ravinder rao
-
టెస్కాబ్ చైర్మన్ కొండూరి రాజీనామా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కా బ్) చైర్మన్ కొండూరి రవీందర్రావు శుక్రవారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తాను చైర్మన్‌గా ఉన్న తొమ్మిదేళ్లలో సహ కార బ్యాంకులను దేశంలో అగ్ర గామిగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. అనేక సంస్కరణలు తీసుకొచ్చి బ్యాంకులను బలోపేతం చేశానన్నారు. ప్రభు త్వం మారడంతో తనపై అవిశ్వాసం పెట్టారని, కానీ అంతకన్నా ముందే తన పదవికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు.మాజీ సీఎం కేసీఆర్ సహకారంతో సహకార బ్యాంకులను బలోపేతం చేసి, రైతులకు మేలు జరిగేలా చర్యలు తీసుకు న్నట్లు వివరించారు. తాము వచ్చిన తర్వాత బ్యాంకుల్లో 7,165 ఉద్యో గాలను భర్తీ చేసినట్లు తెలిపారు. గోదాముల నిర్మాణం, పెట్రోల్ బంకుల ఏర్పాటు, పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడం వంటి వ్యాపా రాలను నిర్వహించిన ట్లు చెప్పారు. సహకార బ్యాంకుల కంప్యూటరీ కరణ, ప్రత్యేక సైబర్ సెక్యూరిటీ విభాగాన్ని ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. బోర్డులోని డైరెక్టర్లు పార్టీ మారి తనపై అవిశ్వాసం పెట్టార న్నారు. అందుకే తాన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సమావేశంలో టెస్కా బ్ వైస్ చైర్మన్ మహేందర్‌రెడ్డి కూడా తన రాజీనామాను ప్రకటించారు. -
కుక్కలు కూడా వారి వెంట పడవు
సాక్షి, హైదరాబాద్: ‘వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ అవసరం లేదు.. కుక్కలు కూడా వారి వెంట పడవు’అని శాసనమండలి సభ్యుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు తీవ్ర వ్యా ఖ్యలు చేశారు. శుక్రవారం అసెంబ్లీ ఉభయసభల సంయుక్త సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఇటీవలి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపై శాసనసభ ఆవరణలో పిచ్చాపాటిగా మాట్లాడారు. ‘తొక్కుడు రాజకీయాలతోనే బీఆర్ఎస్ ఓటమి పాలైంది. అసలు విషయాలు అధిష్టానం వరకు చేరకుండా మధ్యలోనే కొందరు ఆపేశారు. జోకుడు బ్యాచ్‌కు మా పార్టీ అధిష్టానం ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. వాస్తవాలు చెప్పేందుకు అధినేత అవకాశం ఇస్తే ఎవరైనా అసలు విషయం చెప్తారు. వాస్తవాలు చెప్పేవారు బయట, జోకుడుగాళ్లు లోపల ఉంటే వాస్తవాలు ఎలా తెలుస్తాయి. పార్టీ గెలుపుపై ఊహాగానాలు ఎక్కువై వాస్తవాలు మరిచిపోయారు. 2014, 2018 ఎన్నికల్లో ఇతర పార్టీల్లో గెలిచిన వారిని బీఆర్ఎస్లోకి లాగితే.. వచ్చిన వారు నిజమైన బీఆర్ఎస్ లీడర్లను అణచివేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతీసారి ఇతర పార్టీల్లో గెలిచిన వారిని బీఆర్ఎస్లోకి తెచ్చుకుంటే నేతలు గ్రూపులుగా విడిపో యారు. కొన్ని జిల్లాల్లో మా పార్టీ ఎమ్మెల్యేలు ప్రజల్లో అసహనం పెరిగేలా చేశారు.. దానిని ఎలా మేనేజ్ చేయాలో పార్టీకి ప్రణాళిక లేకపోతే ఎలా గెలుస్తాం. ఆత్మగౌరవం ఎక్కువగా ఉండే వరంగల్ లాంటి జిల్లాల్లో ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్ లాంటి వారికి మంత్రి పదవులు ఇస్తే ఉద్యమకారులు బాధపడ్డారు. తెలంగాణవాదం, ఉద్యమం గురించి తెలియని వారికి మంత్రి పదవులు ఇస్తే ఎలా..పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్‌రావు ఓటమిని అక్కడి ఓటర్లు ఎప్పుడో నిర్ణయించారు. ఆయన జనాలకు చక్కిలిగింత పెట్టడం తప్ప ఎవరికీ రూపాయి సాయం చేయరు’అని రవీందర్రావు అన్నారు. ఆ ప్రచారాన్ని నమ్మొదు చిట్‌చాట్ పేరిట తాను అనని మాటలను అన్నట్టు గా ప్రచారం జరుగుతోందని శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్సీ రవీందర్రావు ఒక ప్రకటన విడుదల చేశారు. తాను వ్యాఖ్యలు చేసినట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తాను ఏదైనా విషయం మాట్లాడాలని అనుకుంటే అధికారికంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్తానన్నారు. పార్టీ అధినేత కేసీఆర్‌పై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని, ఆయన అప్పజెప్పిన అనేక బాధ్యతలను చిత్తశుద్ధితో నెరవేర్చినట్లు పేర్కొన్నారు. చిట్‌చాట్ పేరిట జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని తక్కెళ్లపల్లి కోరారు. -
కాంగ్రెస్, బీజేపీ నేతలను తెలంగాణ జాతి నమ్మదు: హరీశ్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, బీజేపీ నాయకులను తెలంగాణ జాతి ఎన్నటికీ నమ్మదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుడు యాతాకుల భాస్కర్ గురువారం తెలంగాణ భవన్లో హరీశ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎంపీ నామా నాగేశ్వర్రావు, ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ రవీందర్రావు ఆధ్వర్యంలో చేరిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో మత కలహాలు, కరెంటు, నీళ్ల కష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాయని విమర్శించారు. అంబేడ్కర్ చూపిన మార్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పయనిస్తోందని, కాంగ్రెస్, బీజేపీలకు దళితులు, గిరిజనులపై ఏ మాత్రం ప్రేమలేదన్నారు. పార్టీలో చేరిన వారిలో ఎంఆర్పీఎస్ నాయకులు జే.ఆర్.కుమార్, శ్రీనివాసులు, సతీష్ ఉన్నారు. -
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు ఏకగ్రీవం
సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: శాసనమండలి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా టీఆర్ఎస్ పార్టీ తరపున నామినేషన్లు దాఖలు చేసిన ఆరుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారికి అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సోమవారం సాయం త్రం ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో గుత్తా సుఖేందర్‌రెడ్డి, కడి యం శ్రీహరి, తక్కల్లపల్లి రవీందర్రావు, బండా ప్రకాశ్ ముదిరాజ్, పాడి కౌశిక్‌రెడ్డి, పి.వెంకట్రామిరెడ్డి ఉన్నారు. శాసనమండలి ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఆరు స్థానాలకు ఈ నెల 9 నుంచి 16 వరకు నామినేషన్లు స్వీకరించగా, టీఆర్ఎస్ నుంచి ఆరుగురు అభ్యర్థులతోపాటు మరో ఇద్దరు స్వతంత్రులుగా నామినేషన్లు వేశారు. అయితే స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు పరిశీలనలో తిరస్కరణకు గురవడంతో బరిలో టీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేసిన ఆరుగురు మాత్రమే మిగిలారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఆరుగురు టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఎమ్మెల్సీలుగా ఎన్నికైన అభ్యర్థులు సాయంత్రం శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డితో కలిసి అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చి రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రాలు తీసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ తమకు చట్టసభలో అవకాశమిచ్చిన పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణను చూసి ఓర్వలేకనే..: కడియం శ్రీహరి ‘అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉంది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో చిత్తశుద్ధితో పనిచేస్తాం. అభివృద్ధిలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన కేసీఆర్ అన్ని ప్రాంతాలు, వర్గాలకు న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణను చూసి ఓర్వలేక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురి చేస్తోంది. కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చి ఏడేళ్లు కావస్తుండగా, జీడీపీ భారీగా తగ్గి కరోనా సమయంలో అట్టడుగుకు పడిపోయింది. మోదీ పాలనాదక్షుడైతే దేశ జీడీపీ ఎలా తగ్గిందో రాష్ట్ర బీజేపీ నేతలు వివరించాలి. ధాన్యం సేకరణ అంశం కేంద్రం పరిధిలోనిదే అయినప్పటికీ కొనుగోలు చేయకుండా సమస్యలు సృష్టిస్తోంది’ అని శ్రీహరి అన్నారు. -
టెస్కాబ్ చైర్మన్‌గా మళ్లీ రవీందర్రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ (టెస్కాబ్) ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. హైదరాబాద్‌లోని టెస్కాబ్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఎన్నికల్లో అధ్యక్ష పదవికి కరీంనగర్ డీసీసీబీ చైర్మన్ కొండూరు రవీందర్రావు, వైస్ చైర్మన్ పదవికి నల్లగొండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి నామినేషన్లు వేశారు. రెండు పదవులకు ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవమైంది. టెస్కాబ్ చైర్మన్, వైస్ చైర్మన్లుగా ఏకగ్రీవంగా ఎన్నికైన రవీందర్రావు, గొంగిడి మహేందర్రెడ్డిలను వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్, విప్ భానుప్రసాద్, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. కొండూరు రవీందర్రావు టెస్కాబ్‌కు రెండోసారి ఎన్నిక కావడం గమనార్హం. -
హ్యాట్రిక్ ‘కొండూరి’..!
సిరిసిల్ల: ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్‌గా జిల్లాకు చెందిన కొండూరి రవీందర్రావు ఎన్నికవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఆయన కేడీసీసీ బ్యాంకు చైర్మన్ కావడం ఇది మూడోసారి. తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు లిమిటెడ్ (టెస్కాబ్) చైర్మన్‌గా రవీందర్రావు ఐదేళ్లుగా కొనసాగుతున్నారు. మరోసారి టెస్కాబ్ చైర్మన్‌గా రవీందర్రావు పేరును సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఈనేపథ్యంలో ఆయన రాష్ట్రస్థాయిలో టెస్కాబ్ చైర్మన్ పదవి కోసం ఇప్పుడు రాష్ట్రస్థాయిలో పోటీ పడుతున్నారు. ఈనెల 5న టెస్కాబ్ చైర్మన్ ఎన్నిక ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే అన్ని జిల్లాల్లోనూ కేడీసీసీ బ్యాంకు చైర్మన్లుగా ఎన్నిక కావడంతో రాష్ట్ర స్థాయిలో టెస్కాబ్ చైర్మన్‌గా రవీందర్రావు ఎన్నిక లాంఛనమే అయింది. 15 ఏళ్లుగా సహకార రంగంలో.. గంభీరావుపేట సహకార సంఘం చైర్మన్‌గా ఎన్నికైన రవీందర్రావు ఉమ్మడి జిల్లా స్థాయిలో మూడోసా రి చైర్మన్‌గా ఎన్నికై హ్యాట్రిక్ సాధించా రు. తొలిసారి 2005 లో గంభీరావుపేట మండలం గజసింగవరం నుంచి డైరెక్టర్‌గా, సింగిల్‌విండో చైర్మన్‌గా ఎన్నికై కేడీసీసీ బ్యాంక్ పదవి అలంకరించారు. ఎన్నికయ్యారు. రెండోసారి 2013లోనూ జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్‌గా ఎన్నికయ్యా రు. 2015లో తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంక్ చైర్మన్‌గా నియమితులయ్యారు. 2019లో అంతర్జాతీయ సహకార బ్యాంక్‌ల సమాఖ్య ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. దేశవ్యాప్తంగా స హకార రంగంలో పనిచేసే ఉద్యోగుల హెచ్ఆర్ పాలసీ అమలు కమిటీకి రవీందర్రావు చైర్మన్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేడీసీసీ బ్యాంక్ చైర్మన్‌గా ఎన్నిక అయ్యారు. 15 ఏళ్లుగా సహకార రంగంలో రవీందర్రావు సేవలు అందిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సహకార బ్యాంకులను బలోపేతం చేయడానికి ఆయన ఎంతో కృషి చేశారు. సహకార సంఘాల ఆధ్వర్యంలో డీజిల్, పెట్రోల్ బంకుల ఏర్పాటు, ప్రతి సహకార సంఘాన్ని బ్యాంకులా మార్చేందుకు ఆయన శ్రమించారు. జిల్లాకు ఆరు డైరెక్టర్ పదవులు... జిల్లాకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయిలో ఆరు డైరెక్టర్ పదవులు లభించాయి. కేడీసీసీబీలో డైరెక్టర్లుగా వుచ్చిడి మోహన్‌రెడ్డి (అల్మాస్పూర్), భూపతి సురేందర్ (కొత్తపల్లి), జల్గం కిషన్‌రావు (సనుగుల), వీరబత్తిని కమలాకర్ (సిరిసిల్ల), ముదిగంటి సురేందర్‌రెడ్డి (నర్సింగా పూర్), గాజుల నారాయణ (సిరిసిల్ల అర్బన్ బ్యాంక్)లకు సహకార డైరెక్టర్లుగా అవకాశం లభించింది. సహకార ఎన్నికల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు సముచిత స్థానం దక్కింది. ఉమ్మడి జిల్లా స్థాయిలో చైర్మన్‌గా రవీందర్రావు ఉండగా... రాష్ట్ర స్థాయిలోనూ టెస్కాబ్ చైర్మన్ అవకాశం ఆయనకే లభించడంతో మరోసారి రాష్ట్ర స్థాయి పదవి రాజన్న సిరిసిల్ల జిల్లాకు లభించింది. పలువురు జిల్లా నాయకులు రవీందర్రావును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. -
1,600 కోట్లతో 400 వంతెనలు
బషీరాబాద్ (తాండూరు): రాష్ట్రంలో మూడున్నర ఏళ్లలో రూ. 1,600 కోట్లతో 400 వంతెనల నిర్మాణం చేపట్టినట్లు రోడ్లు, భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ రవీందర్రావు తెలిపారు. ఇందులో ఇరిగేషన్ కోసం 150 చెక్‌డ్యామ్‌లను నిర్మించినట్లు చెప్పారు. ప్రధానంగా గోదావరి నదిపై 5, కృష్ణానదిపై 2 భారీ వంతెనల పనులు శరవేగంగా జరుగుతున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటికే 162 వంతెనల నిర్మాణాలు పూర్తిచేసినట్లు చెప్పారు. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 82 భారీ వంతెనల నిర్మాణం జరుగుతోందన్నారు. గురువారం ఆయన వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జీవన్గీలో కాగ్నా నదిపై రూ.13.40 కోట్లతో నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న వంతెనలను వచ్చే ఏడాది జూన్‌లోపు పూర్తిచేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 6,017 కి.మీ. పొడవున ఉన్న డబుల్‌లేన్ రోడ్లను రాష్ట్ర ప్రభుత్వం రూ. 4,500 కోట్ల నిధులు ఖర్చు చేసి 4 రెట్ల మేర విస్తరించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10,450 కి.మీ. డబుల్‌లేన్ రోడ్లు నిర్మాణం అయినట్లు పేర్కొన్నారు. 10 సంవత్సరాల వరకు మరమ్మతులకు గురికాకుండా ఉండే విధంగా నాణ్యత ప్రమాణాలు తీసుకుంటున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో ఆధునిక సాంకేతిక పద్ధతులను ఉపయోగించి రోడ్ల నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు. నిజామాబాద్ జిల్లా లో ప్రయోగాత్మకంగా ‘సాయిల్ స్టెబిలైజేషన్’ పద్ధతిలో రోడ్ల నిర్మాణం చేసినట్లు పేర్కొన్నారు. మిషన్ భగీరథ పైపులైన్ల కోసం తవ్విన రోడ్లను కాంట్రాక్టర్లే సీసీతో మరమ్మతులు చేయాల్సి ఉందని, దీనికి సంబంధించి ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఆర్అండ్బీ ఎస్ఈ రమేశ్‌బాబు ఉన్నారు. -
దేశ పురోగతికి ‘మార్గం’: తుమ్మల
హైటెక్స్‌లో ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సదస్సు ప్రారంభం మెరుగైన రోడ్ల నిర్మాణానికి సదస్సు దోహదపడుతుందని ఆశాభావం సాక్షి, హైదరాబాద్: ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సదస్సులో తీసుకునే నిర్ణయాలు దేశానికి ప్రయోజనకరంగా మారతాయని రోడ్లు భవనా ల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పేర్కొ న్నారు. రోడ్ల వంటి మౌలిక వసతులు మెరుగ్గా ఉన్నప్పుడే దేశ పురోగతికి మార్గం సుగమమ వుతుందని చెప్పారు. రోడ్ల నిర్మాణంలో కొత్తపుంతలు తొక్కించే నిర్ణయాలు తీసుకు నేందుకు ఇండియన్ రోడ్ కాంగ్రెస్ వేదిక కానుందన్నారు. 77వ రోడ్ కాంగ్రెస్ సదస్సును గురువారం హైటెక్స్‌లో తుమ్మల ప్రారంభిం చారు. రెండున్నరేళ్ల అనతికాలంలోనే తెలంగాణ పురోగతి మార్గంలో ఎంతో ముందుకెళ్లిందని, ఇందులో మెరుగైన రోడ్ల నిర్మాణం కూడా భాగమని తుమ్మల చెప్పారు. తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందాలంటే నాణ్యమైన రోడ్లు ఉండాలని గుర్తించిన సీఎం చంద్రశేఖరరావు రోడ్ల నిర్మాణానికి దాదాపు రూ.12,500 కోట్లు కేటాయించినట్లు పేర్కొ న్నారు. అంత మొత్తాన్ని ఖర్చు చేస్తున్నందున రోడ్ల నిర్మాణం మరింత మెరుగ్గా ఉండేందుకు ఈ సదస్సులో తీసుకునే నిర్ణయాలు దోహదపడుతాయని చెప్పారు. రోడ్లు మాత్రమే కాకుండా వాగులు, వంకలు, నదులపై వంతెనలు నిర్మిస్తు న్నామని, నీటి నిల్వకు ఉపయోగపడేలా చెక్‌డ్యాం నమూనాలో రోడ్లను నిర్మిస్తున్నట్లు వివరించారు. హైదరాబాద్‌లో ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సదస్సు నిర్వహించే అవకాశం రావడం గర్వ కారణమని, ఇప్పటివరకు ఏ సదస్సు జరగని రీతిలో ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అంతర్జాతీయంగా రోడ్ల నిర్మాణంలో వస్తున్న కొత్త పద్ధతులు, విధానాలపై అవగాహన పెంచుకోవటానికి ఈ సదస్సు దోహదపడుతుందని ఇండియన్ రోడ్ కాంగ్రెస్ అధ్యక్షుడు పోర్వాల్ పేర్కొన్నారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ఈఎన్సీలు భిక్షపతి, రవీందర్రావు, గణపతిరెడ్డి పాల్గొన్నారు. ఆకట్టుకున్న ఉత్పత్తుల ప్రదర్శన.. రోడ్ల నిర్మాణానికి ఉపయోగపడే వివిధ అంశాలతో కూడిన ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. వివిధ ఉత్పత్తులను ఆయా సంస్థలు ప్రదర్శించాయి. హైటెక్స్ రెండో స్టాల్‌ను ఇందుకు కేటాయించారు. టెక్నికల్ సెషన్ ప్రారంభానికి ముందు తుమ్మల ఈ ప్రదర్శనను ప్రారంభించారు. కాంక్రీట్ మిక్స్, రోడ్లపై గుర్తులు గీసేందుకు వినియోగించే రంగులు, స్పీడ్ బ్రేకర్ల వద్ద బ్లింకర్స్, తారు కలిపే యంత్రాలు సెన్సార్ల ద్వారా తారు, కాంక్రీట్ కలిపే భారీ యంత్రాలు, టిప్పర్లు వంటి ఉత్పత్తులు ప్రదర్శనకు ఉంచారు. శుక్రవారం జరిగే టెక్నికల్ సెషన్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర ప్రారంభిస్తారు. -
బాలికపై అత్యాచారం.. నిందితుడి అరెస్ట్
హైదరాబాద్: ఇంటికి ఎదురుగా ఉండే ఎనిమిదేళ్ల బాలికపై కన్నేశాడో కీచకుడు. నాచారం అంబేద్కర్‌నగర్‌కు చెందిన నీలేందర్ (33) అనే వ్యక్తి.. గత నెల 29న బాలిక ఇంట్లో ఎవరూ లేనిది గమనించి మభ్యపెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. అదే వీధిలో నివాసముండే బాధితురాలు ఈ విషయాన్ని తన తండ్రి దృష్టికి ఆలస్యంగా తీసుకరావడంతో గురువారం వెలుగులోకి వచ్చింది. దీంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు నాచారం పోలీసు ఇన్స్పెక్టర్ రవీందర్ రావు వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రాణం తీసిన ‘మిస్డ్ కాల్’
కుత్బుల్లాపూర్: వేకువజామున వచ్చిన ఓ మిస్డ్ కాల్ మహిళ మృతికి కారణమైంది. ఈ సంఘటన పేట్‌బషీరాబాద్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రవీందర్రావు, బాధితులు తెలిపిన వివరాలు.. మెదక్ జిల్లా దుబ్బాక మండలం, ఎనగుర్తికి చెందిన కనకవ్వ(30)కు అదే మండలం ఆకారం గ్రామానికి చెందిన నర్సింహ(36)తో 2005లో వివాహం జరిగింది. ఎనిమిదేళ్ల పాటు స్వగ్రామంలోనే ఉన్న వీరు కుటుంబ కలహాల నేపథ్యంలో ఏడాది క్రితం రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ మండలం, గుండ్లపోచంపల్లికి వచ్చి ఉంటున్నారు. కనకవ్వ స్థానికంగా ఉన్న ఓ సీడ్స్ కంపెనీలో పనికి వెళ్తుండగా, నర్సింహ కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. వీరికి కుమార్తె నవ్వ(8) ఉంది. భార్యపై అనుమానంతో నర్సింహ తరచూ గొడవ పడుతుండేవారు. ఈ క్రమంలో శనివారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఆదివారం తెల్లవారు జామున 3.30 గంటలకు కనకవ్వ సెల్‌ఫోన్‌కు మిస్డ్ కాల్ వచ్చింది. దీంతో నర్సింహ ఆ కాల్ ఎక్కడ నుంచి వచ్చింది.. ఎవడు చేశాడంటూ ఆమెను తీవ్రంగా చితకబాదాడు. పక్కనే ఉంటున్న అత్తగారి ఇంటికి తరిమి కొట్టాడు. దెబ్బలకు తాళలేక కనకవ్వ స్పృహ కోల్పోయింది. అనంతరం ఆమెను పేట్ బషీరాబాద్‌లోని ఆర్ఆర్ ఆస్పత్రికి తరలించగా తలకు తీవ్ర గాయాలు కావడంతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. నర్సింహను అదుపులోకి తీసుకున్నారు. రాత్రి సమయంలో వచ్చి న మిస్డ్ కాల్ నంబరుపై పోలీసులు ఆరా తీస్తున్నారు.