పాలమూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. వారం రోజులుగా ఉష్ణోగ్రతల పరిణామ క్రమంలో భారీ మార్పులు చోటుచేసుకొనడంతో పాలమూరు ఉడికిపోతోంది. మంగళవారం జిల్లా వ్యాప్తంగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఆదివారం 41 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 10 దాటితే చాలు కాలు బయట పెట్టేందుకు భయపడుతున్నారు. మ ధ్యాహ్నం వేళల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నారుు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ కోతలు అధికం కావడంతో జనం సతమతం అవుతున్నారు.
భానుడి భగభగ..!
Published Wed, May 21 2014 3:02 AM | Last Updated on Sat, Sep 2 2017 7:37 AM
Advertisement