
సాక్షి, న్యూఢిల్లీ : జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ముసుగులు ధరించిన దుండగులు సృష్టించిన బీభత్సానికి విద్యార్థులు భయంతో వణికిపోయారు. దాడి నుంచి తప్పించుకునేందుకు ఇద్దరు విద్యార్థులు మొదటి అంతస్తు నుంచి దూకడంతో గాయాలపాలయ్యారు. ఆదివారం సాయంత్రం కొందరు...ముఖం కనిపించకుండా ముసుగు కట్టుకుని క్యాంపస్‌లోకి ప్రవేశించి విద్యార్ధులు, ప్రొఫెసర్లను హాకీ స్టిక్స్‌తో చితకబాదడంతో పాటు వాహనాలను, ఆస్తులను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దుండగలు క్యాంపస్‌లోని సబర్మతి హాస్టల్‌లోకి చొరబడి దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. ఈ దాడిలో విద్యార్థి సంఘం నేతతో పాటు పలువురు విద్యార్ధులకు తీవ్ర గాయాలయ్యాయి.
ఈ దాడికి భయపడి హాస్టళ్లలోని తమ గదుల్లో దాక్కున్నారు. దుండగుల దాడి నుంచి తప్పించుకునేందుకు పలువురు విద్యార్థులు మొదటి అంతస్తు నుంచి కిందకు దూకేశారు. దీంతో పలువురి విద్యార్థుల కాళ్లకు గాయాలు అయ్యాయి. మరోవైపు ఈ ఘటనతో విద్యార్థులకు భద్రత కల్పించలేకపోయామంటూ హాస్టల్ వార్డెన్ ఆర్. మీనా సోమవారం రాజీనామా చేశారు. ఈ మేరకు యూనివర్శిటీ స్టూడెంట్ డీన్‌కు లేఖ రాశారు. తాము దుండగులను అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని, హాస్టళ్లకు భద్రత కల్పించలేకపోయామని తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
కాగా సుమారు 400మంది విద్యార్థులు ఉన్న సబర్మతి హాస్టల్‌తో పాటు మరికొన్ని హాస్టల్స్‌లోకి ప్రవేశించి దుండగులు దాడి చేశారు. దాడి అనంతరం హాస్టల్ భవనంలోని ప్రతి అంతస్తు బీభత్స వాతావరణాన్ని తలపించింది. కిటికీ అద్దాలు, తలుపులు, ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసం అయ్యాయి. దుండగులు సమారు మూడు గంటల పాటు జేఎన్‌యూలో విధ్వంస కాండను కొనసాగించారు. ఈ దాడిలో యూనివర్శిటీ విద్యార్థి సంఘం ప్రెసిడెంట్ ఆయిసీ ఘోష్ సహా సుమారు 35మంది ఉపాధ్యాయులు, విద్యార్థులు గాయడ్డారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించినట్లు చెబుతున్న పోలీసులు... ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదు. ఇక దాడికి పాల్పడిన వారి వివరాలు బయటపెట్టాలంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే డిమాండ్ చేశారు.
చదవండి:
జేఎన్యూపై దాడి చేసింది వీరేనా!
జేఎన్యూపై ‘నాజీ’ తరహా దాడి..!
జేఎన్యూ వీసీ వెంటనే రాజీనామా చేయాలి
జేఎన్యూ దాడి: దుండగుల గుర్తింపు
ఆ ఘటన నన్ను షాక్కు గురిచేసింది: కేజ్రీవాల్
ఈరోజు నా కూతురు.. రేపు మీపై కూడా..
సిగ్గుచేటు.. పాశవిక చర్య: మాయావతి




Comments
Please login to add a commentAdd a comment