దేశ పురోగతికి ‘మార్గం’: తుమ్మల | Indian Road Congress Conference beginning | Sakshi
Sakshi News home page

దేశ పురోగతికి ‘మార్గం’: తుమ్మల

Published Fri, Dec 16 2016 2:02 AM | Last Updated on Thu, Aug 30 2018 5:49 PM

దేశ పురోగతికి ‘మార్గం’: తుమ్మల - Sakshi

దేశ పురోగతికి ‘మార్గం’: తుమ్మల

హైటెక్స్‌లో ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ సదస్సు ప్రారంభం
మెరుగైన రోడ్ల నిర్మాణానికి సదస్సు దోహదపడుతుందని ఆశాభావం


సాక్షి, హైదరాబాద్‌: ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ సదస్సులో తీసుకునే నిర్ణయాలు దేశానికి ప్రయోజనకరంగా మారతాయని రోడ్లు భవనా ల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పేర్కొ న్నారు. రోడ్ల వంటి మౌలిక వసతులు మెరుగ్గా ఉన్నప్పుడే దేశ పురోగతికి మార్గం సుగమమ వుతుందని చెప్పారు. రోడ్ల నిర్మాణంలో కొత్తపుంతలు తొక్కించే నిర్ణయాలు తీసుకు నేందుకు ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ వేదిక కానుందన్నారు. 77వ రోడ్‌ కాంగ్రెస్‌ సదస్సును గురువారం హైటెక్స్‌లో తుమ్మల ప్రారంభిం చారు. రెండున్నరేళ్ల అనతికాలంలోనే తెలంగాణ పురోగతి మార్గంలో ఎంతో ముందుకెళ్లిందని, ఇందులో మెరుగైన రోడ్ల నిర్మాణం కూడా భాగమని తుమ్మల చెప్పారు. తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందాలంటే నాణ్యమైన రోడ్లు ఉండాలని గుర్తించిన సీఎం చంద్రశేఖరరావు రోడ్ల నిర్మాణానికి దాదాపు రూ.12,500 కోట్లు కేటాయించినట్లు పేర్కొ న్నారు.

 అంత మొత్తాన్ని ఖర్చు చేస్తున్నందున రోడ్ల నిర్మాణం మరింత మెరుగ్గా ఉండేందుకు ఈ సదస్సులో తీసుకునే నిర్ణయాలు దోహదపడుతాయని చెప్పారు. రోడ్లు మాత్రమే కాకుండా వాగులు, వంకలు, నదులపై వంతెనలు నిర్మిస్తు న్నామని, నీటి నిల్వకు ఉపయోగపడేలా చెక్‌డ్యాం నమూనాలో రోడ్లను నిర్మిస్తున్నట్లు వివరించారు. హైదరాబాద్‌లో ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ సదస్సు నిర్వహించే అవకాశం రావడం గర్వ కారణమని, ఇప్పటివరకు ఏ సదస్సు జరగని రీతిలో ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అంతర్జాతీయంగా రోడ్ల నిర్మాణంలో వస్తున్న కొత్త పద్ధతులు, విధానాలపై అవగాహన పెంచుకోవటానికి ఈ సదస్సు దోహదపడుతుందని ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పోర్‌వాల్‌ పేర్కొన్నారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ఈఎన్‌సీలు భిక్షపతి, రవీందర్‌రావు, గణపతిరెడ్డి పాల్గొన్నారు.

ఆకట్టుకున్న ఉత్పత్తుల ప్రదర్శన..
రోడ్ల నిర్మాణానికి ఉపయోగపడే వివిధ అంశాలతో కూడిన ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. వివిధ ఉత్పత్తులను ఆయా సంస్థలు ప్రదర్శించాయి. హైటెక్స్‌ రెండో స్టాల్‌ను ఇందుకు కేటాయించారు. టెక్నికల్‌ సెషన్‌ ప్రారంభానికి ముందు తుమ్మల ఈ ప్రదర్శనను ప్రారంభించారు. కాంక్రీట్‌ మిక్స్, రోడ్లపై గుర్తులు గీసేందుకు వినియోగించే రంగులు, స్పీడ్‌ బ్రేకర్ల వద్ద బ్లింకర్స్, తారు కలిపే యంత్రాలు సెన్సార్ల ద్వారా తారు, కాంక్రీట్‌ కలిపే భారీ యంత్రాలు, టిప్పర్లు వంటి ఉత్పత్తులు ప్రదర్శనకు ఉంచారు. శుక్రవారం జరిగే టెక్నికల్‌ సెషన్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర ప్రారంభిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement