేరుకున్నారు. ఏబీవీపీ జాతీయ కార్యదర్శి ఆశీష్ చౌహన్తో పాటు మరో 15 మంది కార్యకర్తలను అరెస్టు చేసి ఆ తర్వాత విడుదల చేశారు. వీళ్లు పదేపదే ఆందోళనలు చేస్తుండటంతో ఇంటి నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడేందుకు దత్ ఇష్టపడటం లేదు. ఆనారోగ్యంతో బాధపడుతున్న భార్య మాన్యతను చూసుకునేందుకు నెలరోజులపాటు పరోల్‌పై గత వారంలో దత్ జైలు నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. -
ఢిల్లీ వర్సిటీలో ఏబీవీపీ పాగా
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఢిల్లీ విశ్వవిద్యాలయంలో బీజేపీ అనుబంధ విద్యార్థి విభాగం అఖిలభారతీయ విద్యార్థి పరిషద్ (ఏబీవీపీ) పాగా వేసింది. పోటాపోటీగా జరిగిన విద్యార్థి సంఘ ఎన్నికలలో కాంగ్రెస్ అనుబంధ భారత జాతీయ విద్యార్థుల సంఘం (ఎన్ఎస్యూఐ) హవాకు గండికొట్టింది. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రభావం ఈ ఎన్నికలలో స్పష్టంగా కనిపించింది. ఆయన పేరుప్రఖ్యాతులను ఉపయోగించుకుంటూ సాగిన ఎన్నికల ప్రచారంతో వర్సిటీ విద్యార్థి సంఘంలోని మూడు అత్యున్నత స్థాయి పదవులను ఏబీవీపీ కైవసం చేసుకుంది. అధ్యక్ష, ఉపాధ్యక్ష, సంయుక్త కార్యదర్శి పదవులను వరుసగా అమన్ అవానా, ఉత్కర్ష్ చౌదరి, రాజు రావత్ దక్కించుకున్నారు. కార్యదర్శి పదవిని మాత్రం ఎన్ఎస్యూఐకి చెందిన కరిష్మా ఠాకూర్ గెలుచుకున్నారు.