స్నేక్ గ్యాంగ్ రేప్ కేసు ఉదంతంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను పహాడీషరీఫ్ ఇన్‌స్పెక్టర్ భాస్కర్‌రెడ్డి, ఎస్‌ఐ వీరప్రసాద్‌లను సస్పెండ్ చేస్తూ...
సాక్షి, హైదరాబాద్: స్నేక్ గ్యాంగ్ రేప్ కేసు ఉదంతంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను పహాడీషరీఫ్ ఇన్‌స్పెక్టర్ భాస్కర్‌రెడ్డి, ఎస్‌ఐ వీరప్రసాద్‌లను సస్పెండ్ చేస్తూ సైబారాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. స్నేక్ గ్యాంగ్ రేప్ దృశ్యాలను వాట్సప్‌లో పంపించిన వారందరినీ సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు విచారిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో వాట్సప్‌లో ఆ దృశ్యాలు దర్శనమివ్వడానికి అసలు సూత్రధారి ఎవరనేది తేలుతుందని సైబర్‌క్రైమ్ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ఉదంతంలో సుమారు ఎనిమిది మందిని విచారించామని వారు తెలిపారు.