శంషాబాద్: విద్యార్థుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అఖిలభారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో విద్యార్థులు శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం భారీ ధర్నా నిర్వహిం చారు. ఆయా కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తీవ్ర జాప్యం చేస్తున్నాయని, సమన్వయంతో ఈ సమస్యను పరిష్కరించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఎంసెట్ కౌన్సిలింగ్ ఆలస్యం అవుతుండడంతో విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందన్నారు. ప్రభుత్వం వెంటనే సమస్యల పరిష్కారానికి చొరవచూపాలని కోరారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ రాజేందర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్.మహేందర్, ఏబీవీపీ నాయకులు నర్సింగ్, హరీష్, నరేష్, సతీష్, అశోక్, విజయ్, నాగేందర్, మనిష్, హరిష్, అరవింద్, రాజు, శ్రావణ్, భరత్, సాయికిరన్, ఆదర్శ, విష్ణు తదితరులు పాల్గొన్నారు.
సాగర్ రోడ్డుపై రాస్తారోకో
యాచారం: పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలభారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో శుక్రవారం సాగర్ రోడ్డుపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. గంటపాటు మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఉన్న రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు పుప్పాల శాంతికుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందని అన్నారు.
వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. నిధుల మంజూరు విషయంలో నాన్చుడి ధోరణి అవలంబిస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. విద్యార్థుల ఆందోళన కారణంగా ట్రాఫిక్ జాం కావడంతో సమాచారం అందుకున్న ఎస్‌ఐ నర్సింహ అక్కడికి చేరుకున్నారు. విద్యార్థులకు నచ్చజెప్పి ఉప తహసీల్దార్ అన్వర్‌కు వినతిపత్రం ఇప్పించి ఆందోళన విరమింపజేశారు. మాల్‌లో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మారగోని శేఖర్ ఆధ్వర్యంలో సాగర్ రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమాల్లో పలువురు నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థుల సమస్యలపై ఏబీవీపీ ధర్నా
Published Sat, Jul 12 2014 12:07 AM | Last Updated on Wed, Sep 5 2018 9:18 PM
Advertisement