భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించిన తొలినాళ్లలో దేశంలోని విద్యార్థి యువకుల శక్తిని సంఘటిత పరిచేందుకు పురుడు పోసుకుంది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. వ్యక్తి నిర్మాణం ద్వారానే జాతీయ పునర్నిర్మాణం సాధ్యమని స్వామి వివేకానంద స్ఫూర్తితో అంచె లంచెలుగా విస్తరిస్తూ, 73 ఏళ్ళ సుదీర్ఘ ప్రస్థానంలో నేడు ప్రపంచంలోనే శక్తిమంతమైన విద్యార్థి సంస్థగా వెలుగొందుతోంది.
దేశం పేరు భారత్ ఉంచాలన్న తొలి డిమాండ్, వందేమాతర గీతాన్ని జాతీయ గీతంగా గుర్తించా లనే రెండవ డిమాండ్ చేస్తూ, జ్ఞాన్, శీల్, ఏకతా అని నినదిస్తూ, కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు విరాజిల్లుతూ, పొరుగు దేశం నేపాల్‌లోనూ తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. దేశంలోని అనేక మంది కీలక రాజకీయ నాయకులు ఒక ప్పుడు ఏబీవీపీ కార్యకర్తలే అని గమనిస్తే, అది యువతలో నాయకత్వ లక్షణాలను నింపే కర్మా గారం అన డంలో ఎలాంటి సందేహం లేదు.
దేశ వ్యాప్తంగా కళాశాల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు 4,500 నగరాలు, పట్టణాల్లో 33 లక్షల సభ్యత్వం కలిగివుండటంతో పాటు, ప్రపంచ దేశాల నుండి భారత్ వచ్చి చదువుకునే విద్యార్థుల కోసం డబ్ల్యూఓఎస్‌వై, సామాజిక స్పృహతో పని చేయడానికి ఎస్‌ఎఫ్‌డీ, ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులకై రాష్ట్రీయ కళామంచ్, కేంద్రీయ విద్యా సంస్థల్లో థింక్ ఇండియా... ఇలా ప్రజాస్వామ్య ప్రపం చంలోనే అతి పెద్ద విద్యార్థి సంస్థగా ఏబీవీపీ అవతరించింది.
కశ్మీరీ విద్యార్థుల కోసం దేశవ్యాప్తంగా 1990 సెప్టెంబర్ 11న చేపట్టిన చలో కశ్మీర్ యువతను చైతన్యపరిచిన ఒక మహోద్యమం. అస్సాం చొరబాటు దారులకు వ్యతిరేకంగా అస్సాంను కాపా డండి, దేశాన్ని రక్షించండి అనే నినాదంతో 1983 అక్టోబర్ 2న గౌహతిలో భారీ ప్రదర్శన జరిపింది. బంగ్లాదేశ్ చొరబాటుదారులకు వ్యతిరేకంగా చలో చికెన్‌నెక్ పేరుతో 2008 డిసెంబర్ 17న బెంగాల్ సరిహద్దుల్లో 40 వేల మంది విద్యార్థులతో భారీ ఆందోళన నిర్వహించింది. భారతీయులను బానిస లుగా మార్చే మెకాలే విద్యా విధానాన్ని మార్చి జాతీయ విద్యా విధానం–2020 కార్యరూపం దాల్చేలా పోరాడింది.
మహమ్మారి ఆపత్కాలంలో మేమున్నామంటూ పరిషత్ నిర్ణయంతో దేశవ్యాప్తంగా తరలిన కార్యకర్తల సేవాభావం వెలకట్టలేనిది. కరోనా సోకి దిక్కుతోచని స్థితిలో ఉన్న కుటుంబాలకు వైద్య సహాయం, భోజనాలు అందించడం, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం, ఉపాధి కోల్పోయిన పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువుల పంపిణీ, ఏడాదిన్నర నుండి తరగతి గది అభ్యసనానికి దూరమైన విద్యార్థులకు ఎక్కడికక్కడ పరిషత్ పాఠశాల పేరుతో ట్యూషన్స్ చెప్పడంలాంటి అనేక కార్య క్రమాలను ఏబీవీపీ చేపట్టింది.
- ప్రవీణ్‌రెడ్డి
రాష్ట్ర కార్యదర్శి, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, తెలంగాణ
Comments
Please login to add a commentAdd a comment