మోనిసా
హిందూపురం: వరకట్న వేధింపులకు ఓ వివాహిత బలైంది. అత్తింటి వారి ఒత్తిళ్లు తాళలేక ఆత్మహత్య చేసుకుంది. పట్టణంలోని లక్ష్మీపురంలో చోటు చేసుకున్న ఈ ఘటనపై టూటౌన్ సీఐ సూర్యనారాయణ తెలిపిన వివరాలు.. కర్ణాటక రాష్ట్రం చిక్‌బళ్లాపురం తాలుకా పెరేసంద్ర గ్రామానికి చెందిన మోనిసా (34)కు హిందూపురానికి చెందిన రియాజ్‌తో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కుమారుడు, మూడేళ్ల కుమార్తె ఉన్నారు.
గత రెండేళ్ల నుంచి భర్తతోపాటు అత్త ఫిరోజ్‌బీ వరకట్నం తీసుకురావాలంటూ ఆమెను వేధిస్తున్నారు. ఈ వేదన తాళలేక మోనిసా బు«ధవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి బంధువులు మాత్రం కట్నం కోసం అత్తింటి వారే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు.
ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని గురువారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సీఐ తెలిపారు. ఆసుపత్రి వద్ద మోనిసా బంధువులతో డీఎస్పీ రమ్య మాట్లాడారు. వరకట్న వేధింపులతో ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా కేసు నమోదు చేశామని, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా చర్యలు చేపడతామని డీఎస్పీ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment