పాలమూరు : పాలమూరు జిల్లాపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక దృష్టి ఉందని పరి శ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, విద్యు త్ శాఖ మంత్రి సి.లకా్ష్మరెడ్డి, పార్లమెంటరీ కా ర్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నా రు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో వారు మాట్లాడారు.
జిల్లాలో ఎం తో ఖనిజ సంపద ఉందని, రెండు నదులు ప్రవహిస్తున్నాయని, వచ్చే ఖరీఫ్ నాటికి సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసి జిల్లాలో 6లక్షల ఎకరాల కు సాగునీటిరందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో తలపెట్టిన అన్ని ప్రా జెక్టులను పూర్తి చేసేందుకు శక్తి వంచన లేకుం డా కృషి చేస్తామన్నారు. జాతీయ ప్లానింగ్ కమిషన్ జరిపిన అధ్యయనంలో దేశవ్యాప్తంగా 10 జిల్లాలు వెనుకబాటుకు గురయ్యాయని గుర్తిం చగా.. అందులో 8 జిల్లాలు తెలంగాణలోనే ఉ న్నట్లు వెల్లడైందన్నారు. గత ప్రభుత్వాలు చేసిన పాపాల కారణంగా ఈ ప్రాంతం వెనుకబడిం దని, దానిని కడిగేందుకే టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిరంతరం పాటుడపతుందన్నారు.
పాలమూ రు జిల్లాలో వ్యవసాయ విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉందని, ఇక్కడి రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత విద్యుత్ కేటాయింపును పెంచేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లాలో అవసరమైన చోట విద్యుత్ సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తామని, విద్యుత్ కనెక్షన్లకోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు అవసరాన్ని బట్టి వ్యవసాయ కనెక్షన్లు ఇప్పిస్తామన్నారు. జిల్లాలోని వనరులను సద్వినియోగం చేసుకొని చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమల స్థాపనకు కృషిచేస్తామని పేర్కొన్నారు.
పాలమూరు-రంగారెడ్డి తెలంగాణ సర్కారు అమలు చేసే మొదటి ఎత్తిపోతల పథకమన్నారు. దీని నిర్మాణానికి శిలాఫలకం వేసేం దుకు త్వరలోనే కేసీఆర్ జిల్లాకు వస్తారన్నారు. జిల్లాలో దాదాపు 18.50 లక్షల ఎకరాల భూమి సాగుకు యోగ్యంగా ఉందని, ప్రతి నియోజకవర్గంలో కనీసం లక్ష ఎకరాలలో సాగు చేపట్టి వ్యవసాయ హబ్‌గా ఏర్పాటు చేయనున్నట్లు తె లిపారు. విలేకరుల సమావేశంలో జిల్లా పరి షత్ ఛైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, గువ్వల బాల్‌రాజు, మర్రి జనార్దన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు బెక్కెం జనార్దన్, పెద్దిరెడ్డి సా యిరెడ్డి, సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
పాలమూరుపై సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక దృష్టి
Published Thu, Dec 18 2014 1:30 AM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM
Advertisement
Advertisement