కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్ | Jabardasth Comedian Gully Boy Bhaskar New House | Sakshi
Sakshi News home page

Gully Boy Bhaskar:'జబర్దస్త్' కమెడియన్ కొత్త ఇల్లు .. ఎమోషనల్ పోస్ట్

Published Sun, Apr 28 2024 10:33 AM | Last Updated on Sun, Apr 28 2024 1:24 PM

Jabardasth Comedian Gully Boy Bhaskar New House

మరో కమెడియన్ సొంతిల్లు కట్టుకున్నాడు. 'పటాస్' షోతో గుర్తింపు తెచ్చుకుని.. ఆ తర్వాత పలు కామెడీ షోలతో గుర్తింపు తెచ్చుకున్న గల్లీ బాయ్ భాస్కర్ తాజాగా కొత్త ఇంట్లో అడుగుపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఫైనల్లీ డ్రీమ్ హౌస్ కట్టుకున్నానని ఇన్ స్టాలో రాసుకొచ్చాడు. ఈ కార్యక్రమానికి తోటి కమెడియన్స్ వచ్చి విషెస్ చెప్పారు.

(ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్ నుంచి కాంట్రవర్సీల వరకు.. సమంత గురించి ఇవి తెలుసా?)

కొత్త ఇంట్లో గల్లీ బాయ్ భాస్కర్

'పటాస్' షోలో స్టాండప్ కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించిన భాస్కర్.. సద్దాం, యాదమ్మ రాజు తదితరులతో కలిసి స్కిట్స్ కూడా చేసేవాడు. ఆ తర్వాత అదిరింది, కామెడీ స్టార్స్, కామెడీ స్టాక్ ఎక్సేంజ్ లాంటి షోలు చేశాడు. ఇప్పుడు 'జబర్దస్త్'లో చేస్తున్నాడు. వీటితో పాటు ఈవెంట్స్ లో పాల్గొంటూ రెండు చేతులా సంపాదిస్తున్న భాస్కర్.. ఇప్పుడు మూడు అంతస్థుల ఇల్లు కట్టేసుకున్నారు. ఈ వీడియోని పోస్ట్ చేస్తూ.. తన డ్రీమ్ హౌస్ కట్టుకున్నానని ఎమోషనల్ అయ్యాడు.

(ఇదీ చదవండి: ప్రముఖ దేవాలయంలో స్టార్ హీరోయిన్ సంయుక్త.. కారణం అదేనా?)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement