పాలమూరు, న్యూస్‌లైన్ : కేంద్ర ప్రభుత్వం ఉన్నతాశయంతో.. పశుసంవర్థక శాఖలో ప్రవేశపెట్టిన జాతీయ జంతు రోగ నిరోధక కార్యక్రమం ప్రణాళికా లోపం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా పక్కదారి పట్టింది. పశు పక్ష్యాదుల సంక్షేమం కోసం రూ. కోట్లు వెచ్చించి రెండేళ్ల కిందట ఈ పథకం ప్రారంభించారు. నేటికీ జిల్లాలో ఇది పూర్తిస్థాయిలో అమలు కాలేదు. ఇందుకు కేటాయించిన కంప్యూటర్లు నాణ్యతా లోపంతో మూలనపడ్డాయి. గ్రామస్థాయిలో అంది స్తున్న పశు వైద్యంపై సమగ్ర సమాచారా న్ని పొందుపరిచే విధానంపై ఆ సిబ్బందికి సరైన శిక్షణ లేదు. జాతీయ జంతు రోగ నిరోధక విధానం (నేషనల్ యానిమల్ డిసీజ్ రిపోర్టింగ్ సిస్టం- ఎన్‌ఏడీఆర్‌ఎస్) ద్వారా దేశంలోని అన్ని మండలాల పశు వైద్యశాలల కంప్యూటరీకరణ కార్యక్రమాన్ని రెండేళ్ల కిందట చేపట్టారు. నేషనల్ ఇన్ఫర్‌మేటిక్ సిస్టం (ఎన్‌ఐఎస్) ద్వారా క లెక్టరేట్‌లో ఉండే కంప్యూటర్‌కు వీటిని అ నుసంధానం చేసి ఉంచుతారు.
ఈ పథకం ద్వారా మండల పశు వైద్య కేంద్రాలకు కం ప్యూటర్, ప్రింటర్‌తోపాటు నిరంతర వి ద్యుత్తు అందించేందుకు ఇన్వర్టర్, బీఎస్‌ఎన్‌ఎల్ నెట్ కనెక్షన్‌ను అందజేశారు. ఒక్కో కేంద్రానికి రూ.లక్షకు పైగా విలువైన సామగ్రి సరఫరా చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. జిల్లాలో రూ.50 లక్షలు ఇందుకోసం వెచ్చిం చారు. దీంతోపాటు ఏటా బీఎస్‌ఎన్‌ఎల్ నెట్ సేవల వినియోగానికి ఖర్చు చేస్తున్నారు. అసలే అరకొర వసతులతో పశువైద్యశాల సిబ్బందికొట్టుమిట్టాడుతున్నారు. వీ టి పరిరక్షణ వైద్య సిబ్బందికి కత్తిమీద సామవుతోంది. రాత్రి పర్యవేక్షణ లేకపోవడం, భవనాలు సరిగా లేక వర్షాలతో వాటి భద్రతకు ముప్పు ఏర్పడుతోంది. దీనికితోడు సా కేంతిక సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి.
వేధిస్తున్న సిబ్బంది కొరత
జిల్లా వ్యాప్తంగా 342 పశువైద్య కేంద్రాలుండగా.. ఇక్కడ పనిచేసేందుకు 865 మంది సిబ్బంది అవసరం. కాగా ప్రస్తుతం 505 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 360 పోస్టులు ఖాళీలున్నాయి. అందులో వెటర్నరీ డాక్టర్ పోస్టులు 68, పారాస్టాఫ్ 198, అటెండర్‌లు 69 ఖాళీలుండటం వల్లే పశువైద్యం ప్రహసనంగా మారింది. దీంతో ఎన్‌ఏడీఆర్‌ఎస్ కార్యక్రమం అమలు ఇబ్బందికరంగా మారింది. ఈ కార్యక్రమ నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 65 చోట్ల కంప్యూటర్ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. అందులో కేవలం 34 మాత్రమే పనిచేస్తున్నాయి.. వాటి నుంచి కూడా అరకొరగా సమాచారం అందుతున్నట్లు తెలుస్తోంది. ఉన్న సిబ్బందికి వారంపాటు అందించిన శిక్షణ ఏమాత్రం చాలడం లేదని తెలుస్తోంది. అన్నప్రాసన నాడే ఆవకాయ పెట్టినట్లు ఎలాంటి అవగాహన లేని సిబ్బంది చేత వివరాల నమోదుకు ప్రయత్నించడం గమనార్హం.
ఉద్దేశం మంచిదే అయినా...
మండల పరిధిలో సమస్త జంతు సంపద వివరాలను పశువైద్య సిబ్బంది నమోదు చేయాలి. ఒక్కో రైతు, అతనికి ఉన్న పశుపక్ష్యాదుల వివరాలను పూర్తిస్థాయిలో పేర్కొనాలి. వాటికి వస్తున్న వ్యాధులు, అందించిన వైద్య సేవల వివరాలను పొందుపర్చాలి. మండల పరిధిలో ఉన్న అన్ని ఉప కేంద్రాల ద్వారా అందించిన వైద్య సేవల వివరాలు సైతం నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలు కంప్యూటర్ల ద్వారా జాతీయ వెబ్‌సైట్‌కు పంపి నమోదు చేయాల్సి ఉంది.
దేశవ్యాప్తంగా నమోదైనం ప్రాణాంతక వ్యాధుల నిర్ధారణ, పోలికలు, సంబంధిత మందులు, టీకాల సరఫరాకు అనుగుణంగా రాష్ట్ర, కేంద్ర బడ్జెట్ల రూపకల్పనకు ఇది ఎంతో ఉపకరిస్తుంది. ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా పశు సంవర్థక శాఖకు సంబంధించి అన్ని వివరాలను అందరూ చూసుకునే వీలు ఉంటుంది. తద్వారా జంతువులకు మెరుగైన వైద్యం అందుతుంది. ఈ పథకంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్లు చాలా చోట్ల పనిచేయడం లేదు. ఇంటర్నెట్ వినియోగంలో లేకపోవడం, ఇతర కారణాల వల్ల ఏడాది కిందట ఇవి జిల్లాకు వచ్చినా పూర్తి స్థాయిలో వినియోగంలోకి రాలేదు.
మా వివరాలేవీ!
Published Sat, May 31 2014 2:58 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement