మెదక్: ‘ప్రేమించాను..పెళ్లి చేసుకుంటానని వెంట పడితే బావే కదా అని నమ్మాను.. తీరా పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేశాడు’ అంటూ ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. నంగునూరు మండలం మగ్దుంపూర్‌లో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది.
గ్రామానికి చెందిన గీతను భాస్కర్ అనే వ్యక్తి ప్రేమిస్తున్నానని వెంట పడ్డాడు. అతడు వరుసకు బావ కావడంతో సంవత్సరం పాటు కలిసి తిరిగారు. తనను పెళ్లి చేసుకోవాలని గీత కోరడంతో భాస్కర్ నిరాకరించాడు. దీంతో జులైలో భాస్కర్‌తో పాటు అతని తల్లిదండ్రులపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా వారిని రిమాండ్‌కు తరలించారు. ఇటీవలే బెయిల్‌పై వచ్చిన భాస్కర్ హైదరాబాద్లో ఉంటున్నాడు. కాగా తనకు న్యాయం చేయాలంటూ గీత ఆదివారం ప్రియుని ఇంటి ముందు ఆందోళనకు దిగింది. భాస్కర్ ఇంట్లో కుటుంబసభ్యులు ఎవ్వరు లేకపోవడంతో ఆదివారం సాయంత్రం ఆమె వెనుదిరిగింది.
ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా
Published Sun, Dec 6 2015 7:56 PM | Last Updated on Sun, Sep 3 2017 1:36 PM
Advertisement
Advertisement