lovers house
-
రాంగ్ నంబర్ ఫోన్‌కాల్‌తో పరిచయం.. ఘట్కేసర్లో సహజీవనం..
సాక్షి, బచ్చన్నపేట, (వరంగల్): ప్రియుడి ఇంటి ఎదుట ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన మంగళవారం మండలంలోని బండనాగారంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన సంపంగి దివ్యకు మండలంలోని బండనాగారానికి చెందిన షాదుల్లాబాబాతో రాంగ్ నంబర్ ఫోన్‌కాల్‌తో పరిచయమై తరచూ ఫోన్లో మాట్లాడుకునేవారు. అది కాస్త ప్రేమగా మారింది. అనంతరం వారిద్దరూ కలిసి ఘట్కేసర్లో ఓ రూంలో సహజీవనం చేశారు. కొన్నాళ్లు సజావుగా ఉన్నారు. అనంతరం వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. అయితే దివ్య వారు ఉంటున్న ఏరియా ఘట్కేసర్ పీఎస్‌లో రేప్ చేశాడని ఫిర్యాదు చేయడంతో షాదుల్లాబాబా జైలుకు వెళ్లాడు. అనంతరం ఆయనకు దివ్యనే బెయిల్ ఇప్పించి విడుదల చేయించింది. మళ్లీ కాపురంలో గొడవలు రావడంతో బాబా బండనాగారం రాగా భార్య దివ్య వచ్చి గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులకు ఫోన్ చేయగా ఘటనా స్థలానికి వచ్చి దివ్యకు వైద్యం చేయించి వీరి ఇరువురిని ఘట్కేసర్ పోలీస్‌స్టేషన్‌కు పంపించారు. చదవండి: (మసాజ్ సెంటర్ల పేరుతో చీకటి కార్యకలాపాలు.. కళ్లు బైర్లుకమ్మే అంశాలు) -
ప్రేమ పేరుతో మోసం..
కాళేశ్వరం: మూడు సంవత్సరాలుగా ఒకరికొకరు ప్రేమించుకున్నారు. చివరకు పెళ్లి చేసుకుంటానని ప్రియుడు ప్రియురాలిని మోసం చేసి ఊరు వదిలి పరారయ్యాడు. దీంతో గత్యంతరం లేక తనకు న్యాయం చేయాలని కోరుతూ ప్రియుడి ఇంటి ముందు వారం రోజులుగా ప్రియురాలు ఆందోళనకు దిగింది. ఈ ఘటన మండలంలోని కాళేశ్వరంలో ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. కాటారం మండలం నస్తూర్‌పల్లి గ్రామానికి చెందిన మేర్జాన సంధ్య, మహదేవపూర్ మండలం కాళేశ్వరం ఎస్సీ కాలనీకి చెందిన చకినారపు రాజశేఖర్ ప్రేమించుకున్నారు. రాజశేఖర్ డిగ్రీ వరకు చదివి ఖాళీగా ఉన్నాడు. సంధ్య కాళేశ్వరంలోని అమ్మమ్మ సమ్మక్క ఇంటి వద్ద ఉంటూ తాపీమేస్త్రీ వద్ద రోజు వారి కూలీ పని చేస్తుండేది. దీంతో వీరిద్దరి మధ్య పరిచయం పెరిగి అది కాస్తా ప్రేమగా మారింది. మూడు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని రాజశేఖర్‌పై సంధ్య ఒత్తిడి తెచ్చింది. పెళ్లికి నిరాకరించిన ఆ యువకుడు ఇంటికి తాళం పెట్టి కుటుంబ సభ్యులతో కలసి ఊరు వదిలి వెళ్లాడు. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు బైఠాయించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆమె నుంచి వివరాలు సేకరించారు. ఈ విషయంపై శ్రీనివాస్‌ను వివరణ కోరగా సంధ్యకు కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులను తీసుకురావాలని పంపినట్లు తెలిపారు. -
చిత్తూరు జిల్లాలో చైనా యువతి ప్రేమపోరాటం
చిత్తూరు: ప్రేమించిన వ్యక్తితో వివాహం జరిపించాలని కోరుతూ చైనా యువతి చిత్తూరు జిల్లాలో ప్రియుడు ఇంటి ముందు న్యాయపోరాటం చేస్తోంది. వివరాలిలా ఉన్నాయి. చైనాకు చెందిన గ్లిన్ జాన్ అనే మహిళ మూడు నెలల క్రితం చిత్తూరు జిల్లాలోని కల్కి భగవాన్ ఆశ్రమానికి వచ్చింది. అక్కడ వరదాయపాలెం మండలం బత్తులవల్లం గ్రామానికి చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని తనను నమ్మించి, మోసం చేశాడని చైనా యువతి ఆరోపిస్తోంది. ప్రియుడితో తన పెళ్లి జరిపించాలని డిమాండ్ చేస్తూ మొదట కల్కి ఆశ్రమం వద్ద ఆమె నిరసనకు దిగింది. అనంతరం బత్తులవల్లం గ్రామానికి వచ్చి ప్రియుడు ఇంటిముందు న్యాయపోరాటం చేస్తోంది. ప్రియుడు పరారీలో ఉన్నాడు. -
ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా
మెదక్: ‘ప్రేమించాను..పెళ్లి చేసుకుంటానని వెంట పడితే బావే కదా అని నమ్మాను.. తీరా పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేశాడు’ అంటూ ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. నంగునూరు మండలం మగ్దుంపూర్‌లో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గీతను భాస్కర్ అనే వ్యక్తి ప్రేమిస్తున్నానని వెంట పడ్డాడు. అతడు వరుసకు బావ కావడంతో సంవత్సరం పాటు కలిసి తిరిగారు. తనను పెళ్లి చేసుకోవాలని గీత కోరడంతో భాస్కర్ నిరాకరించాడు. దీంతో జులైలో భాస్కర్‌తో పాటు అతని తల్లిదండ్రులపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వారిని రిమాండ్‌కు తరలించారు. ఇటీవలే బెయిల్‌పై వచ్చిన భాస్కర్ హైదరాబాద్‌లో ఉంటున్నాడు. కాగా తనకు న్యాయం చేయాలంటూ గీత ఆదివారం ప్రియుని ఇంటి ముందు ఆందోళనకు దిగింది. భాస్కర్ ఇంట్లో కుటుంబసభ్యులు ఎవ్వరు లేకపోవడంతో ఆదివారం సాయంత్రం ఆమె వెనుదిరిగింది.