queue complex
-
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్మెంట్ల నిండా భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 10 గంటల సమయం పడుతోంది. నిన్న(బుధవారం) స్వామివారిని 77,369 మంది భక్తులు దర్శించుకోగా.. హుండీ ద్వారా శ్రీవారికి రూ. 2.64 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. -
వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో కుప్పకూలిన భక్తుడు
తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు గుండెపోటు రావడంతో క్యూకాంప్లెక్స్‌లోనే కుప్పకూలి పడిపోయాడు. వరంగల్ పట్టణానికి చెందిన వినోద్ (40) తన స్నేహితుడు లక్ష్మీ నారాయణతో కలసి స్వామివారి దర్శనం కోసం వచ్చాడు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 లో ఉండగా శుక్రవారం సాయంత్రం గుండెపోటు రావడంతో కింద పడిపోయాడు. ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు. -
వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో భక్తురాలి మృతి
తిరుమల : ఏడుకొండలవాడిని చూద్దామనుకున్న ఆ భక్తురాలి ఆశ ఫలించలేదు. దర్శనం కోసం క్యూకాంప్లెక్స్‌లో వేచి ఉండగానే ఆమె ప్రాణాలు పోయాయి. వివరాల్లోకి వెళ్తే... మంగళవారం సాయంత్రం తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో స్వామి దర్శనం కోసం వేచి ఉన్న భక్తురాలు బర్షన్ కౌర్ (54) గుండెపోటు రావడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. మృతురాలు మహారాష్ట్రలోని పూణె పట్టణానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనతో బర్షన్కౌర్ కుటుంబసభ్యుల్లో విషాదం నెలకొంది. -
అమ్మవారి ఆలయంలో మినీ క్యూకాంప్లెక్స్
రూ.5కోట్లతో తోళప్ప గార్డెన్లో అన్నదానం క్యాంటీన్ వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాలకు పూర్తి..? తిరుచానూరు: అమ్మవారి దర్శనానికి వ చ్చే భక్తుల సౌకర్యార్థం తిరుమల వైకుం ఠం తరహాలో ఇక్కడ కూడా క్యూకాం ప్లెక్స్ నిర్మాణం చేపట్టనున్నారు. మినీ క్యూకాంప్లెక్స్‌కు అనువైన స్థలాన్ని ఆల య అధికారులు, టీటీడీ ఇంజినీరింగ్ విభాగపు అధికారులు సంయుక్తంగా పరిశీలిస్తున్నారు. అనుకున్నట్లు సాగితే వచ్చే ఏడాది అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు నిర్మాణం పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందు కు తిరుమల వైకుంఠం క్యూకాంప్లెక్స్ త రహాలోనే ఇక్కడ కూడా మినీ క్యూకాం ప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని ఇదివరకే టీటీడీ ఉన్నతాధికారులు నిర్ణయించా రు. దీనికోసం తిరుపతి జేఈవో పోలా భాస్కర్ జెడ్పీ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. ఇక్కడున్న పాఠశాలను తొలగించి క్యూకాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని తొలుత అధికారులు భావించా రు. అయితే పాఠశాలను తరలించడం పై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎ దురవడంతో టీటీడీ అధికారులు వెన క్కు తగ్గారు. ప్రత్యామ్నాయంగా పుష్కరిణి సమీపంలోని స్పెషల్‌గ్రేడ్ డెప్యూటీ ఈవో కార్యాలయాన్ని పరిశీలిస్తున్నారు. ఈ భవనాన్ని తొలగించి మినీ క్యూ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నారు. అది కూడా వచ్చే ఏడాది అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలోపు క్యూ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి చేయాలని ఇం జనీరింగ్ అధికారులు యోచిస్తున్నారు. అన్నదానం క్యాంటీన్ ప్రస్తుతం అమ్మవారి ఆస్థాన మండపం కింది భాగంలో అన్నదానం క్యాంటీన్ నడుస్తోంది. రోజుకు దాదాపు 3 నుంచి 5 వేల మంది భక్తులకు అన్నదానం చేస్తున్నారు. రాబోవు రోజుల్లో ఈ సంఖ్యను మరింత పెంచాలని, అం దుకు అనుగుణంగా తోళప్పగార్డెన్‌లో అత్యాధునిక వసతులతో అన్నదానం క్యాంటీన్ నిర్మించాలని టీటీడీ పాలకమండలి బోర్డులో నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం రూ.5 కోట్లు కేటాయించారు. టెండర్లను కూడా ఆహ్వానించారు. నూతన బోర్డు ఏర్పడగానే తోళప్పగార్డెన్లోని కల్యాణమండపాలను తొలగించి అన్నదాన క్యాంటీన్ పనులు ప్రారంభించనున్నారు. దీన్ని కూడా వచ్చే ఏడాది అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలోపు పూర్తి చేయనున్నారు. రోడ్డు విస్తరణ పనులు చంద్రగిరి-రేణిగుంట బైపాస్‌రోడ్డు నుంచి రంగనాధం వీధి, తోళప్పగార్డెన్, శంకర్నాయుడుకాలనీ మీదుగా పూడి రోడ్డు వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు టీటీడీ అధికారులు సన్నద్ధం అవుతున్నారు. వాహన రాకపోకల రద్దీని తగ్గించడానికి అనువుగా ఈ విస్తరణ పనులు చేపట్టాలని అధికారులు తెలిపారు. అలాగే శ్మశానవాటిక వద్ద శాశ్వత పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటుచేయనున్నారు. ఈ పనులన్నింటిని ఈ ఏడాది బ్రహ్మోత్సవాల అనంతరం చేపట్టి వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాలకు పూర్తి చేయాలని టీటీడీ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. -
వైకుంఠంలో ఇకపై సెల్ఫోన్లు నిషేధం
సాక్షి, తిరుమల: తిరుమల వైకుంఠం క్యూకాంప్లెక్స్లోకి సెల్ఫోన్లు తీసుకెళ్లటంపై ఇప్పటికే నిషేధం ఉంది. దీన్ని సక్రమంగా అమలు చేయాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని జేఈవో శ్రీనివాసరాజు శనివారం మరోసారి ఉత్తర్వులు ఇచ్చారు. విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది వద్ద సెల్ఫోన్లు ఉండటం వల్ల దర్శన దందా అడ్డూ అదుపూ లేకుండా పోతోందని జేఈవో ఈ నిర్ణయం తీసుకున్నారు. సెల్ఫోన్లతోనే దర్శనాల దందా శ్రీవారి దర్శనానికి మొదటి, రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్లే ప్రధాన ప్రవేశ మార్గాలు. ఇక్కడ ఏఈవో స్థాయి నుంచి అటెండర్ స్థాయి వరకు, ఇతరత్రా భద్రతా సిబ్బంది వందల సంఖ్యలో పని చేస్తుంటారు. భద్రతా కారణాలతో శ్రీవారి ఆలయంతో పాటు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లలో సెల్ఫోన్లను నిషేధించారు. అయితే ఈ ఉత్తర్వుల అమలు అంతంత మాత్రంగానే ఉంది. దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు అన్ని విభాగాల సిబ్బంది దర్శనాల దందాకు వినియోగిస్తూ కాసులు దండుకుంటున్నారు. దీనిపై ఈవో, జేఈవోలకు ఫిర్యాదులు కూడా అందాయి. అక్రమ దందాల్లో పాత్రధారులైన అన్ని విభాగాల సిబ్బందిని ఏరివేసే కార్యక్రమానికి తెరతీసారు. రెండు రోజుల ముందు దర్శన దందా చేస్తూ పట్టుబడిన ఓ సూపరిండెంటెంట్తో పాటు మరో పోటు కార్మికుడిపై వేటు వేయాలని నిర్ణయించారు. వైర్లెస్ సెట్లతోనే విధులు నిర్వహించాలి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లలో దర్శన దందాలకు సెల్ఫోన్లు కూడా ఓ కారణంగా ఉందని జేఈవో భావించారు. గతంలో ఉన్న నిషేధాజ్ఞలనే ఇకపై కచ్చితంగా అమలు చేయాలని శనివారం మరోసారి ఉత్తర్వులు ఇచ్చారు. ఇందులో డెప్యూటీ ఈవో, ఏఈవో అధికారుల మినహా మిగిలిన సిబ్బంది అందరూ టీటీడీ వైర్‌సెల్ సెట్ల ద్వారానే సమాచారాన్ని ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. అలా కాదని అతిక్రమిస్తే శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
టీటీడీలో మరో అవినీతి బాగోతం
విద్యుత్ పరికరాల వినియోగంలో లక్షలు స్వాహా డీపీడబ్ల్యూ స్టోర్స్‌లో కీలక రికార్డులు మాయం 30 ఏళ్లుగా రూ.కోట్లలో అక్రమాలు మూడు దశాబ్దాలుగా నామమాత్రపు ఆడిట్ తిరుపతి సిటీ : తిరుమల తిరుపతి దేవస్థానంలో సంచలనం సృష్టించిన ఆర్జిత కుంభకోణం మరువకముందే తాజాగా సోమవారం విద్యుత్ విభాగంలో మరో అవినీతి బాగోతం వెలుగుచూసింది. 30 ఏళ్లుగా డీపీడబ్ల్యూ స్టోర్‌లో విద్యుత్ పరికరాల లావాదేవీల్లో రూ.లక్షలు స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు. నిజాయితీ కలిగిన ఉద్యోగికి స్టోర్స్ ఇన్చార్జిగా అవకాశం రావడంతో దశాబ్దాలకాలంగా జరుగుతున్న అక్రమాలు బయటపడినట్లు ఉద్యోగులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై వారం రోజులుగా విచారణ జరుగుతున్నా విద్యుత్ ఉన్నతాధికారి ఒకరు విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ము ఖ్యంగా టీటీడీ విజిలెన్స్‌కు సమాచారం చేరకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నా రు. కీలక రికార్డులను కూడా మాయం చేశారు. పైగా రికార్డుల పరిశీలనకు గు ట్టుచప్పుడు కాకుండా ఇతర విభాగాల నుంచి ఐదుగురిని డెప్యుటేషన్‌పై స్టోర్స్‌కు తీసుకున్నారు. అలిపిరి లింక్ బస్‌స్టేషన్‌కు ఎదురు గా ఉన్న టీటీడీ డీపీడబ్ల్యూ స్టోర్స్ నుంచి దేవస్థానానికి అవసరమైన విద్యుత్ పరికరాలు సరఫరా అవుతాయి. ఇక్కడ చిన్న స్విచ్ నుంచి పెద్దపెద్ద జనరేటర్స్ వరకు అందుబాటులో ఉంటాయి. టీటీడీ నూతనంగా నిర్మించే పాత భవనాలకు, క్యూకాంప్లెక్స్లకు, యాత్రికుల వసతి సముదాయాలకు, గదులకు, గెస్ట్‌హౌస్‌లకు ఈ స్టోర్స్ నుంచే సంబంధిత అధికారి ఓచర్ రాయించి సంతకం చేసి తీసుకోవాల్సి ఉంటుంది. మార్చిన పాత పరికరాలకు సైతం ఓచరు నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కలను ఏడాదికి ఒకసారి సరిచూసి ఆడిట్‌కు పంపాలి. అయితే 30 ఏళ్లుగా అధికారుల స్థాయి నుంచి ఉద్యోగుల వరకు ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఇన్నేళ్లుగా జరుగుతున్న అక్రమాలను గుర్తించకుండానే ఆడిట్ అధికారులు పద్దులకు గ్రీన్ సిగ్నల్ ఎలా ఇచ్చారనేది మరో వాదన. మొత్తం మీద ఆర్జిత కుంభకోణం తరహాలో ఈ వ్యవహారాన్ని కూడా ఎన్ఫోర్స్మెంట్కు ఇస్తే తప్ప తేలదని పలువురు చర్చించుకుంటున్నారు. 50 మందిపై వేటుకు అవకాశం ఈ వ్యవహారంలో దాదాపు 50 మంది పాత్ర ఉన్నట్లు సమాచారం. ఈ విభాగంలో మూడు దశాబ్దాలు వివిధ స్థాయిలలో పనిచేసి పదవీ విరమణ పొందిన వారితోపాటు సర్వీసులో ఉన్న వారు ఉన్నట్లు తెలుస్తోంది. అక్రమార్కుల్లో రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు కాజేసిన వారు పది మంది ఉండగా, రూ.30 లక్షల వరకు స్వాహా చేసిన వారిలో 40 మంది ఉన్నట్లు తెలిసింది. ఈ కుంభకోణంలో దేవుడి సొమ్ము రూ.3 నుంచి 5 కోట్ల మేరకు దుర్వినియోగమైనట్లు ప్రాథమికంగా గుర్తిం చినట్లు సమాచారం. ఈ విషయాన్ని టీటీడీ జేఈవో, ఈవో స్థాయికి పోకుండానే రికవరీ చేయాలనే యోచనలో అధికారులు ఉన్నట్లు తెలిసింది. ఏడాదిన్నర క్రితం పదవీ విరమణ పొందినా ఈ అక్రమాల కారణంగా ఇప్పటికీ కొందరికి సెటిల్మెంట్ పూర్తి చేయకుండా, పెన్షన్ మంజూరు చేయకుండా తిప్పుతున్నట్లు సమాచారం. వీరిలో కొందరు ఆమ్యామ్యాలతో సెటిల్మెంట్ పొంది దర్జాగా పెన్షన్ పొందుతున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని బయటపెట్టిన స్టోర్స్ ఇన్చార్జి(ఎలక్ట్రికల్)ని ఆ స్థానం నుంచి ఎలాగైనా బదిలీ చేయించి, విచారణకు ఇంతటితో పుల్‌స్టాప్ పెట్టించేందుకు పైరవీలు ప్రారంభమైనట్లు సమాచారం. దర్శనాలకే విజిలెన్స్ ప్రాధాన్యం శ్రీనివాసునికి ప్రధాన కాపాలదారులైన విజిలెన్స్ విభాగం తమకు కావాల్సిన వారికి దర్శనాలు చేయించుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు విమర్శలు వినబడుతున్నాయి. అందుకే సంవత్సరాల తరబడి అక్రమాలు జరుగుతున్నా గుర్తించలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నా దృష్టికి రాలేదు డీపీడబ్ల్యూ స్టోర్స్‌లో అవినీతి విషయం ఇంకా నా నోటీసుకు రాలేదు. వస్తే విచారణ జరిపి, సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. -పోలా భాస్కర్, టీటీడీ జేఈవో అక్రమాలు అంత మొత్తంలో లేవు డీపీడబ్ల్యూ స్టోర్స్‌లో అక్రమాలు అంత మొత్తంలో లేవు. కొంతవరకు ఉండొచ్చు. అది కూడా ఓచర్లను ఎప్పటికప్పుడు రౌండప్ చేసుకోకపోవడం వల్లే సమస్య వచ్చింది. -వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్, టీటీడీ విద్యుత్ విభాగం -
శ్రీవారి సేవలో వెంకయ్యనాయుడు
తిరుమల, న్యూస్‌లైన్: తిరుమల శ్రీవారిని శని వారం కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు దర్శిం చుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆయన కుటుంబ సమేతంగా వైకుం ఠం క్యూకాంప్లెక్స్ నుంచి ఆలయంలోకి వెళ్లా రు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకున్నా రు. అనంతరం శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శిం చుకున్నారు. వీరికి టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, జేఈవో శ్రీనివాసరాజు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయ రంగనాయక మండపంలో శ్రీవారి లడ్డూప్రసాదాలు అందజేశారు. అలాగే స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. వీరితో పాటు తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ, మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి, తిరుపతి బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి ఉన్నారు. టీడీపీ నేత అంబికా కృష్ణ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.