దేశరాజధాని ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) క్యాంపస్‌లో శుక్రవారం అర్థరాత్రి విద్యార్థుల మధ్య మరోసారి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. విద్యార్థి సంఘాల ఎన్నికల నిర్వహణపై జరిగిన సమావేశంలో ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ ఏబీవీపీ, వామపక్ష విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ జరిగింది.
ఈ ఘటనలో తమ సభ్యుల్లో కొందరికి గాయాలయ్యాయని ఇరువర్గాలు పేర్కొన్నాయి. వార్తా సంస్థ పీటీఐ తెలిపిన ప్రకారం ఈ ఘర్షణపై జేఎన్‌యూ పాలకవర్గం నుంచి ఇంతవరకూ స్పందన లేదు. 2024 జేఎన్‌యూఎస్‌యూ ఎన్నికల కమిషన్ సభ్యులను ఎన్నుకోవడానికి క్యాంపస్‌లో విద్యార్థి సంఘాలు పరస్పరం ఘర్షణ పడ్డాయి.
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) సభ్యులు వేదికపైకి ఎక్కి కౌన్సిల్ సభ్యులు, స్పీకర్లతో గొడవకు దిగి, యూజీబీఎంకి అంతరాయం కలిగించారని లెఫ్ట్-అనుబంధ డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (డీఎస్‌ఎఫ్) ఆరోపించింది. సోషల్ మీడియాలో రెండు గ్రూపులు షేర్ చేసిన వీడియోలలో, ఏబీవీపీ, జేఎన్‌యూఎస్‌యూ సభ్యులు నినాదాలుచేస్తూ వాదించుకోవడాన్ని చూడవచ్చు. పరిస్థితిని చక్కదిద్దేందుకు విశ్వవిద్యాలయ భద్రతా సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment