సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కా బ్) చైర్మన్ కొండూరి రవీందర్‌రావు శుక్రవారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తాను చైర్మన్‌గా ఉన్న తొమ్మిదేళ్లలో సహ కార బ్యాంకులను దేశంలో అగ్ర గామిగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. అనేక సంస్కరణలు తీసుకొచ్చి బ్యాంకులను బలోపేతం చేశానన్నారు. ప్రభు త్వం మారడంతో తనపై అవిశ్వాసం పెట్టారని, కానీ అంతకన్నా ముందే తన పదవికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు.
మాజీ సీఎం కేసీఆర్ సహకారంతో సహకార బ్యాంకులను బలోపేతం చేసి, రైతులకు మేలు జరిగేలా చర్యలు తీసుకు న్నట్లు వివరించారు. తాము వచ్చిన తర్వాత బ్యాంకుల్లో 7,165 ఉద్యో గాలను భర్తీ చేసినట్లు తెలిపారు. గోదాముల నిర్మాణం, పెట్రోల్ బంకుల ఏర్పాటు, పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడం వంటి వ్యాపా రాలను నిర్వహించిన ట్లు చెప్పారు. సహకార బ్యాంకుల కంప్యూటరీ కరణ, ప్రత్యేక సైబర్ సెక్యూరిటీ విభాగాన్ని ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. బోర్డులోని డైరెక్టర్లు పార్టీ మారి తనపై అవిశ్వాసం పెట్టార న్నారు. అందుకే తాన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సమావేశంలో టెస్కా బ్ వైస్ చైర్మన్ మహేందర్‌రెడ్డి కూడా తన రాజీనామాను ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment