విద్యార్థుల్లో జాతీయభావాలు దేశభక్తి సామాజిక స్పృహతోపాటు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు అంజనీశ్రీనివాస్ సూచించారు.
ముగిసిన ఏబీపీపీ జిల్లా మహాసభలు
హిందూపురం అర్బన్ : విద్యార్థుల్లో జాతీయభావాలు దేశభక్తి సామాజిక స్పృహతోపాటు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు అంజనీశ్రీనివాస్ సూచించారు. హిందూపురంలో రెండు రోజులగా నిర్వహించిన ఏబీవీపీ జిల్లా మహాసభలు ఆదివారం ముగిశాయి. ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ విద్యరంగాన్ని ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.
హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులనుఅరికట్డడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. వీరి రక్షణకు ప్రత్యేక మహిళా స్పెషల్ ఫోర్సును ఏర్పాటు చేయాలన్నారు. కఠినమైన శిక్షలు అమలు చేయాలని కోరారు. రాయలసీమంలో తలమానీకమైన జెఎన్‌టీయూ అభివృద్ధికి ప్రతిఏడాది రూ.100కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హిందూపురంలో ఐటీ కారిడర్‌ను వెంటనే ఏర్పాటుచేసి, సెరికల్చర్, ఆర్టికల్చర్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ వంటి పరిశ్రమలు నెలకొల్పాలన్నారు. ఏబీవీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తిరుమలరెడ్డి, జాతీయ కార్యవర్గసభ్యుడు కరణాకర్‌లు కూడా ప్రసంగించారు. ఏబీవీపీ రాష్ట్ర సంయుక్తకార్యదర్శి నాగర్జున, జిల్లా కన్వీనర్ సునీల్‌కుమార్, సప్తగిరికళాశాల ప్రిన్సిపాల్ ఈశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.