Haiteks
-
దేశ పురోగతికి ‘మార్గం’: తుమ్మల
హైటెక్స్‌లో ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సదస్సు ప్రారంభం మెరుగైన రోడ్ల నిర్మాణానికి సదస్సు దోహదపడుతుందని ఆశాభావం సాక్షి, హైదరాబాద్: ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సదస్సులో తీసుకునే నిర్ణయాలు దేశానికి ప్రయోజనకరంగా మారతాయని రోడ్లు భవనా ల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పేర్కొ న్నారు. రోడ్ల వంటి మౌలిక వసతులు మెరుగ్గా ఉన్నప్పుడే దేశ పురోగతికి మార్గం సుగమమ వుతుందని చెప్పారు. రోడ్ల నిర్మాణంలో కొత్తపుంతలు తొక్కించే నిర్ణయాలు తీసుకు నేందుకు ఇండియన్ రోడ్ కాంగ్రెస్ వేదిక కానుందన్నారు. 77వ రోడ్ కాంగ్రెస్ సదస్సును గురువారం హైటెక్స్‌లో తుమ్మల ప్రారంభిం చారు. రెండున్నరేళ్ల అనతికాలంలోనే తెలంగాణ పురోగతి మార్గంలో ఎంతో ముందుకెళ్లిందని, ఇందులో మెరుగైన రోడ్ల నిర్మాణం కూడా భాగమని తుమ్మల చెప్పారు. తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందాలంటే నాణ్యమైన రోడ్లు ఉండాలని గుర్తించిన సీఎం చంద్రశేఖరరావు రోడ్ల నిర్మాణానికి దాదాపు రూ.12,500 కోట్లు కేటాయించినట్లు పేర్కొ న్నారు. అంత మొత్తాన్ని ఖర్చు చేస్తున్నందున రోడ్ల నిర్మాణం మరింత మెరుగ్గా ఉండేందుకు ఈ సదస్సులో తీసుకునే నిర్ణయాలు దోహదపడుతాయని చెప్పారు. రోడ్లు మాత్రమే కాకుండా వాగులు, వంకలు, నదులపై వంతెనలు నిర్మిస్తు న్నామని, నీటి నిల్వకు ఉపయోగపడేలా చెక్‌డ్యాం నమూనాలో రోడ్లను నిర్మిస్తున్నట్లు వివరించారు. హైదరాబాద్‌లో ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సదస్సు నిర్వహించే అవకాశం రావడం గర్వ కారణమని, ఇప్పటివరకు ఏ సదస్సు జరగని రీతిలో ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అంతర్జాతీయంగా రోడ్ల నిర్మాణంలో వస్తున్న కొత్త పద్ధతులు, విధానాలపై అవగాహన పెంచుకోవటానికి ఈ సదస్సు దోహదపడుతుందని ఇండియన్ రోడ్ కాంగ్రెస్ అధ్యక్షుడు పోర్వాల్ పేర్కొన్నారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ఈఎన్సీలు భిక్షపతి, రవీందర్రావు, గణపతిరెడ్డి పాల్గొన్నారు. ఆకట్టుకున్న ఉత్పత్తుల ప్రదర్శన.. రోడ్ల నిర్మాణానికి ఉపయోగపడే వివిధ అంశాలతో కూడిన ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. వివిధ ఉత్పత్తులను ఆయా సంస్థలు ప్రదర్శించాయి. హైటెక్స్ రెండో స్టాల్‌ను ఇందుకు కేటాయించారు. టెక్నికల్ సెషన్ ప్రారంభానికి ముందు తుమ్మల ఈ ప్రదర్శనను ప్రారంభించారు. కాంక్రీట్ మిక్స్, రోడ్లపై గుర్తులు గీసేందుకు వినియోగించే రంగులు, స్పీడ్ బ్రేకర్ల వద్ద బ్లింకర్స్, తారు కలిపే యంత్రాలు సెన్సార్ల ద్వారా తారు, కాంక్రీట్ కలిపే భారీ యంత్రాలు, టిప్పర్లు వంటి ఉత్పత్తులు ప్రదర్శనకు ఉంచారు. శుక్రవారం జరిగే టెక్నికల్ సెషన్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర ప్రారంభిస్తారు. -
ఉత్సాహ తరన్‌గం
-
అందుబాటు ధరల్లో ఔషధాలు
ఫార్మా సదస్సులో నిపుణుల సూచన నూతన ఔషధాలపై విస్తృత చర్చ సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు చౌకధరల్లో ఔషధాలు అందుబాటులోకి తీసుకురావాలని జాతీయ ఫార్మా సదస్సులో నిఫుణులు అభిప్రాయపడ్డారు. ఔషధ ప్రయోగాల్లో నూతన సాంకేతిక వైద్య పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని నిర్ణయించారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో శనివారం 66వ ఇండియన్ ఫార్మాసూటికల్ కాంగ్రెస్ సదస్సు రెండో రోజు కొనసాగింది. ఈ సదస్సులో నూతన ఔషదాలు, అంతర్జాతీయ స్థాయిలో చేపట్టిన పరిశోధన ఫలితాలు వంటి అంశాలపై చర్చించారు. ఫార్మా రంగంలో వస్తున్న మార్పులు, కొత్త ఆవిష్కరణలపై ప్రముఖులు విసృ్తతంగా చర్చలు జరిపారు. ఆదివారం కూడా కొనసాగే ఈ సదస్సులో దేశంలోని ప్రముఖ ఫార్మా రంగ నిఫుణులు, ప్రొఫెసర్లు, విద్యార్థులు భాగస్వాములవుతున్నారు. అంతర్జాతీయ అనుభవాలను పంచుకునేందుకు బ్రిటన్, నైజీరియా, హంగరీ, ఫ్రాన్స్, కాంబోడియా, జాంబియా, రుమానియా, మాల్దొవా తదితర దేశాల నుండి ప్రతినిధులు పాల్గొంటున్నారు. ప్రొఫెసర్లు, ఫార్మా ప్రముఖులు వివిధ అంశాలపై ప్రసంగాలు చేయగా.. ఫార్మసీ విద్యార్థులు పేపర్, పోస్టర్ ప్రజెంటేషన్లలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫార్మా ఎక్స్పో, ఎగ్జిబిషన్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అధునాతన ఔషధ పరికరాలు, వివిధ రకాల మెషిన్లను ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. -
విశాఖలో హైటెక్ సెంటర్
విశాఖపట్నం: విశాఖను మరింత అభివృద్ధి చేసేందుకు వీలుగా పీసీపీఐఆర్, ఐటీఐఆర్, హైటెక్స్, కన్వెన్షన్, ట్రేడ్ సెంటర్లు తదితర ప్రాజెక్టులు చేపడుతున్న ట్టు ఏపీ రాష్ట్ర మానవ వనరులు, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మాదిరి విశాఖలో 250 ఎకరాల్లో హైటెక్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకు మధురవాడలో స్థలాన్ని గుర్తించినట్టు వెల్లడించారు. ఈ నెల 29న జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతులు మీదుగా ఇంక్యుబేషన్ సెంటర్ ప్రారంభించనున్నట్టు చెప్పారు.