జూనియర్ ఎన్టీఆర్ సాయం చేస్తానని మాట తప్పారని ఓ మహిళ ఆరోపించిన సంగతి తెలిసిందే. తమ బాబు ఆస్పత్రి చికిత్స కోసం ఆర్థికసాయం చేయలేదంటూ మహిళ మాట్లాడిన వీడియో నెట్టింట వైరలైంది. ఆమె చేసిన కామెంట్స్‌తో ఎన్టీఆర్ టీమ్ రంగంలోకి దిగింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ ఆరోగ్యంపై ఎన్టీఆర్ టీమ్ ఆరా తీసింది.
క్యాన్సర్‌తో బాధపడుతూ చెన్నై అపోలో హాస్పటల్లో చికిత్స పొందుతున్న ఎన్టీఆర్ అభిమాని కౌశిక్‌ను ఈ రోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయించారు ఎన్టీఆర్ టీమ్.. అంతేకాదు అతని చికిత్సకు అయిన ఖర్చును మొత్తం చెల్లించారు. దీంతో తమను ఆదుకున్న ఎన్టీఆర్‌కు సోషల్ మీడియా వేదికగా కౌశిక్ తల్లి ధన్యవాదాలు తెలిపింది.
(ఇది చదవండి: జూనియర్ ఎన్టీఆర్ ఇంతవరకు సాయం చేయలేదు.. అభిమాని తల్లి ఆవేదన)
థాంక్యూ ఎన్టీఆర్ సార్.. కౌశిక్ తల్లి
అయితే తాను ఎన్టీఆర్ గురించి ఎక్కడా తప్పుగా మాట్లాడలేదని ఆమె తెలిపింది. నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం నా కుమారుడు కౌశిక్ ఆనందంగా, సంతోషంగా ఉన్నాడని పేర్కొంది. ఈరోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళుతున్నామని ఆమె వెల్లడించింది. మా కుటుంబం అంతా ఎన్టీఆర్‌కు అభిమానులు అని.. నాకు అన్ని విధాల సహకరించిన ఎన్టీఆర్ టీమ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment