హిందూపురం (అనంతపురం): అనంతపురం జిల్లా హిందూపురం టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం మధ్యాహ్నం మట్కా శిబిరంపై దాడి చేశారు. స్థానిక ప్రైవేట్ బస్ స్టాండ్లో మట్కా నడుపుతున్న ఐదుగురిని అరెస్టు చేశారు. ఆ గ్యాంగ్ నుంచి రూ.1.27 లక్షలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. అరెస్ట్ చేసిన నిందితులను సాయంత్రం రిమాండ్కు పంపనున్నారని సమాచారం.