చిత్తూరు జిల్లాలో చైనా యువతి ప్రేమపోరాటం
చిత్తూరు: ప్రేమించిన వ్యక్తితో వివాహం జరిపించాలని కోరుతూ చైనా యువతి చిత్తూరు జిల్లాలో ప్రియుడు ఇంటి ముందు న్యాయపోరాటం చేస్తోంది. వివరాలిలా ఉన్నాయి.
చైనాకు చెందిన గ్లిన్ జాన్ అనే మహిళ మూడు నెలల క్రితం చిత్తూరు జిల్లాలోని కల్కి భగవాన్ ఆశ్రమానికి వచ్చింది. అక్కడ వరదాయపాలెం మండలం బత్తులవల్లం గ్రామానికి చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని తనను నమ్మించి, మోసం చేశాడని చైనా యువతి ఆరోపిస్తోంది. ప్రియుడితో తన పెళ్లి జరిపించాలని డిమాండ్ చేస్తూ మొదట కల్కి ఆశ్రమం వద్ద ఆమె నిరసనకు దిగింది. అనంతరం బత్తులవల్లం గ్రామానికి వచ్చి ప్రియుడు ఇంటిముందు న్యాయపోరాటం చేస్తోంది. ప్రియుడు పరారీలో ఉన్నాడు.