హరీశ్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరుతున్న భాస్కర్. చిత్రంలో ఎంపీ నామా తదితరులు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, బీజేపీ నాయకులను తెలంగాణ జాతి ఎన్నటికీ నమ్మదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎంఆర్‌పీఎస్ రాష్ట్ర నాయకుడు యాతాకుల భాస్కర్ గురువారం తెలంగాణ భవన్‌లో హరీశ్ సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఎంపీ నామా నాగేశ్వర్‌రావు, ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ రవీందర్‌రావు ఆధ్వర్యంలో చేరిక కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో మత కలహాలు, కరెంటు, నీళ్ల కష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాయని విమర్శించారు. అంబేడ్కర్ చూపిన మార్గంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం పయనిస్తోందని, కాంగ్రెస్, బీజేపీలకు దళితులు, గిరిజనులపై ఏ మాత్రం ప్రేమలేదన్నారు. పార్టీలో చేరిన వారిలో ఎంఆర్‌పీఎస్ నాయకులు జే.ఆర్.కుమార్, శ్రీనివాసులు, సతీష్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment