కుటుంబ కలహాలతో విసిగి వేసారిపోయిన మహిళ తన ఐదు నెలల చిన్నారిని నీటితొట్టెలో పడేసి అనంతరం తాను ఆత్మహత్య చేసుకుంది.
కుటుంబ కలహాలతో విసిగి వేసారిపోయిన మహిళ తన ఐదు నెలల చిన్నారిని నీటితొట్టెలో పడేసి అనంతరం తాను ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా భువనగిరి మండలం గౌస్‌నగర్‌లో ఆదివారం వెలుగచూసింది. స్థానికంగా నివాసముంటున్న భాస్కర్‌కు, మమత(21)తో రెండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఆరు నెలల పాప ఉంది.
గత కొన్ని రోజులుగా వీరి మధ్య గొడవలు జరగుతున్నాయి. తాజాగా శనివారం అర్ధరాత్రి దాటాక ఇంటికి వచ్చిన భాస్కర్ మరోసారి గొడవపడటంతో మనస్తాపానికి గురై తన ఆరు నెలల చిన్నారి నీటితొట్టెలో పడేసి వంటి పై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.