బాబూ.. జాబు ఎక్కడ? | babu job ekkada..? | Sakshi
Sakshi News home page

బాబూ.. జాబు ఎక్కడ?

Published Sat, Jun 6 2015 5:42 AM | Last Updated on Tue, Oct 2 2018 8:08 PM

babu job ekkada..?

నిరుద్యోగ భృతి ఏమైంది..
జాతీయ విద్యాసంస్థలను అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలి
{పాంతీయ వివక్ష తగదు
రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఏబీవీపీ నాయకులు
 
 వైవీయూ : జాబు రావాలంటే బాబు రా వాంటూ ఎన్నికల ముందు ఊదరగొట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి ఊసే లేకుండా ఉన్నారని ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు అంజనీ శ్రీనివాస్ విమర్శిం చారు. శుక్రవారం కడప నగరంలోని హ రిత హోటల్‌లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలుత వి వేకానందుడు, సరస్వతీ చిత్రపటాలకు పూలమాల వేసి జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ముఖ్య అతిథిగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో అమలుకు సాధ్యం కాని హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి సంగతే మర్చిపోయారన్నారు. రైతు రుణాలు, డ్వాక్రా మహిళల రుణాల మాఫీకి నియమ నిబంధనలను వర్తింపచేసి ప్రజలను మోసం చేశారన్నారు. జాతీయ ప్రాజెక్టు పోలవరాన్ని ప్రారంభించకుండా ఎవరికో మేలు చేసేందుకు పట్టిసీమ పథకాన్ని ప్రారంభించారన్నారు.

ఏబీవీపీ జాతీయ కార్యదర్శి పనతల సురేష్ మాట్లాడుతూ నిరుద్యోగులకు రూ. 2 వేలు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, తర్వాత విస్మరించారని పేర్కొన్నారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి సునీల్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయకుండా క్లస్టర్ పాఠశాలల పేరుతో విద్యార్థులు తక్కువ ఉన్నారన్న నెపంతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

సమావేశంలో ఏబీవీపీ జాతీయ సహ సంఘటన కార్యదర్శి గుంతా లక్ష్మణ్, రాష్ట్ర సంఘటన కార్యదర్శి ఆదిశేషు, క్షేత్రియ సంఘటన కార్యదర్శి రామ్‌మోహన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమణారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు మల్లికార్జున, మాధవ, నాయకులు దామోదర్‌రెడ్డి, ఏబీవీపీ జిల్లా ప్రముఖ్ పోతుగుంట రమేష్‌నాయుడు, కన్వీనర్ రమణ, కో కన్వీనర్ సుబ్బరాజు, బాబు, 13 జిల్లాలకు చెందిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement