కల్తీ మాఫియా | Adulterated oil Mafia | Sakshi
Sakshi News home page

కల్తీ మాఫియా

Published Mon, Dec 1 2014 4:09 AM | Last Updated on Sat, Sep 2 2017 5:24 PM

కల్తీ మాఫియా

కల్తీ మాఫియా

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ నూనె మాఫియూ లోగుట్టు వ్యవహారమిది. కుళ్లిన మాసం.. కొవ్వు.. ఎముకలతో నూనె తయూరు చేస్తూ లక్షలాది రూపాయలు గడిస్తున్న వైనమిది. బయటి వారెవ్వరూ అక్కడికి వెళ్లడానికి కూడా సాహసం చేయలేని పరిస్థితి. హిందూపురం శివారులోని పారిశ్రామిక వాడ సమీపంలో యథేచ్ఛగా కల్తీ నూనె తయూరు చేస్తున్నా అధికారులు మాత్రం కన్నెత్తి చూడడం లేదు. అలాంటిదొకటి అక్కడ జరుగుతోందని వారికి తెలియదో.. తెలిసి     ‘మామూళ్ల’ మత్తులో మునిగిపోయూరో.. మొత్తానికి ప్రజారోగ్యం మాత్రం ప్రమాదంలో పడుతోంది. జాతీయ రహదారికి దగ్గరలో ఉండడం.. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతం కావడంతో రోజూ వేలాది లీటర్ల కల్తీ నూనెను తయూరు చేసి హద్దులు దాటిస్తున్నారు. ఈ నూనెతో తయూరు చేసే పదార్థాలు తిని జనం రోగాలబారిన పడుతుండగా.. సమీప ప్రాంతాల వారు దుర్వాసన భరించలేక నరకం అనుభవిస్తున్నారు.  
 
కొవ్వు, కుళ్లిన మాంసంతో నూనెల తయారీ
రాష్ట్రంతో పాటు తెలంగాణకు డ్రమ్ముల్లో రవాణా
ఈ నూనెతోనే వివిధ వంటకాల తయారీ
రోజూ రూ.లక్షల్లో దందా
ప్రమాదంలో ప్రజారోగ్యం
పట్టించుకోని అధికారులు

హిందూపురం అర్బన్ : హిందూపురంలో కల్తీ నూనె మాఫీయా రాజ్యమేలుతోంది. శివారు ప్రాంతంలో..మనుషుల కాపలా మధ్య కొవ్వు, కుళ్లిన మాంసంతో నూనెలు తయూరు చేసి ఇతర ప్రాంతాలకు అత్యంత రహస్యంగా తరలిస్తున్నారు. పెద్ద పెద్ద బట్టీలు వేసి..వాటిపై గంగాళం (కొప్పెరలు) ఏర్పాటు చేసి అందులో కుళ్లిన మాంసం, ఎద్దుల కొవ్వు, ఎముకలు వేసి మరిగించి.. వాటి నుంచి వచ్చే నూనెను వడగట్టి.. ఆ తర్వాత డ్రమ్ముల్లో నింపి ఏపీతో పాటు తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రాంతాలకు యథేచ్ఛగా రవాణా చేస్తున్నా అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. హిందూపురానికి అత్యంత సమీపంలో ఉన్న తూమకుంట పారిశ్రామిక వాడలోని బ్రిటీష్ పెయింట్స్ తయూరీ కంపెనీ వెనుకభాగంలో ముళ్ల పొదల మధ్య ఈ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతోంది.

ఈ ప్రాంతానికి హిందూపురం పట్టణంతో పాటు జాతీయ రహదారి అనుకూలంగా ఉండడంతో తయూరు చేసిన నూనెలను హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు సునాయూసంగా చేరవేస్తున్నారు. రోజూ వేలాది లీటర్లు డ్రమ్ముల్లో నింపి ఆటోలు, లారీల ద్వారా తరలిస్తున్నారు. ఒక్కో డ్రమ్ము నూనెను రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు విక్రరుుస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా రోజూ సుమారు 4 వేల లీటర్ల నూనె ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నట్లు సమాచారం. కారుచౌకగా లభిస్తుండడంతో కొందరు వ్యాపారులు ఇక్కడి నుంచి నూనెలు కొనుగోలు చేసి వంటకాలు తయూరు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అవి తిన్న జనం రోగాల బారిన పడుతున్నారు. ప్రధానంగా హిందూపురంలోని కొందరు చిరు వ్యాపారులు ఈ నూనెల్ని వాడుతున్నట్లు సమాచారం. ఇక్కడి నుంచి వచ్చే దుర్వాసనను భరించలేకపోతున్నట్లు తూమకుంట వాసులు అంటున్నారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో ఇలాగే కొవ్వు, ఎముకల ద్వారా నూనెలు తయూరు చేస్తుండడాన్ని గుర్తించిన అధికారులు.. ఆ నూనెతో తయూరు చేసిన పదార్థాలు ప్రాణాంతకమని తేల్చారు. దీంతో ప్రభుత్వం అక్కడ నిషేధం విధించింది. హైదరాబాద్‌లో తయూరు చేస్తే ఇబ్బందులు వస్తాయనుకున్న ముఠా నేరుగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దులో ఉన్న హిందూపురంను ఎంపిక చేసుకున్న యథేచ్ఛగా తన కార్యకలాపాలు కొనసాగిస్తోంది.


నూనెల తయూరీకి హైదరాబాద్, బెంగళూరు, హిందూపురం పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఎద్దు కొవ్వు, కుళ్లిన మాంసం, ఎముకలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. వీటి తయూరీ కోసం నిర్వాహకుడు, హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి హిందూపురంలోని రహమత్‌పురానికి చెందిన వారు సహకరిస్తున్నట్లు సమాచారం. కల్తీ నూనెల వ్యవహారం ఇంతగా జరుగుతున్నా అధికారులెవ్వరూ ఇటువైపు చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది.   
 
దుర్వాసన వస్తోంది
ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీలున్నారుు. వాటి నుంచి వెలువడే కాలుష్యానికి తోడు కల్తీ నూనె తయూరీ వల్ల దుర్వాసన వస్తోంది. ఇంత యథేచ్ఛగా నూనెలు తయూరు చేస్తున్నా అధికారులు స్పందించకపోవడం దారుణం. ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకుని మాఫియూ ఆగడాలకు అడ్డుకట్టవేయూలి.
 -ఫయూజ్, ఎంపీటీసీ సభ్యుడు, సంతేబిదనూర్
 
ఇబ్బంది పడుతున్నాం
కల్తీ నూనె తయూరీకి వాడే పదార్థాల వల్ల చుట్టుపక్కల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాసన భరించలేకున్నాం. ఫ్యాక్టరీ కార్మికులతో పాటు యజమానులైన మార్వాడీలు ఇబ్బందులు పడుతున్నారు. ఇంత దారుణంగా జరుగుతున్నా అధికారులు స్పందించడం లేదు.  
 -బక్తార్, తూమకుంట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement