hindhupuram
-
ఏడేళ్ల క్రితం వివాహం.. వరకట్న వేధింపులకు వివాహిత బలి
హిందూపురం: వరకట్న వేధింపులకు ఓ వివాహిత బలైంది. అత్తింటి వారి ఒత్తిళ్లు తాళలేక ఆత్మహత్య చేసుకుంది. పట్టణంలోని లక్ష్మీపురంలో చోటు చేసుకున్న ఈ ఘటనపై టూటౌన్ సీఐ సూర్యనారాయణ తెలిపిన వివరాలు.. కర్ణాటక రాష్ట్రం చిక్బళ్లాపురం తాలుకా పెరేసంద్ర గ్రామానికి చెందిన మోనిసా (34)కు హిందూపురానికి చెందిన రియాజ్‌తో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కుమారుడు, మూడేళ్ల కుమార్తె ఉన్నారు. గత రెండేళ్ల నుంచి భర్తతోపాటు అత్త ఫిరోజ్‌బీ వరకట్నం తీసుకురావాలంటూ ఆమెను వేధిస్తున్నారు. ఈ వేదన తాళలేక మోనిసా బు«ధవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి బంధువులు మాత్రం కట్నం కోసం అత్తింటి వారే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని గురువారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సీఐ తెలిపారు. ఆసుపత్రి వద్ద మోనిసా బంధువులతో డీఎస్పీ రమ్య మాట్లాడారు. వరకట్న వేధింపులతో ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా కేసు నమోదు చేశామని, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా చర్యలు చేపడతామని డీఎస్పీ వివరించారు. -
హిందుపురంలో సడలింపులు ఉండవు
-
‘బాలయ్య హిందూపురాన్ని పేటీఎంలా వాడుకుంటున్నాడు’
సాక్షి, అనంతపురం : సినిమాల్లోలాగా కనుసైగ చేస్తే సుమోలు లేవవనే విషయాన్ని బాలయ్య గుర్తుంచుకోవాలని ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ హితవు పలికారు. గురువారం బాలయ్య తన సొంత నియోజకవర్గమైన హిందూపురంలోకి రాగా.. రాయలసీమ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ప్రజా సంఘాలు నిరసన తెలిపిన విషయం తెలిసిందే. బాలకృష్ణ కాన్వాయ్‌ను అడ్డుకుని ‘బాలకృష్ణ గోబ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. ఈ విషయంపై మహమ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ.. బాలకృష్ణ కనుసైగ చేస్తే ఏమయ్యేది అనడం ఆయన మానసిక స్థితి ఎలా ఉందో తెలియ జేస్తోందని అన్నారు. గత 30 సంవత్సరాల నుంచి హిందూపురం బాలయ్య కుటుంబానికి పట్టం కడితే నియోజకవర్గ అబివృద్ధిపై దృష్టి పెట్టకుండా ప్రైవేటు కార్యక్రమలకు సంవత్సరానికి రెండు, మూడు సార్లు వచ్చిపోతున్నారని ధ్వజమెత్తారు. బావ చంద్రబాబు అమరావతిని ఏటీఎంలా వాడుకుంటే బావమరిది బాలకృష్ణ హిందూపురాన్ని పేటీఎంలా వాడుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. హిందూపురానికి తాగునీరు తెచ్చే అమృత్ పథకంలో తెలుగు దొంగల అవినీతి త్వరలో బయట పడుతుందని తెలిపారు. -
ఉవ్వెత్తున ఆగ్రహ జ్వాల
సాక్షి: పరిపాలన, అధికార వికేంద్రీకరణకు అడ్డుపడుతున్న తెలుగుదేశం పార్టీ వైఖరిని వ్యతిరేకిస్తూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఉవ్వెత్తున నిరసనలు ఎగసిపడ్డాయి. చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. అనేకచోట్ల మానవహారాలు నిర్వహించారు. మరికొన్నిచోట్ల చంద్రబాబు దిష్టిబొమ్మలను చెప్పులతో కొట్టి ప్రజలు తమ ఆగ్రహాన్ని చాటుకున్నారు. విశాఖ నగరంతో పాటు జిల్లాలో పలుచోట్ల ఆందోళనలు ఉవ్వెత్తున సాగాయి. చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లును శాసన మండలిలో కుట్రపూరితంగా అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఎన్ఏడీ, మద్దిలపాలెం జంక్షన్లలో పెద్దఎత్తున మానవహారాలు నిర్వహించారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన విశాఖపైనే విషం కక్కుతున్న వెలగపూడి రామకృష్ణ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎంవీపీ కాలనీలోని ఆయన ఇంటివద్ద బుధవారం రాత్రే ఆందోళనలు మొదలయ్యాయి. గురువారం సాయంత్రం మరోసారి ప్రజలు భారీఎత్తున తరలివెళ్లి ముట్టడించారు. చంద్రబాబు దిష్టిబొమ్మతో శవయాత్ర చేశారు. తర్వాత ఆ బొమ్మను దహనం చేశారు. ఇక కొమ్మాది, చోడవరంలో, బుచ్చయ్యపేట మండలం వడ్డాది, రావికమతంలోనూ నిరసనలు వెల్లువెత్తాయి. రోలుగుంట మండల కేంద్రంలో మానవహారం నిర్వహించారు. నక్కపల్లిలో వైఎస్సార్సీపీ నేతలు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనకాపల్లిలో జరిగిన నిరసన ప్రదర్శనలో భారీఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీష్ దిష్టిబొమ్మను దహనం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు ధరించి మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. మంత్రి కన్నబాబు తండ్రి కురసాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లాలోనూ పలుచోట్ల చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. నర్సాపురంలో వైఎస్సార్సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు పీడీ రాజు ఆధ్వర్యంలో అంబేడ్కర్ సెంటర్లో మానవహారం నిర్వహించి, రాస్తారోకో చేశారు. తణుకు, అత్తిలి, ఇరగవరం, తాడేపల్లిగూడెంలలో చంద్రబాబువి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఎమ్మెల్సీలు ఫరూక్ ఆఫీసు, బీటీ నాయుడు ఇల్లు ముట్టడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తమయ్యాయి. కర్నూలులో రాయలసీమ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ బి.సత్యన్న, న్యాయవాదుల జేఏసీ చైర్మన్ వై.జయరాజు ఆధ్వర్యంలో భారీఎత్తున ధర్నా నిర్వహించారు. చంద్రబాబు దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి నిరసన వ్యక్తంచేశారు. నంద్యాలలో విద్యార్థి సంఘాలు ఎమ్మెల్సీ ఫరూక్ కార్యాలయాన్ని ముట్టడించాయి. అనంతరం చంద్రబాబు చిత్రపటాలను, దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆదోనిలో న్యాయవాదులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. రాయలసీమ విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు ఇంటిని ముట్టడించి, ఆయన ఇంటి గేటుకు వినతిపత్రాన్ని అంటించి నిరసన తెలిపారు. ఆళ్లగడ్డలో న్యాయవాదులు బైక్ ర్యాలీ నిర్వహించి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మిగనూరు, నందికొట్కూరు తదితర ప్రాంతాల్లోనూ నిరసనలు కొనసాగాయి. చిత్తూరు జిల్లా పుంగనూరు, నిండ్ర, ఐరాల మండలంలో పార్టీ నేతలు చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉత్తరాంధ్ర వెన్నుపోటుదారుడు అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్ర వెన్నుపోటుదారుడు అచ్చెన్నాయుడు డౌన్..డౌన్.. అంటూ సాగిన నినాదాలతో శ్రీకాకుళం జిల్లా టెక్కలి మార్మోగింది. అమరావతి భూ మాఫియా కోసం ఉత్తరాంధ్ర ద్రోహిగా మిగలవద్దని అచ్చెన్న సొంత నియోజకవర్గంలోనే ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. టెక్కలిలో పట్టణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు తమ్మన్నగారి కిరణ్ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించి చంద్రబాబు, అచ్చెన్నాయుడు దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త, డీసీఎంఎస్ చైర్మన్ పిరియా సాయిరాజ్ ఆధ్వర్యంలో ధర్మపురంలో భారీ ర్యాలీ నిర్వహించారు. హిందూపురంలో అర్ధనగ్న ప్రదర్శన అనంతపురం జిల్లా హిందూపురంలో ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ఆదేశాలతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అర్ధ నగ్నంగా ర్యాలీ నిర్వహిస్తూ చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ దిగజారుడు రాజకీయంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు, బాలకృష్ణ సీమ ద్రోహులని మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీ మండిపడ్డారు. బాబు దిష్టిబొమ్మను చెప్పులతో కొడుతూ.. విజయనగరంలో చంద్రబాబు దిష్టిబొమ్మకు చెప్పుల దండవేసి కాళ్లతో కొడుతూ నిరసన వ్యక్తంచేశారు. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు. టీడీపీ నేతలు, ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి నిరోధకులుగా మారారని మండిపడ్డారు. అలాగే, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రతిపక్షం అడుగడుగునా ఆటంకాలు సృష్టించటం సమంజసం కాదని వైఎస్సార్సీపీ మహిళా విభాగం గుంటూరు నగర అధ్యక్షురాలు గనిక ఝాన్సీరాణి విమర్శించారు. వికేంద్రీకరణ అంశంపై చంద్రబాబు తీరును వ్యతిరేకిస్తూ ఆయన చిత్రపటాన్ని మహిళలు పాదరక్షలతో కొట్టి నిరసన తెలిపారు. -
టీడీపీ కంచుకోట బద్దలు!
సాక్షి, అనంతపురం: తెలుగుదేశం పార్టీ కంచుకోట బద్దలైంది. ఆ పార్టీకి ఎదురులేని హిందూపురం పార్లమెంటు నియోజకవర్గాన్ని వైఎస్సార్సీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ విజయకేతనం ఎగురవేశాడు. ఏకంగా 1.38 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో గెలిచి రికార్డు సృష్టించాడు. గురువారం స్థానిక ఎస్కేయూ క్యాంపస్‌లో కౌంటింగ్ ప్రక్రియ సాగింది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కౌంటింగ్ ప్రారంభమైంది. ఓవైపు పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తూనే మరోవైపు ఈవీఎంలను లెక్కించారు. మొత్తం 25 రౌండ్లు సాగిన కౌంటింగ్ తొలిరౌండ్ నుంచే గోరంట్ల మాధవ్ తన సమీప అభ్యర్థి నిమ్మల కిష్టప్పపై స్పష్టమైన మెజార్టీ కనబరిచాడు. నిమ్మల కిష్టప్ప ఏదశలోనూ పోటీనివ్వలేకపోయాడు. తొలిరౌండులో 9184 ఓట్ల ఆధిక్యంతో గోరంట్ల మాధవ్ బోణీ చేశాడు. అప్పటి నుంచి తిరిగిచూడలేదు. మొత్తం 25 రౌండ్లు కౌంటింగ్ జరగగా టీడీపీ అభ్యర్థి నిమ్మల కిష్టప్ప 17వ రౌండులో 1090 ఓట్లు, 24వ రౌండులో 225 ఓట్లు ఆధిక్యత సాధించాడు. తక్కిన 23 రౌండ్లు వైఎస్సార్సీపీ ఆధిక్యత చాటింది. మొత్తం 13,23,991 ఈవీఎం ఓట్లు పోలయ్యాయి. వీటిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి 6,98,422 ఓట్లు సాధించగా, టీడీపీ అభ్యర్థికి 5,60,113 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి కేటీ శ్రీధర్ 26,934 ఓట్లు సాధించాడు. ఇక నాల్గోస్థానంలో ‘నోటా’కు 17,320 ఓట్లు వచ్చాయి. అలాగే భారతీయ జనతాపార్టీ అభ్యర్థి మిట్టా పార్థసారథి 13,485 ఓట్లు సాధించాడు. ఇతరులు 7717 ఓట్లు దక్కించుకున్నారు. గోరంట్ల మాధవ్ రౌండు రౌండుకు మెజార్టీ పెరుగుతుండడంతో పార్టీ శ్రేణులు కౌంటింగ్ కేంద్రం ఆవరణలోనే ఆయన్ను హత్తుకుని గంతులేశారు. మెజార్టీపై చర్చ హిందూపురం ఎంపీ అభ్యర్థిగా గోరంట్ల మాధవ్ సాధిచిన మెజార్టీపై నియోజకవర్గంలోని అన్ని నియోజకవర్గాల ప్రజల్లో విపరీతమైన చర్చ జరిగింది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన 2004 ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రమంతా వైఎస్సార్ గాలి వీచింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ హిందూపురం ఎంపీగా బరిలో నిలిచిన కర్నల్ నిజాముద్దీన్ కేవలం 1840 ఓట్లతో గట్టెక్కాడు. వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్థాపించిన వైఎస్సార్సీపీ తరపున ఈ ఎన్నికల్లో బరిలో నిలిచిన గోరంట్ల మాధవ్ ఏకంగా 1,38,309 ఓట్లు మెజార్టీ సాధించడం చర్చనీయాంశమైంది. సామాన్యుడిని బరిలో దింపి.. హిందూపురం ఎంపీ అభ్యర్థిగా ఎవరూ ఊహించిన విధంగా వైఎస్సార్సీపీ సామాన్యుడైన మాధవ్‌ను బరిలో దింపింది. పోలీసుశాఖలో ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల బరిలో నిలిచాడు. కురుబ కులానికి చెందిన మాధవ్‌ను పోటీలో పెట్టడంతో అధికార పార్టీ నాయకులు హేళన చేశారు. ఆర్థికంగా, రాజకీయంగా బలమైన నాయకుడైన నిమ్మల కిష్టప్ప విజయం నల్లేరుమీద నడకే అని అధికార పార్టీ భావించింది. అయితే వారి అంచనాలు పటాపంచలు చేస్తూ మాధవ్ వైఎస్సార్సీపీ జెండా ఎగురవేశారు. -
జయహో బీసీ
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం, హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్‌లను ఆ పార్టీ ఖరారు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంట్ స్థానాల్లో 9 స్థానాలకు బరిలో నిలిచే అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించారు. ఇందులో జిల్లాకు చెందిన రెండు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. జిల్లాలోని బీసీల్లో మెజార్టీ వర్గంగా ఉన్న బోయ సామాజికవర్గం నుంచి రంగయ్య, కురుబ సామాజిక వర్గం నుంచి మాధవ్‌కు టిక్కెట్లు కేటాయించారు. దీంతో బీసీల అభ్యన్నుతికి, రాజకీయ ఉన్నతికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో కట్టుబడి ఉందని వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేసినట్లయింది. ఈ నిర్ణయంపై జిల్లా వ్యాప్తంగా బీసీల్లో హర్షం వ్యక్తమవుతోంది. పైగా ఇద్దరూ రాజకీయాలకు కొత్త ముఖాలే. విద్యావంతుడైన రంగయ్యను, పోలీసు శాఖలో డైనమిక్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్న మాధవ్‌లను పార్టీలో చేర్చుకుని పార్లమెంట్ బరిలో నిలపడంతో సామాన్యులు కూడా చట్టసభల్లోకి వెళ్లడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని చెప్పినట్లయింది. పోలీసు నుంచి ఎంపీ అభ్యర్థి దాకా.. గోరంట్ల మాధవ్ అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పీజీ, లా కోర్సు పూర్తి చేశారు. 1996 బ్యాచ్ ఎస్ఐగా పోలీసు శాఖలోకి ప్రవేశించారు. అనంతపురం నగరంలోని సిద్ధప్ప జ్యూవెలర్స్ అధినేత రేవన సిద్ధప్ప మనువరాలును వివాహం చేసుకుని ఇక్కడే స్థిరపడ్డారు. ఉద్యోగ నిమిత్తం పలు స్టేషన్లలో పనిచేసిన ఆయన 2003 నుంచి జిల్లాలోని పలు స్టేషన్లలో ఎస్ఐగా, ఆ తర్వాత సీఐగా విధులు నిర్వహించారు. ఉద్యోగ జీవితంలో నిజాయతీ అధికారిగా, లా అండ్ ఆర్డర్ అమలులో రాజీపడని పోలీసుగా మాధవ్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కీలకభూమిక పోషించి వారి అభ్యున్నతికి తన వంతు కృషి చేశారు. గ్రూప్–1 అధికారి నుంచి... తలారి రంగయ్య అనంతపురం జిల్లాకు పీడీ రంగయ్యగా సుపరిచితులు. 21 ఏళ్లు గ్రూప్–1 అధికారిగా పని చేశారు. ఇంకా 13 ఏళ్ల సర్వీస్ ఉంది. 2018 ఫిబ్రవరి 14న వీఆర్ఎస్ ఆమోదం పొందింది. 1997లో ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్–1 అధికారిగా ఎంపికై చేనేత జౌళిశాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరారు. 1998–99 చిత్తూరు జిల్లాలో, తర్వాత 1999 నుంచి 2002 వరకు నెల్లూరు జిల్లాలో పని చేశారు. ఆ తర్వాత 2002 నుంచి 2006 వరకు ప్రకాశం జిల్లా మార్కాపురంలో వెలుగు ప్రాజెక్ట్‌లో.. 2006–07లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అడిషనల్ డైరెక్టర్‌గా అనంతపురంలో సేవలందించారు. 2007 నుంచి 2009 వరకు కడప మెప్మా డైరెక్టర్‌గా పని చేశారు. 2009లో వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్‌గా.. 2009 నుంచి 2012 వరకు అనంతపురం డీఆర్డీఏ పీడీగా ఉన్నారు. 2012–13లో హిందూపురం మునిసిపల్ కమిషనర్‌గా, 2013–14లో అనంతపురం మునిసిపల్ కమిషనర్‌గా పని చేశారు రాష్ట్ర భవిష్యత్తు వైఎస్ జగన్ వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర భవిష్యత్తు. రాష్ట్ర విభజన అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరు చాలా బాధిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగిగా ప్రశ్నించలేకపోయా. రాష్ట్ర అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిస్థితుల్లో కమిట్మెంట్ రాజకీయాలు చేస్తున్న యువకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి మద్దతు తెలిపి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఉద్యోగానికి రాజీనామా చేసి పార్టీలో చేరా. అత్యంత సామాన్యులకు సైతం పెద్దపీట వేసి రాజకీయ భవిష్యత్తు కల్పించిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి జన్మంతా రుణపడి ఉంటా. – తలారి రంగయ్య బీసీలకు ఇచ్చిన గౌరవం పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాననే ప్రకటన ఉద్వేగానికి గురిచేస్తోంది. సామాన్య కుటుంబంలో జన్మించా. పోలీసు ఉద్యోగం అంటే నాకు చాలా ఇష్టం. ఎలాగైనా డిపార్ట్మెంట్లోకి రావాలనే పట్టుదలతో ఎస్ఐగా వచ్చా. ఆ తర్వాత నాయకుల పరిస్థితి, స్టేషన్లకు వచ్చే ప్రజల సమస్యలు చూసి రాజకీయాల్లోకి రావాలనే కాంక్ష ఉండేది. వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరు, పట్టుదల చూసిన తర్వాత ఆయన నాయకత్వంలో పనిచేయాలనే కోరికతోనే వైఎస్సార్సీపీలో చేరా. ఇప్పుడు పురం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటా. ఇది బీసీలకు మా పార్టీ ఇచ్చిన గౌరవం. అలాగే ‘అనంత’ పార్లమెంట్ అభ్యర్థి రంగయ్యకు అభినందనలు. కచ్చితంగా రెండు పార్లమెంట్ స్థానాలను గెలవబోతున్నాం. జగన్మోహన్రెడ్డి సీఎం కాబోతున్నారు. ప్రజలు మళ్లీ రాజన్న రాజ్యం చూడబోతున్నారు. – గోరంట్ల మాధవ్ -
గోరంట్ల మాధవ్‌కు కీలక బాధ్యతలు
సాక్షి, అనంతపురం : హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్తగా గోరంట్ల మాధవ్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియమించింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. పోలీసు శాఖలో సీఐగా పనిచేసిన గోరంట్ల మాధవ్ ఇటీవలే వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్ జగన్ సుదీర్ఘ పాదయాత్రతో రాజకీయాలవైపు ఆకర్షితులైన ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి పార్టీలో చేరారు. కదిరి సీఐగా పనిచేసే సమయంలో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జేసీ దివాకర్ రెడ్డికి పోలీసుల పవరేంటో చూపిస్తానని గోరంట్ల మాధవ్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. తాడిపత్రిలోని ప్రభోదానంద ఆశ్రమ వివాద నేపథ్యంలో జేసీ.. పోలీసులు హిజ్రాల్లా వ్యవహరిస్తున్నారని కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందించిన గోరంట్ల మాధవ్.. నోరు అదుపులో పెట్టుకోవాలనీ, ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే నాలుక కోస్తామని హెచ్చరించారు. ‘మేము మగాళ్లం’ అంటూ మీడియా ఎదుట మీసం తిప్పారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. -
అన్నా క్యాంటీన్లో వ్యభిచార బాగోతం!
సాక్షి, హిందూపురం : అనంతపురం జిల్లా హిందూపురంలోని అన్నా క్యాంటీన్లో వ్యభిచార బాగోతం బట్టబయలు అయ్యింది. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న అన్నా క్యాంటీన్లో రాత్రి వేళల్లో వ్యభిచారం జరుగుతోందన్న ఆరోపణలు చాలా రోజుల నుంచి వినిపిస్తున్నాయి. కాగా శనివారం రాత్రి వాచ్మెన్ జయరాం ఓ మహిళతో రాసలీలలు జరుపుతుండగా స్థానికులు పట్టుకున్నారు. అనంతరం మీడియాకు సమాచారమిచ్చారు. అన్నా క్యాంటీన్ మేనేజర్ కృష్ణా, వాచ్మెన్ జయరాంలను మీడియా ప్రతినిధులు నిలదీయటంతో వారు పొంతనలేని సమాధానాలు ఇవ్వటం పలు అనుమానాలకు తావిస్తోంది. చివరకు పోలీసులకు సమాచారం ఇచ్చినా కనీసం విచారించకుండానే అందర్నీ వదిలేయటం చర్చనీయాంశంగా మారింది. -
వేధిస్తున్న బాలయ్య పీఏ
అనంతపురం, హిందూపురం అర్బన్: గ్రూపు రాజకీయాలతో కొందరికే ప్రాధాన్యతనిస్తూ మరికొందరిని ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ వీరయ్య వేధిస్తున్నారంటూ చిలమత్తూరు టీడీపీ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు ఆ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ నారాయణ, మండల మాజీ కన్వీనర్ బాబురెడ్డి, శెట్టిపల్లి ఎంపీటీసీ సభ్యుడు ప్రవీణ్, రామచంద్రారెడ్డి, మధుశేఖర్‌రెడ్డి సోమవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులందరి సమక్షంలో బాబురెడ్డిని పార్టీ మండల కన్వీనర్‌గా ఎన్నుకున్నారని గుర్తు చేశారు. అయితే వీరయ్య తనకు అనుకూలంగా ఉన్న రంగారెడ్డిని కన్వీనర్‌గా ప్రకటించి పెత్తనం చెలాయిస్తున్నారన్నారు. 2014లో పంచాయతీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ప్రవీణ్‌కుమార్ గెలుపునకు అప్పుడు కన్వీనర్‌గా ఉన్న రంగారెడ్డి కృషి చేయకుండా స్వతంత్ర అభ్యర్థికి మద్దతు పలికాడని గుర్తు చేశారు. పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తికి మండల బాధ్యత అప్పగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అభివృద్ధి విషయంగా పీఏను అడిగితే రంగారెడ్డి చెప్పిందే చేయాలంటూ నిబంధనలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా రుణాల మంజూరులోనే అర్హులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాప్రతినిధులను పోలీస్‌స్టేషన్‌కు రప్పించుకుని పంచాయితీలు చేస్తూ అభివృద్ధి పనులు కట్టబెడుతున్నారన్నారు. పీఏ వీరయ్య విషయంపై బాలయ్యకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. -
పురంలో సర్వే కలకలం
హిందూపురం అర్బన్: ‘‘స్పార్క్ సోషియో పొలిటికల్ అనాలసిస్ అండ్ రిఫ్రెష్ సెంటర్’’ పేరుతో శుక్రవారం హిందూపురంలో కొందరు యువకులు చేస్తున్న ఓ సర్వే కలకలం రేపింది. వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్లు, సానుభూతిపరులను సర్వే చేస్తున్న యువకులు.. ఓటరు లిస్టులో పేరు పక్కన రెడ్‌మార్క్ పెట్టడం గమనించిన ప్రతిపక్ష పార్టీ నేతలు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇంటింటి సర్వే కోసం అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన డిగ్రీ చదివిన 12 మంది యువకులకు కొందరు హిందూపురం తీసుకువచ్చారు. వారికున్న గైడ్‌లైన్స్ మేరకు వీరంతా శుక్రవారం పట్టణంలో వార్డుల వారీగా సర్వే చేపట్టారు. ముఖ్యంగా బూత్ కన్వీనర్లు, వార్డుల వారీగా బలమైన కార్యకర్తలు, నాయకుల గురించి సర్వే చేస్తున్నారు. అలాగే ఇంటింటికీ వెళ్లి టీడీపీ పాలన ఎలా ఉంది..? ఎవరికి ఓటు వేస్తారు..? అని ప్రశ్నిస్తూ వివరాలు రాబడుతున్నారు. ఎవరైనా వైఎస్సార్సీపీకి ఓటు వేస్తామని చెబితే ఓటరులిస్టులో వారి నంబర్ పక్కన చుక్కలు పెడుతున్నారు. ఎవరైనా గట్టిన నిలదీస్తే సర్వే చేస్తున్న యువకులు పలాయనం చిత్తగిస్తున్నారు. ఇది తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నేతలు సదరు యువకులను ప్రశ్నించగా...వారు సరైన సమాధానం ఇవ్వలేదు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ చిన్నగోవిందు, సిబ్బంది అక్కడికి చేరుకుని సర్వేచేస్తున్న యువకులను వద్ద ఉన్న ట్యాబ్‌లు, సర్వే బుక్కులు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని టుటౌన్ పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లి విచారణ చేపట్టారు. వైఎస్సార్ సీపీ నేతలపై కేసులకు యత్నం సర్వేచేస్తున్న యువకుల్ని పట్టించిన వైఎస్సార్సీపీ నాయకులపైనే కేసు బనాయించే విధంగా పోలీసులపై ఒత్తిడి పెరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే తమను కొట్టారని.. నిర్బంధించి దూషించారని యువకుల నుంచి పోలీసులు ఫిర్యాదు తీసుకున్నారు. కొందరు టీడీపీ నేతలు నేరుగా పోలీసుస్టేషన్‌కు వచ్చి సర్వేకోసం వచ్చిన యువకులను కలుసుకుని వారితో ఫిర్యాదు ఇప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది రాజ్యాంగ విరుద్ధం సర్వే పేరుతో వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్లు, నాయకులు, ఓటర్ల వివరాలు సేకరించడం పూర్తిగా రాజాంగ్య విరుద్ధం. దీనిపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేయాలి. ప్రజాస్వామ్యంలో ఓటరును భయపట్టడం... ప్రభావితం చేసేలా చేయడం నేరం. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓటరు నంబర్లు గుర్తించి తొలగించడానికి టీడీపీ నాయకులు చేస్తున్న కుట్ర ఇది. – నవీన్‌నిశ్చల్, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త -
ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్- బాలకృష్ణ
-
హలో..
కృష్ణగాడి వీర ప్రేమ గాథతో ప్రేక్షకుల మనసు దోచుకున్న హీరోయిన్ మెహరీన్ శుక్రవారం హిందూపురంలో సందడి చేశారు. తాజాగా రాజా ది గ్రేట్‌లో తన నటనతో ఆకట్టుకున్న ఈ బొద్దుగుమ్మ ‘బీ న్యూ’ మొబైల్ షోరూంను ప్రారంభించారు. అనంతరం లేపాక్షి ఆలయాన్ని సందర్శించి అక్కడి శిల్పకళ తనను కట్టి పడేసిందని సంతోషం వ్యక్తం చేశారు. అభిమాన హీరోయిన్ను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున గూమికూడారు. హిందూపురం అర్బన్: అభిమానుల ప్రేమానురాగాలు ఎన్నటికీ మరువలేనివని ప్రముఖ సినీ తార మెహ్రీన్ పిర్జాడ అన్నారు. పట్టణంలోని డీఎల్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన బీన్యూ మొబైల్ షోరూమ్‌ను శుక్రవారం ఆమె వేలాది మంది అభిమానుల కేరింతల నడుమ ప్రారంభించారు. బీన్యూ షోరూం అధినేత వై.డి.బాలాజీ చౌదరితో కలిసి షోరూంను ప్రారంభించి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హిందూపురానికి రావడం ఇది రెండవసారి అని, అదే అభిమానాన్ని చూపుతున్న ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. షోరూంలో ఆకర్షణీయమైన సెల్ఫోన్లు రూ.499 ధర నుంచి రూ.లక్ష వరకు అందుబాటులో ఉన్నాయన్నారు. నాణ్యమైన సెల్పోన్లతో పాటు వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తున్న షోరూంను ప్రతి ఒక్కరూ సందర్శించాలన్నారు. షోరూం అధినేత బాలాజీ చౌదరి మాట్లాడుతూ ప్రస్తుతం హిందూపురంలో ప్రారంభించిన షోరూం నవ్యాంధ్రాలో 42వ షోరూం కాగా.. జిల్లాలో నాల్గవదని తెలిపారు. 2018 సంవత్సరం పూర్తయ్యేలోపు ఏపీలో 100 షోరూంలో ప్రారంభించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. హీరోయిన్ రాక నేపథ్యంలో సీఐలు చిన్నగోవిందు, తమీంఅహమ్మద్లు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. లేపాక్షి సందర్శన లేపాక్షి: పర్యాటక ప్రాంతమైన లేపాక్షి ఆలయాన్ని సినీనటి మెహ్రీన్ పిర్జాడ శుక్రవారం ఉదయం సందర్శించారు. ఆమెకు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలోని శిల్పాలు, చిత్రలేఖనాలను తిలకించి సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఆలయంలోని వీరభద్రస్వామి, దుర్గాదేవి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టతను అర్చకులను అడిగి తెలుసుకున్నారు. -
వైఎస్సార్ జనతా క్యాంటీన్ ప్రారంభం
హిందూపురం అర్బన్: మధ్యతరగతి, పేదల ప్రజలతో పాటు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు చేయూతనందించాలనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరిట జనతా క్యాంటీన్ ను ప్రారంభించినట్లు హిందూపురం వైఎస్సార్సీపీ సమన్వయకర్త నవీన్ నిశ్చల్ తెలిపారు. గురువారం స్థానిక చిన్న మార్కెట్, ప్రభుత్వాస్పత్రి వద్ద క్యాంటీన్ కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రతి రోజూ జీవనోపాధికోసం పట్టణానికి వస్తున్న పేదలు రోజంతా కష్టపడి సంపాదించుకున్న డబ్బు టిఫెన్, భోజనాలకే ఖర్చు పెట్టాల్సి వస్తోందని తెలిపారు. దీంతో అతి తక్కువ ధర రూ. 9కే కడుపు నిండా ఆహారం అందివ్వగలిగితే నాలుగు డబ్బులు ఇంటికి తీసుకెళ్లేందుకు అవకాశముంటుందని అన్నారు. క్యాంటీన్ల నిర్వహణకు డాక్టర్ సాయిప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్ ఆర్థిక సాయం అందిస్తోందన్నారు. త్వరలో వీటిని హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరు మండల కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి ప్రశాంత్‌గౌడ్, జిల్లా మైనార్టీ గౌరవధ్యక్షులు ఫజులూ రహమన్, కౌన్సిల్ ప్లోర్ లీడర్ శివ, ఏ బీ బ్లాక్ కన్వీనర్లు ఇర్షాద్, మల్లికార్జున, మండల కన్వీనర్లు నక్కలపల్లి శ్రీరాంరెడ్డి, నారాయణస్వామి, మహిళ కన్వీనర్ నాగమణి, షామింతాజ్, కౌన్సిలర్లు నాగభూషణరెడ్డి, రజనీ, బీసీ, ఎస్సీసెల్ నాయకులు రాము, శ్రీన, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు నారాయణస్వామి, కొల్లకుంట శివశంకర్‌రెడ్డి, నరసింహరెడ్డి, బాలాజీ, మైనార్టీ నాయకులు సమద్, ఇమ్రాన్, మన్సూర్, ముస్తక్, చాంద్‌బాషా, రియాజ్, రంగారెడ్డి, సురేంద్రరెడ్డి పాల్గొన్నారు. నాయకులకు ఈ ఆలోచన రాలేదు వందల వేల కోట్లు సంపాదించిన నాయకులకు పేదలకు సేవ చేయాలని తపన లేకుండా పోయిది. పేదలకు నామమాత్రపు ధరతో కడుపునిండా టిఫెన్, భోజనం అందించే చర్యలను వైఎస్సార్సీపీ సమన్వయకర్త చేపట్టడం అభినందనీయం. – శివ, కౌన్సిల్ ప్లోర్ లీడర్ రూ.9కే నాలుగు ఇడ్లీలు జనతా క్యాంటీన్ లో తొమ్మిది రూపాయలకు నాలుగు ఇడ్లీలు, సాంబర్, చెట్నీ ఇస్తున్నారు. పొంగల్, ఇతర టిఫెన్ కూడా అందుబాటులో ఉంచారు. మధ్యాహ్నం అన్నం, సాంబర్, పెరుగన్నం ఇస్తున్నారు. మాములుగా అయితే రూ.60 పెడితే టిఫెన్, రూ.100పెడితే గానీ భోజనం రాదు. – గంగాధర్, బేల్దార్, లేపాక్షి -
వందో సినిమా తర్వాత పూర్తి రాజకీయాల్లోకి: బాలకృష్ణ
అనంతపురం: వందో చిత్రం తర్వాత తాను పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉంటానని ప్రముఖ సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. దేశంలోనే హిందూపురం పట్టణాన్ని నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతానని చెప్పారు. శుక్రవారం పట్టణ పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తాగునీటి కష్టాలు తీరుస్తానని, హంద్రీ-నీవా ప్రాజెక్టును త్వరగా పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. -
మట్కా జూదరుల అరెస్టు
హిందూపురం (అనంతపురం): అనంతపురం జిల్లా హిందూపురం టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం మధ్యాహ్నం మట్కా శిబిరంపై దాడి చేశారు. స్థానిక ప్రైవేట్ బస్ స్టాండ్‌లో మట్కా నడుపుతున్న ఐదుగురిని అరెస్టు చేశారు. ఆ గ్యాంగ్ నుంచి రూ.1.27 లక్షలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. అరెస్ట్ చేసిన నిందితులను సాయంత్రం రిమాండ్‌కు పంపనున్నారని సమాచారం. -
బాలకృష్ణకు ఖాళీ బిందెలతో స్వాగతం
అనంతపురం: టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు తన సొంత నియోజకవర్గ పర్యటనలో తొలిరోజే చుక్కెదురైంది. నియోజకవర్గంలో పర్యటిస్తున్న బాలయ్యకు స్థానిక ప్రజలు ఖాళీ బిందెలతో స్వాగతం పలికారు. హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని కొల్లకుంటలో గత మూడు నెలలుగా తాగునీరు రావడం లేదంటూ మహిళలు ఖాళీ బిందెలతో బైఠాయించారు. ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలు మరిచారంటూ బాలకృష్ణని మహిళలు ఈ సందర్భంగా నిలదీశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు రంగంలోకి దిగి, మహిళలను శాంతపరిచారు. -
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందాలి
ముగిసిన ఏబీపీపీ జిల్లా మహాసభలు హిందూపురం అర్బన్ : విద్యార్థుల్లో జాతీయభావాలు దేశభక్తి సామాజిక స్పృహతోపాటు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు అంజనీశ్రీనివాస్ సూచించారు. హిందూపురంలో రెండు రోజులగా నిర్వహించిన ఏబీవీపీ జిల్లా మహాసభలు ఆదివారం ముగిశాయి. ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ విద్యరంగాన్ని ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులనుఅరికట్డడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. వీరి రక్షణకు ప్రత్యేక మహిళా స్పెషల్ ఫోర్సును ఏర్పాటు చేయాలన్నారు. కఠినమైన శిక్షలు అమలు చేయాలని కోరారు. రాయలసీమంలో తలమానీకమైన జెఎన్టీయూ అభివృద్ధికి ప్రతిఏడాది రూ.100కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హిందూపురంలో ఐటీ కారిడర్‌ను వెంటనే ఏర్పాటుచేసి, సెరికల్చర్, ఆర్టికల్చర్ సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ వంటి పరిశ్రమలు నెలకొల్పాలన్నారు. ఏబీవీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తిరుమలరెడ్డి, జాతీయ కార్యవర్గసభ్యుడు కరణాకర్లు కూడా ప్రసంగించారు. ఏబీవీపీ రాష్ట్ర సంయుక్తకార్యదర్శి నాగర్జున, జిల్లా కన్వీనర్ సునీల్‌కుమార్, సప్తగిరికళాశాల ప్రిన్సిపాల్ ఈశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. -
కల్తీ మాఫియా
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ నూనె మాఫియూ లోగుట్టు వ్యవహారమిది. కుళ్లిన మాసం.. కొవ్వు.. ఎముకలతో నూనె తయూరు చేస్తూ లక్షలాది రూపాయలు గడిస్తున్న వైనమిది. బయటి వారెవ్వరూ అక్కడికి వెళ్లడానికి కూడా సాహసం చేయలేని పరిస్థితి. హిందూపురం శివారులోని పారిశ్రామిక వాడ సమీపంలో యథేచ్ఛగా కల్తీ నూనె తయూరు చేస్తున్నా అధికారులు మాత్రం కన్నెత్తి చూడడం లేదు. అలాంటిదొకటి అక్కడ జరుగుతోందని వారికి తెలియదో.. తెలిసి ‘మామూళ్ల’ మత్తులో మునిగిపోయూరో.. మొత్తానికి ప్రజారోగ్యం మాత్రం ప్రమాదంలో పడుతోంది. జాతీయ రహదారికి దగ్గరలో ఉండడం.. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతం కావడంతో రోజూ వేలాది లీటర్ల కల్తీ నూనెను తయూరు చేసి హద్దులు దాటిస్తున్నారు. ఈ నూనెతో తయూరు చేసే పదార్థాలు తిని జనం రోగాలబారిన పడుతుండగా.. సమీప ప్రాంతాల వారు దుర్వాసన భరించలేక నరకం అనుభవిస్తున్నారు. ⇒ కొవ్వు, కుళ్లిన మాంసంతో నూనెల తయారీ ⇒ రాష్ట్రంతో పాటు తెలంగాణకు డ్రమ్ముల్లో రవాణా ⇒ ఈ నూనెతోనే వివిధ వంటకాల తయారీ ⇒ రోజూ రూ.లక్షల్లో దందా ⇒ ప్రమాదంలో ప్రజారోగ్యం ⇒ పట్టించుకోని అధికారులు హిందూపురం అర్బన్ : హిందూపురంలో కల్తీ నూనె మాఫీయా రాజ్యమేలుతోంది. శివారు ప్రాంతంలో..మనుషుల కాపలా మధ్య కొవ్వు, కుళ్లిన మాంసంతో నూనెలు తయూరు చేసి ఇతర ప్రాంతాలకు అత్యంత రహస్యంగా తరలిస్తున్నారు. పెద్ద పెద్ద బట్టీలు వేసి..వాటిపై గంగాళం (కొప్పెరలు) ఏర్పాటు చేసి అందులో కుళ్లిన మాంసం, ఎద్దుల కొవ్వు, ఎముకలు వేసి మరిగించి.. వాటి నుంచి వచ్చే నూనెను వడగట్టి.. ఆ తర్వాత డ్రమ్ముల్లో నింపి ఏపీతో పాటు తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రాంతాలకు యథేచ్ఛగా రవాణా చేస్తున్నా అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. హిందూపురానికి అత్యంత సమీపంలో ఉన్న తూమకుంట పారిశ్రామిక వాడలోని బ్రిటీష్ పెయింట్స్ తయూరీ కంపెనీ వెనుకభాగంలో ముళ్ల పొదల మధ్య ఈ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతోంది. ఈ ప్రాంతానికి హిందూపురం పట్టణంతో పాటు జాతీయ రహదారి అనుకూలంగా ఉండడంతో తయూరు చేసిన నూనెలను హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు సునాయూసంగా చేరవేస్తున్నారు. రోజూ వేలాది లీటర్లు డ్రమ్ముల్లో నింపి ఆటోలు, లారీల ద్వారా తరలిస్తున్నారు. ఒక్కో డ్రమ్ము నూనెను రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు విక్రరుుస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా రోజూ సుమారు 4 వేల లీటర్ల నూనె ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నట్లు సమాచారం. కారుచౌకగా లభిస్తుండడంతో కొందరు వ్యాపారులు ఇక్కడి నుంచి నూనెలు కొనుగోలు చేసి వంటకాలు తయూరు చేస్తున్నట్లు తెలుస్తోంది. అవి తిన్న జనం రోగాల బారిన పడుతున్నారు. ప్రధానంగా హిందూపురంలోని కొందరు చిరు వ్యాపారులు ఈ నూనెల్ని వాడుతున్నట్లు సమాచారం. ఇక్కడి నుంచి వచ్చే దుర్వాసనను భరించలేకపోతున్నట్లు తూమకుంట వాసులు అంటున్నారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో ఇలాగే కొవ్వు, ఎముకల ద్వారా నూనెలు తయూరు చేస్తుండడాన్ని గుర్తించిన అధికారులు.. ఆ నూనెతో తయూరు చేసిన పదార్థాలు ప్రాణాంతకమని తేల్చారు. దీంతో ప్రభుత్వం అక్కడ నిషేధం విధించింది. హైదరాబాద్‌లో తయూరు చేస్తే ఇబ్బందులు వస్తాయనుకున్న ముఠా నేరుగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దులో ఉన్న హిందూపురంను ఎంపిక చేసుకున్న యథేచ్ఛగా తన కార్యకలాపాలు కొనసాగిస్తోంది. నూనెల తయూరీకి హైదరాబాద్, బెంగళూరు, హిందూపురం పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఎద్దు కొవ్వు, కుళ్లిన మాంసం, ఎముకలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. వీటి తయూరీ కోసం నిర్వాహకుడు, హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి హిందూపురంలోని రహమత్‌పురానికి చెందిన వారు సహకరిస్తున్నట్లు సమాచారం. కల్తీ నూనెల వ్యవహారం ఇంతగా జరుగుతున్నా అధికారులెవ్వరూ ఇటువైపు చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. దుర్వాసన వస్తోంది ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీలున్నారుు. వాటి నుంచి వెలువడే కాలుష్యానికి తోడు కల్తీ నూనె తయూరీ వల్ల దుర్వాసన వస్తోంది. ఇంత యథేచ్ఛగా నూనెలు తయూరు చేస్తున్నా అధికారులు స్పందించకపోవడం దారుణం. ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకుని మాఫియూ ఆగడాలకు అడ్డుకట్టవేయూలి. -ఫయూజ్, ఎంపీటీసీ సభ్యుడు, సంతేబిదనూర్ ఇబ్బంది పడుతున్నాం కల్తీ నూనె తయూరీకి వాడే పదార్థాల వల్ల చుట్టుపక్కల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాసన భరించలేకున్నాం. ఫ్యాక్టరీ కార్మికులతో పాటు యజమానులైన మార్వాడీలు ఇబ్బందులు పడుతున్నారు. ఇంత దారుణంగా జరుగుతున్నా అధికారులు స్పందించడం లేదు. -బక్తార్, తూమకుంట -
జామర్‌ను ఢీకొట్టిన కాచిగూడ ఎక్స్‌ప్రెస్
డైవర్‌కు స్వల్ప గాయాలు హిందూపురం, . అనంతపురం జిల్లా హిందూపురం పట్టణ పరిధిలోని గుడ్డం సమీపంలో కాపలా లేని రైల్వే గేటు దగ్గర బుధవారం ఉదయం జామర్ కారును కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది.దాంతో కారు ముందు భాగం ధ్వంసం కాగా, డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ హిందూపురం పర్యటన నేపథ్యంలో బందోబస్తు నిమిత్తం డీఎల్-2సీఎం 6650 నంబరు గల రిమోట్ ఆపరేషన్స్‌ను నిర్వీర్యం చేసే జామర్కారు తీసుకొచ్చారు. దీన్ని ఎస్పీజీకి చెందిన డ్రైవర్ మానస్భగత్ సభా ప్రాంగణం నుంచి రైల్వేట్రాక్ సమీపంలో పరీక్షించేందుకు తీసుకెళ్లారు. సమీపంలోని కాపలాలేని రైల్వే ట్రాక్‌ని దాటాల్సి ఉంది. అదే సమయానికి కాచిగూడ-యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు వస్తోంది. ఈలోపు పట్టాలు దాటిపోవచ్చని డ్రైవర్.. జామర్ వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. అంతలోనే వేగంగా వచ్చిన రైలు కారుని ఢీకొంది. దాంతో కారు పల్టీకొట్టి రైల్వే గేటుకి అమర్చిన ఇనుప స్తంభాలకు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతినగా డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. -
నిమ్మలంగా దోపిడీ
ఎంపీ ల్యాడ్స్ హాంఫట్! ప్రతిపాదించిన పనుల్లో అధిక శాతం బినామీ పేర్లతో చేసిన వైనం బినామీ సంస్థతో తాగునీటి బోరు బావుల తవ్వకం సాక్షి ప్రతినిధి, అనంతపురం : లోక్‌సభ సభ్యుడి హోదాలో పనులన్నీ ఆయనే ప్రతిపాదించారు. వాటిని చేపట్టేలా తక్షణమే పరిపాలన పరమైన అనుమతులు జారీ చేయాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఆ తర్వాత ఆ పనులను బినామీ పేర్లతో ఆయనే నాసిరకంగా చేపట్టి నిధులను దోచుకున్నారు. ఇదీ ఎంపీ ల్యాడ్స్ వినియోగంలో హిందూపురం లోక్‌సభ సభ్యుడు నిమ్మల కిష్టప్ప తీరు. వివరాల్లోకి వెళితే.. 2009 ఎన్నికల్లో హిందూపురం లోక్‌సభ నుంచి టీడీపీ అభ్యర్థిగా నిమ్మల కిష్టప్ప విజయం సాధించారు. పార్లమెంటు సభ్యులకు ఎంపీ ల్యాడ్స్ పథకం కింద 2010-11 వరకూ ఏటా రూ.2 కోట్ల మేర మంజూరు చేసేవారు. 2011-12 నుంచి ఎంపీ ల్యాడ్స్ నిధులను రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్లకు పెంచారు. ఎంపీ ల్యాడ్స్ కింద ఏ ఏ పనులను చేపట్టాలన్నది సంబంధిత ఎంపీ ప్రతిపాదనలు చేస్తారు. ఆ పథకం అమలును పర్యవేక్షించే అధికారి.. ఎంపీ ప్రతిపాదనలను పరిశీలించి, సంబంధిత పనులు చేపట్టేలా పరిపాలనాపరమైన అనుమతులు జారీ చేస్తారు. ఎంపీ ల్యాడ్స్ కింద చేపట్టే పనుల్లో రూ.2 లక్షల్లోపు విలువైన పనులను ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు స్థాయి అధికారి, రూ.5 లక్షల్లోపు విలువైన పనులను సూపరింటెండెంట్ ఇంజనీరు స్థాయి అధికారి నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టే వెసులుబాటు ఉంది. ఈ వెసులుబాటు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సి పనులకు మాత్రమే వర్తిస్తుంది. రూ.5 లక్షలకన్నా అధిక వ్యయంతో చేపట్టే పనులకు కచ్చితంగా టెండర్లు నిర్వహించాల్సిందే. నిబంధనల్లో లొసుగులతో ఎంపీ నిమ్మల సొమ్ము చేసుకున్నారు. ఏ ఒక్క పని విలువ కూడా రూ.5 లక్షలకన్నా అధికంగా ఉండకుండా చూసుకున్నారు. ఆ మేరకు పనులను చేపట్టేలా ప్రతిపాదనలు చేసి.. వాటిని కనీసం టీడీపీ కార్యకర్తలకు కూడా నామినేషన్ పద్ధతిలో ఇవ్వకుండా బినామీ పేర్లతో తానే చేపట్టారు. పనులను నాసిరకంగా పూర్తి చేసి.. బిల్లుల రూపంలో కోట్లాది రూపాయాలను నొక్కేశారు. నిమ్మలా.. మజాకా! ఐదేళ్లలో హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప కోటా కింద ఎంపీ ల్యాడ్స్ నిధులు రూ.19 కోట్లు మంజూరయ్యాయి. విడుదలైన నిధులకన్నా అధికంగా రూ.20.59 కోట్లతో 1273 పనులు చేపట్టేలా ప్రతిపాదనలు అందజేశారు. నిధులున్నాయా లేదా అనే అంశాన్ని పట్టించుకోకుండా నిమ్మల ఒత్తిడి మేరకు.. ఆ పథకాన్ని పర్యవేక్షించే డ్వామా (జిల్లా నీటియాజమాన్య సంస్థ) పీడీ సంజయ్ ప్రభాకర్ పనులను మంజూరు చేశారు. ఈ పనుల్లో ఇద్దరు ముగ్గురికి మినహా టీడీపీ కార్యకర్తలకు కూడా నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టి లబ్ధి చేకూర్చిన దాఖలాలు లేవని ఆ పార్టీ ఎమ్మెల్యే ఒకరు ఇటీవల బాహాటంగా విమర్శించారు. అధిక శాతం పనులను బినామీ పేర్లతో చేపట్టి.. నాసిరకంగా పనులను పూర్తిచేసి నిధులను దోచుకున్నారని ఆ ఎమ్మెల్యేనే ఇటీవల పార్టీ అంతర్గత సమావేశాల్లో విమర్శించడం సంచలనం రేపింది. ఎంపీ నిమ్మల సొంతూరైన గోరంట్లలో సింగిరెడ్డిపల్లి సర్కిల్ నుంచి మార్కెట్ యార్డు వరకూ రూ.10 లక్షల వ్యయంతో సిమెంటు రోడ్డు నిర్మించాలని 2010-11లో ప్రతిపాదించారు. ఈ పనులను రెండు భాగాలుగా విడగొట్టి.. నామినేషన్ పద్ధతిలో బినామీ పేర్లతో ఎంపీ నిమ్మల కిష్టప్పే చేపట్టారు. నిబంధనలకు నీళ్లొదిలి నాసిరకంగా పనులను పూర్తి చేసి.. బిల్లులు నొక్కేశారు. ఫలితంగా మూడేళ్లకే సిమెంటు రోడ్డు శిథిలమైపోవడాన్ని చూసి గోరంట్ల ప్రజానీకం మండిపడుతున్నారు. నిబంధనలకు నీళ్లు ఎంపీ నిమ్మల ఐదేళ్లలో 466 బోరు బావులను తవ్వించి.. మోటార్లు బిగించి, తాగునీటిని సరఫరా చేయడానికి రూ.4.29 కోట్లను ఖర్చు చేశారు. తాగునీటి బోరు బావుల తవ్వకం పనులను నిబంధనల ప్రకారం రిజిష్టర్ సంస్థకే అప్పగించాలి. కానీ.. ఎంపీ నిమ్మల మాత్రం తద్భిన్నంగా వ్యవహరించారు. తన బినామీలకు చెందిన కేపీఎస్ వినాయక బోర్‌వెల్స్ అనే సంస్థకు బోరు బావుల తవ్వకం పనులను అప్పగించారు. బోరు బావిని తక్కువ లోతు తవ్వినా ఎక్కువ లోతుకు తవ్వినట్లు రికార్డులు సృష్టించి, ప్రజాధనాన్ని దోచుకున్నారు. తాగునీటి బోరు బావులకు మోటార్లు బిగించడం, పైపులైను వేయడం పనుల్లోనూ ఇదే రీతిలో చేతివాటం ప్రదర్శించినట్లు టీడీపీ కార్యకర్తలే విమర్శిస్తున్నారు. ఎంపీ నిమ్మల తనయుడి వివాహం నవంబర్ 7, 2013న గోరంట్లలోని ఆయన పొలంలో ఘనంగా చేశారు. ఈ వివాహ వేడుకలకు విద్యుత్ సరఫరా చేసేందుకు ఎంపీ ల్యాడ్స్ కింద రూ.92,939 కరెంట్ లైన్‌ను వేయించడాన్ని బట్టి చూస్తే నిమ్మల కిష్టప్ప ఏ స్థాయిలో నిధులను దుర్వినియోగం చేశారన్నది స్పష్టమవుతోంది.