
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ (టెస్కాబ్) ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. హైదరాబాద్‌లోని టెస్కాబ్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఎన్నికల్లో అధ్యక్ష పదవికి కరీంనగర్ డీసీసీబీ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు, వైస్ చైర్మన్ పదవికి నల్లగొండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి నామినేషన్లు వేశారు. రెండు పదవులకు ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవమైంది. టెస్కాబ్ చైర్మన్, వైస్ చైర్మన్లుగా ఏకగ్రీవంగా ఎన్నికైన రవీందర్‌రావు, గొంగిడి మహేందర్‌రెడ్డిలను వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్, విప్ భానుప్రసాద్, ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. కొండూరు రవీందర్‌రావు టెస్కాబ్‌కు రెండోసారి ఎన్నిక కావడం గమనార్హం.