- రూ.5కోట్లతో తోళప్ప గార్డెన్‌లో అన్నదానం క్యాంటీన్
- వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాలకు పూర్తి..?
తిరుచానూరు: అమ్మవారి దర్శనానికి వ చ్చే భక్తుల సౌకర్యార్థం తిరుమల వైకుం ఠం తరహాలో ఇక్కడ కూడా క్యూకాం ప్లెక్స్ నిర్మాణం చేపట్టనున్నారు. మినీ క్యూకాంప్లెక్స్‌కు అనువైన స్థలాన్ని ఆల య అధికారులు, టీటీడీ ఇంజినీరింగ్ విభాగపు అధికారులు సంయుక్తంగా పరిశీలిస్తున్నారు. అనుకున్నట్లు సాగితే వచ్చే ఏడాది అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు నిర్మాణం పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.
భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందు కు తిరుమల వైకుంఠం క్యూకాంప్లెక్స్ త రహాలోనే ఇక్కడ కూడా మినీ క్యూకాం ప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని ఇదివరకే టీటీడీ ఉన్నతాధికారులు నిర్ణయించా రు. దీనికోసం తిరుపతి జేఈవో పోలా భాస్కర్ జెడ్పీ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. ఇక్కడున్న పాఠశాలను తొలగించి క్యూకాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని తొలుత అధికారులు భావించా రు.
అయితే పాఠశాలను తరలించడం పై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎ దురవడంతో టీటీడీ అధికారులు వెన క్కు తగ్గారు. ప్రత్యామ్నాయంగా పుష్కరిణి సమీపంలోని స్పెషల్‌గ్రేడ్ డెప్యూటీ ఈవో కార్యాలయాన్ని పరిశీలిస్తున్నారు. ఈ భవనాన్ని తొలగించి మినీ క్యూ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నారు. అది కూడా వచ్చే ఏడాది అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలోపు క్యూ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి చేయాలని ఇం జనీరింగ్ అధికారులు యోచిస్తున్నారు.
అన్నదానం క్యాంటీన్
ప్రస్తుతం అమ్మవారి ఆస్థాన మండపం కింది భాగంలో అన్నదానం క్యాంటీన్ నడుస్తోంది. రోజుకు దాదాపు 3 నుంచి 5 వేల మంది భక్తులకు అన్నదానం చేస్తున్నారు. రాబోవు రోజుల్లో ఈ సంఖ్యను మరింత పెంచాలని, అం దుకు అనుగుణంగా తోళప్పగార్డెన్‌లో అత్యాధునిక వసతులతో అన్నదానం క్యాంటీన్ నిర్మించాలని టీటీడీ పాలకమండలి బోర్డులో నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం రూ.5 కోట్లు కేటాయించారు. టెండర్లను కూడా ఆహ్వానించారు. నూతన బోర్డు ఏర్పడగానే తోళప్పగార్డెన్‌లోని కల్యాణమండపాలను తొలగించి అన్నదాన క్యాంటీన్ పనులు ప్రారంభించనున్నారు. దీన్ని కూడా వచ్చే ఏడాది అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలోపు పూర్తి చేయనున్నారు.
రోడ్డు విస్తరణ పనులు
చంద్రగిరి-రేణిగుంట బైపాస్‌రోడ్డు నుంచి రంగనాధం వీధి, తోళప్పగార్డెన్, శంకర్‌నాయుడుకాలనీ మీదుగా పూడి రోడ్డు వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు టీటీడీ అధికారులు సన్నద్ధం అవుతున్నారు. వాహన రాకపోకల రద్దీని తగ్గించడానికి అనువుగా ఈ విస్తరణ పనులు చేపట్టాలని అధికారులు తెలిపారు. అలాగే శ్మశానవాటిక వద్ద శాశ్వత పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటుచేయనున్నారు. ఈ పనులన్నింటిని ఈ ఏడాది బ్రహ్మోత్సవాల అనంతరం చేపట్టి వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాలకు పూర్తి చేయాలని టీటీడీ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.