Tesco
-
ఏపీలోనూ టెస్కో విక్రయాలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో తయారయ్యే నేత వస్త్రాలను పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోనూ విక్రయించేందుకు తెలంగాణ చేనేత సహకార సంస్థ (టెస్కో) సన్నాహాలు చేస్తోంది. సంస్థ కార్యకలాపాల విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ఏపీలోనూ కొత్తగా ఐదు ప్రదర్శన, విక్రయశాలలు (షోరూంలు) ఏర్పాటు చేయనుంది. మరోవైపు ఆన్లైన్ విక్రయాలకు వస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకొని మరిన్ని విభిన్న డిజైన్లు, ఉత్పత్తులను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. తద్వారా నేత రంగంపై ఆధారపడిన కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని టెస్కో వర్గాలు చెబుతున్నాయి. దక్షిణాదిలో విక్రయాలపై కూడా దృష్టిటెస్కో పరిధిలో దేశవ్యాప్తంగా 32 షోరూమ్‌లు ఉన్నాయి. వీటిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తొమ్మిది, రాష్ట్రంలోని ఇతర చోట్ల 15 షోరూమ్‌లు ఉన్నాయి. ఏపీ పునర్విభజనకు ముందు ఉమ్మడి చేనేత సహకార సంస్థ ఆప్కో పరిధిలో ఉన్న మరో ఎనిమిది షోరూమ్‌లు కూడా టెస్కో పరిధిలోకి వచ్చాయి. టెస్కో ఆధ్వర్యంలో ప్రస్తుతం న్యూఢిల్లీలో 3, ముంబైలో 2, కోల్‌కతా, ఔరంగాబాద్, కాన్పూర్‌లో ఒక్కో షోరూమ్ ఉంది.రాష్ట్రం బయట ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రమే టెస్కో షోరూమ్‌లు ఉండటంతో దక్షిణాదిపై దృష్టి సారించి అందుకు అనుగుణంగా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. టెస్కో అధికారుల బృందం ఇప్పటికే ఏపీలోని విజయవాడ, నెల్లూరు, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నంలో పరిశీలించి షోరూమ్‌ల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను ఎంపిక చేసింది. తమిళనాడు, కర్ణాటకలోనూ తెలంగాణ వస్త్రోత్పత్తును విక్రయించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఏడు క్లస్టర్లలో వస్త్రోత్పత్తులుప్రస్తుతం తెలంగాణలో ఏడు చేనేత క్లస్టర్లు గద్వాల, నారాయణపేట, పోచంపల్లి, సిద్దిపేట, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్‌లో నేత కార్మికులు వస్త్రాలను ఉత్పత్తి చేస్తున్నారు. గద్వాలలో కాటన్, సిల్క్, సీకో, పైటాన్, నారాయణపేటలో కాటన్, సిల్క్, పోచంపల్లిలో టై అండ్ డై, కాటన్, సిల్క్ డ్రస్ మెటిరీయల్, పట్టుచీరలు, డ్రస్ మెటీరియల్స్, ఇక్కత్ ఉత్పత్తులు ఉన్నాయి. సిద్దిపేటలో గొల్లభామ, వరంగల్ ఢర్రీస్, కరీంనగర్ లుంగీలు, టవల్స్, మహబూబ్‌నగర్ ఊలు ఉత్పత్తులకు పేరొందాయి. మహదేవ్‌పూర్‌లో తయారయ్యే టస్సర్ సిల్క్‌కు మంచి ఆదరణ ఉంది. ప్రస్తుతం టెస్కో షోరూమ్‌లలో 233 రకాల విభిన్న వస్త్రోత్పత్తులకు సంబంధించి ఏటా రూ.30 కోట్ల మేర లావాదేవీలు జరుగుతున్నాయి.ఆన్లైన్ విక్రయాలపై టెస్కో దృష్టిటెస్కో అనుసరిస్తున్న ‘ఈ–మార్కెటింగ్’కు ఆదరణ పెరుగుతుండటంతో ఆన్లైన్ విక్రయాలపైనా టెస్కో దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా ఏటా సగటున రూ.60 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు ఉత్పత్తులు అమ్మకం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ వస్త్ర ఉత్పత్తులన్నింటినీ ఆన్లైన్లో విక్రయించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. -
టెస్కాబ్ చైర్మన్ కొండూరి రాజీనామా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కా బ్) చైర్మన్ కొండూరి రవీందర్రావు శుక్రవారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తాను చైర్మన్‌గా ఉన్న తొమ్మిదేళ్లలో సహ కార బ్యాంకులను దేశంలో అగ్ర గామిగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. అనేక సంస్కరణలు తీసుకొచ్చి బ్యాంకులను బలోపేతం చేశానన్నారు. ప్రభు త్వం మారడంతో తనపై అవిశ్వాసం పెట్టారని, కానీ అంతకన్నా ముందే తన పదవికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు.మాజీ సీఎం కేసీఆర్ సహకారంతో సహకార బ్యాంకులను బలోపేతం చేసి, రైతులకు మేలు జరిగేలా చర్యలు తీసుకు న్నట్లు వివరించారు. తాము వచ్చిన తర్వాత బ్యాంకుల్లో 7,165 ఉద్యో గాలను భర్తీ చేసినట్లు తెలిపారు. గోదాముల నిర్మాణం, పెట్రోల్ బంకుల ఏర్పాటు, పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడం వంటి వ్యాపా రాలను నిర్వహించిన ట్లు చెప్పారు. సహకార బ్యాంకుల కంప్యూటరీ కరణ, ప్రత్యేక సైబర్ సెక్యూరిటీ విభాగాన్ని ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. బోర్డులోని డైరెక్టర్లు పార్టీ మారి తనపై అవిశ్వాసం పెట్టార న్నారు. అందుకే తాన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సమావేశంలో టెస్కా బ్ వైస్ చైర్మన్ మహేందర్‌రెడ్డి కూడా తన రాజీనామాను ప్రకటించారు. -
‘పతాక’ స్థాయిలో పొరపాట్లు! జెండాల పంపిణీలో ఫ్లాగ్ కోడ్ ఉల్లంఘనలు
సాక్షి, హైదరాబాద్: మూడు వర్ణాల్లో ఒక్కో వర్ణానిది ఒక్కో సైజు.. రంగులు సరిగ్గా అద్దక మధ్యలో తెల్లటి చారలు.. తెలుపు వర్ణం మధ్యలో ఉండాల్సిన అశోక చక్రం పక్కకు జరగడం.. జెండాలపై చేతి రాతలు.. వెరసి జాతీయ పతాక నియమావళి (ఫ్లాగ్ కోడ్) ఉల్లంఘనలు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఆగస్టు 15న ప్రతీ ఇంటిపై ఎగురవేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా జాతీయ జెండాలను పంపిణీ చేస్తుండగా.. చాలామంది ఇలాంటి నాసిరకం జెండాలు అందుకుని విస్మయానికి గురయ్యారు. కొన్నిచోట్ల ఫ్లాగ్ కోడ్‌కు విరుద్ధంగా జెండాలపై స్టాకు వివరాలను రాయడం గమనార్హం. ఫ్లాగ్ కోడ్‌లో నిర్దేశించిన పరిమాణం, రంగులు, డిజైన్‌ను కచ్చితంగా అనుసరిస్తూ జెండాలను తయారు చేయాలి. జాతీయ జెండా తప్పనిసరిగా దీర్ఘచతురస్రాకారంలో ఉండాలి. నిలువు, అడ్డం మధ్య నిష్పత్తి 2:3 ఉండాలి. నిర్దేశిత 9 రకాల సైజుల్లో మాత్రమే జెండాలుండాలి. కాషాయ, తెలుపు, ఆకుపచ్చ వర్ణాలు సమవైశాల్యంలో ఉండాలి. తెలుపు రంగు పట్టీ మధ్యలో అశోకచక్రం ఉండాలి. జెండాపై ఎలాంటి ఇతర రాతలు ఉండొద్దు. కానీ, కొన్ని జెండాల విషయంలో ఈ నిబంధనలన్నింటికీ తూట్లు పొడిచినట్టు ఉంటోంది. నాణ్యత లేని జెండాలు అందుకున్నట్టు సామాజిక మాధ్యమాల్లో కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం సరిగ్గా శ్రద్ధ చూపడంలేదని విమర్శిస్తున్నారు. సిరిసిల్ల నుంచి కొనుగోళ్లు రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఉచితంగా జాతీయ జెండాలను పంపిణీ చేసేందుకు టెస్కో ఆధ్వర్యంలో 1.2 కోట్ల జెండాలను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ఒక్కో జెండాకు రూ.23 ధరను ఖరారు చేసింది. సిరిసిల్ల చేనేత కార్మికుల నుంచి జెండాల తయారీకి కావాల్సిన 98 శాతం వస్త్రాన్ని కొనుగోలు చేసింది. 60 లక్షల జెండాలను కుట్టే ఆర్డర్‌ను సిరిసిల్ల చేనేత కార్మికులకు ఇవ్వగా, హైదరాబాద్‌లోని ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు మరో 30 లక్షలు; ఖమ్మం, మిర్యాలగూడలోని ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు మిగిలిన జెండాలను కుట్టే ఆర్డర్‌ను టెస్కో ఇచ్చింది. ఒక్కో జెండాను కుట్టడానికి రూ.5 ధరను నిర్ణయించింది. జెండాలను కుట్టే వాళ్లే వస్త్రాన్ని నిర్దేశిత సైజులో కత్తిరించి చేయాల్సి ఉండగా, అడ్డగోలుగా కత్తిరించి కుట్టుతుండటంతోనే సమస్య వచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 37 లక్షల జాతీయ జెండాలను పంపిణీ చేశారు. గ్రామాల్లో 30 లక్షలు, పట్టణాల్లో 7 లక్షల జెండాలు పంపిణీ చేశారు. మిగిలినవి ఆగస్టు 15కల్లా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పురపాలక, పంచాయతీరాజ్ శాఖలు జెండాల పంపిణీని పర్యవేక్షిస్తున్నాయి. వాటిని పంపిణీ చేయొద్దని ఆదేశించాం భారీ ఎత్తున జాతీయ జెండాల తయారీ సందర్భంగా కొన్ని జెండాలు లోపాలతో వస్తున్నాయి. తయారీ, కుట్టడం, పంపిణీ దశల్లోనే అలాంటి జెండాలను గుర్తించి తొలగిస్తున్నాం. అలాంటి జెండాలను పంపిణీ చేయొద్దని కలెక్టర్లను ఆదేశించాం. –జ్యోతిబుద్ధప్రసాద్, కమిషనర్, టెస్కో -
నేతన్నలకు ‘జెండా’ పండుగ
పవర్‌లూమ్స్‌పై పాలిస్టర్ వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తున్న ఇతని పేరు మామిడాల సమ్మయ్య. సిరిసిల్లలోని విద్యానగర్‌కు చెందిన సమ్మయ్య నిత్యం 12 సాంచాలపై పనిచేస్తూ పాలిస్టర్ వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. సమ్మయ్యకు వారానికి రూ.2,500 కూలి వస్తుంది. ఇలా ఒక్క సమ్మయ్యనే కాదు.. సిరిసిల్లలో 5 వేల మంది కార్మికులు శ్రమిస్తున్నారు. జాతీయ జెండాల తయారీపని చేస్తున్న వీరు సిరిసిల్లకు చెందిన మహిళలు. దేశవ్యాప్తంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాలను ఎగురవేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అందుకు అవసరమైన జెండాలను సిరిసిల్లలో సిద్ధం చేస్తున్నారు. సిరిసిల్లలో జెండాలు తయారుచేసే పది మంది వ్యాపారులు ఢిల్లీ సహా వివిధ రాష్ట్రాలకు జెండాలను సరఫరా చేస్తున్నారు. సిరిసిల్ల: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ప్రజల్లో దేశభక్తిని ద్విగుణీకృతం చేసేలా.. మహనీయు ల త్యాగాలు.. పోరాటఫలాలు నేటి తరానికి తెలిసేలా ప్రతి ఇంటిపై జాతీయజెండాను ఎగురవేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 15కి ముందు వారం, తరువాత మరో వారం రోజులు భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తెలంగాణవ్యాప్తంగా 1.20 కోట్ల జాతీయ జెండాలు అవసరం ఉండగా.. పాలిస్టర్ వస్త్రాన్ని టెస్కోద్వారా కొ నుగోలుచేసి, ఆ వస్త్రాన్ని ప్రాసెసింగ్ చేసి, మూడు రంగుల జెండాలను తయారుచే యాలని నిర్ణయించారు. ఈ మేరకు సిరిసిల్ల నేతన్నల వద్ద 30 లక్షల మీటర్ల వస్త్రాన్ని కొ నేందుకు టెస్కో ఆర్డర్లు ఇచ్చింది. సిరిసిల్లలో 30 లక్షల మీటర్ల వస్త్రం కొనుగోలు.. తెలంగాణవ్యాప్తంగా 38,588 పవర్‌లూమ్స్ ఉండగా.. ఒక్క సిరిసిల్లలోనే 28,494 పవర్‌లూమ్స్ ఉన్నాయి. 4,116 సాంచాలతో ఉమ్మడి నల్లగొండ జిల్లా రెండో స్థానంలో ఉంది. అతి తక్కువ సాంచాలతో (18) సంగారెడ్డి జిల్లా చివరిలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, వరంగల్, భువనగిరి ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న పాలిస్టర్ వస్త్రాన్ని టెస్కో కొనుగోలు చేస్తోంది. సిరిసిల్లలోనే 30 లక్షల మీటర్లు కొనుగోలుకు ప్రణాళిక సిద్ధం చేసింది. వస్త్ర నాణ్యత, పొడవు, వెడల్పును బట్టి రూ.13 నుంచి రూ.16 వరకు ఒక్కో మీటరుకు చెల్లించాలని నిర్ణయించారు. సిద్ధమవుతున్న జెండాలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి సిరిసిల్లకు ఆర్డర్లు వచ్చాయి. దీంతో జెండాలు తయారుచేసే వ్యాపారులు బిజీగా మారా రు. ఇక్కడి పది మంది వ్యాపారులకు 50 లక్షల జెండాల తయారీ ఆర్డర్లు వచ్చాయి. వీటి ద్వారా 1,200 మంది మహిళలు జెండాలు కుడుతూ ఉపాధి పొందుతున్నారు. ఇది అనుకోని ఆర్డర్ టెస్కో ద్వారా పాలిస్టర్ వస్త్రాన్ని కొనుగోలు చేస్తారని తెలియదు. ఇది అనుకోని ఆర్డర్. నాకు 52 సాంచాలు ఉన్నాయి. నా వద్ద నిల్వ ఉన్న 50 వేల మీటర్ల వస్త్రాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నా. టెస్కో కొనుగోలు చేయడం ఆనందంగా ఉంది. – కోడం విజయ్, వస్త్రోత్పత్తిదారుడు, సిరిసిల్ల ఢిల్లీకి 5 లక్షల జెండాలు ఇస్తున్నా.. నాకు ఢిల్లీ నుంచి జూలై 10న ఐదు లక్షల జెండాల ఆర్డర్లు వచ్చాయి. కొంచెం ముందుగా ఆర్డర్లు వస్తే ఇంకా బాగుండేది. ఇప్పుడు చాలా రాష్ట్రాల ఆర్డర్లు వస్తున్నాయి. కానీ సమయం సరిపోదు. నా వద్ద ఓ 50 మంది ఉపాధి పొందుతున్నారు. – ద్యావనపల్లి మురళి, వ్యాపారి, సిరిసిల్ల నెలకు రూ.6 వేలు సంపాదిస్తున్న నేను బీడీలు చేసిన. ఆ పని కష్టంగా ఉండటంతో జెండాలు కుట్టడం, ప్యాకింగ్ చేయడం చేస్తున్న. నెలకు రూ.6వేలు సంపాదిస్తున్న. మా ఆయన సాంబశివ సాంచాలు నడుపుతారు. మాకు ఇద్దరు పిల్లలు. ఈ పని బాగుంది. నాలాగే చాలా మంది ఈ పని చేస్తున్నారు. – వెల్దండి శైలజ, సిరిసిల్ల -
‘టెస్కో’ పాలకమండలి రద్దు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర చేనేత సహకార సంఘం (టెస్కో) ప్రస్తుత పాలక మండలిని రద్దు చేస్తూ ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు పరిశ్రమల శాఖ కార్యదర్శి సవ్యసాచి ఘోష్ జీవో నెంబర్19ను జారీ చేశారు. రాష్ట్ర హస్తకళల అభివృధ్ధి సంస్థ ఎండీని టెస్కో పర్సన్ ఇన్చార్జిగా నియమించారు. 2018 మార్చి వరకు ప్రస్తుత పాలక మండలి సభ్యుల పదవీ కాలం ఉంది. అయితే పాలక మండలి సభ్యులు, చైర్మన్ నియామకం రాజకీయాలతో ముడిపడి ఉండటంతో.. రద్దు ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. ఈ ప్రతిపాదనకు సీఎం ఆమోదముద్ర వేయడంతో శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ చేనేత సహకార సంఘం (ఆప్కో) విభజన ప్రణాళికకు గత ఏడాది ఆగస్టులో షీలా బిడే కమిటీ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో 2015 అక్టోబర్ 31 న ఆవిర్భవించిన తెలంగాణ చేనేత సహకార సంఘం (టెస్కో) సొంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆప్కో పాలక మండలిలో 24 మంది డెరైక్టర్లుగా ఉండగా.. విభజన ప్రణాళిక మేరకు తెలంగాణకు 11, ఆంధ్రప్రదేశ్‌కు 13 మంది డెరైక్టర్లను కేటాయించారు. వీరందరూ ఉమ్మడి రాష్ట్రంలో 2013 ఫిబ్రవరిలో నియమితులు కాగా.. 16 మార్చి 2018 వరకు పదవీ కాలం ఉంది. కాగా, పాలక మండలి విభజన జరిగిన నేపథ్యంలో ప్రస్తుతమున్న పాలక మండలిని రద్దు చేసి.. నూతన పాలక మండలిని నియమించాలంటూ ప్రభుత్వంపై కొందరు డెరైక్టర్లు ఒత్తిడి పెంచారు. ఈ నేపథ్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావు కొత్త పాలకమండలి నియామకంపై అడ్వకేట్ జనరల్ సలహా తీసుకున్నారు. అక్కడి నుంచి సమ్మతి రావడంతో తాజా ఉత్తర్వులు జారీ అయినట్లు తెలిసింది. -
టెస్కో పాలక మండలి రద్దా? కొనసాగింపా?
► సీఎం నిర్ణయం మేరకు నడుచుకోవాలని భావిస్తున్న అధికారులు ► విభజన ప్రణాళిక మేరకు రాష్ట్రానికి 11 మంది డెరైక్టర్లు ► 2018 మార్చితో ముగియనున్న సభ్యుల పదవీకాలం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర చేనేత సహకార సంఘం (టెస్కో) ప్రస్తుత పాలక మండలి సభ్యుల కొనసాగింపుపై సందిగ్ధం నెలకొంది. 2018 మార్చితో ప్రస్తుత పాలక మండలి సభ్యుల పదవీ కాల పరిమితి ముగియనుంది. అయితే పాలక మండలి సభ్యులు, చైర్మన్ నియామకం రాజకీయాలతో ముడిపడి ఉండటంతో రద్దు ప్రతిపాదన తెర పైకి వస్తోంది. పాలక మండలి కొనసాగించాలా.. లేక రద్దు చేయాలా అనే అంశంపై అధికార పార్టీ ముఖ్య నేతల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మార్గనిర్దేశనం మేరకు పాలక మండలి కొనసాగింపుపై నిర్ణయం తీసుకోవాలని చేనేత, జౌళి శాఖ అధికారులు భావిస్తున్నారు. పెరుగుతున్న ఒత్తిళ్లు ఆంధ్రప్రదేశ్ చేనేత సహకార సంఘం (ఆప్కో) విభజన ప్రణాళికకు గతేడాది ఆగస్టులో షీలాబిడే కమిటీ ఆమోదం తెలిపింది. 2015 అక్టోబర్ 31 నుంచి తెలంగాణ చేనేత సహకార సంఘం (టెస్కో) సొంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆప్కో పాలక మండలిలో 24 మంది ైడె రెక్టర్లుగా ఉండగా.. విభజన ప్రణాళిక మేరకు తెలంగాణకు 11, ఆంధ్రప్రదేశ్‌కు 13 మంది డెరైక్టర్లను కేటాయించారు. వీరందరూ ఉమ్మడి రాష్ట్రంలో 2013 ఫిబ్రవరిలో నియమితులు కాగా.. 2018 మార్చి 16కల్లా వీరి పదవీకాలం ముగియనుంది. పాలక మండలి విభజన జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం 11 మంది సభ్యుల్లో ఒకరిని చైర్మన్ గా ఎన్నుకునేందుకు నోటిఫికేషన్ ఇవ్వాలని.. కొందరు డెరైక్టర్లు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. వీరి ప్రతిపాదనకు టీఆర్ఎస్కు చెందిన ఇద్దరు కీలక మంత్రులు మద్దతు పలుకుతున్నట్లు సమాచారం. గతంలో ఆప్కో చైర్మన్‌గా పనిచేసిన నేత ఒకరు.. ప్రస్తుత పాలక మండలిని రద్దు చేసి కొత్తగా నియమించాలంటూ లాబీయింగ్ చేస్తున్నారు. ఇరువైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో.. సీఎం మార్గనిర్దేశనం మేరకు నడుచుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీనిపై దిశానిర్దేశం చేయాలంటూ సీఎంకు మంత్రి లేఖ రాసినట్లు సమాచారం. ఆప్కో విభజన ప్రణాళికకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు తుది ఆమోదం తెలిపితే తప్ప.. నూతన పాలక మండలిని నియమించే అవకాశం లేదని చేనేత శాఖ వర్గాలు వెల్లడించాయి. -
టెస్కో, వొడాఫోన్లకు ఎఫ్ఐపీబీ ఓకే
న్యూఢిల్లీ: దేశీయ మల్టీబ్రాండ్ రిటైలింగ్‌లో ప్రవేశించేందుకు యూకే రిటైలింగ్ దిగ్గజం టెస్కోకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్ఐపీబీ) అనుమతి లభించింది. దీంతోపాటు దేశీయ మొబైల్ దిగ్గజంలో మైనారిటీ వాటాదారుల వాటాను కొనుగోలు చేసేందుకు వొడాఫోన్‌కు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడుల పరిమితిని పెంచే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రతిపాదనపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఆర్థికశాఖ వర్గాలు ఈ విషయాలను వెల్లడించాయి. తొలి దశలో భాగంగా టెస్కో 11 కోట్ల డాలర్లను(రూ. 7,500 కోట్లు) ఇన్వెస్ట్ చేసేందుకు ప్రణాళికలు వేసింది. తద్వారా టాటా గ్రూప్‌నకు చెందిన ట్రెంట్ హైపర్‌మార్కెట్స్‌లో 50% వాటాను కొనుగోలు చేయనుంది. ఇక మరోవైపు వొడాఫోన్ ఇండియాలో నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అనల్జిత్ సింగ్‌కు గల 24.65% వాటాతోపాటు అజయ్ పిరమల్‌కు చెందిన 10.97% వాటాను బ్రిటిష్ సంస్థ వొడాఫోన్ సొంతం చేసుకోవాలని భావిస్తోంది. ఇందుకు రూ. 10,141 కోట్లను వెచ్చించనున్నట్లు అంచనా. -
ఇక టెస్కో మాల్స్..
న్యూఢిల్లీ: భారత మల్టీ బ్రాండ్ రిటైల్ మార్కెట్లో ప్రవేశించే దిశగా బ్రిటన్ రిటైల్ దిగ్గజం టెస్కో సన్నాహాలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా 110 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 680 కోట్లు) పెట్టుబడితో దేశవ్యాప్తంగా స్టోర్స్ ఏర్పాటు చేసేందుకు అనుమతుల కోసం కేంద్రానికి దరఖాస్తు చేసుకుంది. స్టోర్స్ ఏర్పాటుకు సంబంధించి టాటా గ్రూప్‌లో భాగమైన ట్రెంట్‌తో టెస్కో జతకడుతోంది. ట్రెంట్ హైపర్మార్కెట్లో 50 శాతం వాటాలను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. స్టార్ బజార్, స్టార్ డెయిలీ, స్టార్ మార్కెట్ వంటి బ్రాండ్ పేర్లతో స్టోర్స్‌ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు టెస్కో తన దరఖాస్తులో పేర్కొంది. ముందుగా బెంగళూరులోనూ, మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లోనూ టెస్కో రిటైల్ స్టోర్స్ ఏర్పాటు చేయనుంది. పారిశ్రామిక విధాన, ప్రోత్సాహక విభాగం టెస్కో దరఖాస్తును పరిశీలించనుంది. ఆ తర్వాత విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్ఐపీబీ) అనుమతుల కోసం పంపుతుంది. మల్టీ బ్రాండ్ రిటైల్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) నిబంధనలు సడలించిన తర్వాత స్టోర్స్ ఏర్పాటుకు దరఖాస్తు చేసిన తొలి విదేశీ దిగ్గజం టెస్కోనే. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద రిటైల్ సంస్థ అయిన టెస్కో.. ఇప్పటికే ట్రెంట్ భాగస్వామ్యంతో భారత్‌లో స్వల్ప స్థాయిలో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. పశ్చిమ, ద క్షిణాది రాష్ట్రాల్లో 16 అవుట్లెట్లను నిర్వహిస్తున్న ట్రెంట్ హైపర్మార్కెట్కి టెస్కో బ్యాక్ఎండ్ సహకారం అందిస్తోంది. ఏటా 3-5 స్టోర్ల ఏర్పాటు.. ప్రతి ఆర్థిక సంవత్సరం సుమారు మూడు నుంచి అయిదు స్టోర్స్‌ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు టెస్కో తన దరఖాస్తులో పేర్కొంది. అలాగే 14 రకాల ఉత్పత్తులను విక్రయించనున్నట్లు వివరించింది. ఇందులో టీ, కాఫీ, కూరగాయలు, ఫలాలు, మాంసం, చేపలు, డెయిరీ ఉత్పత్తులు, వైన్, మద్యం, టెక్స్టైల్స్, ఫుట్‌వేర్, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్, ఆభరణాలు, పుస్తకాలు ఉంటాయి. టెస్కోకి ప్రస్తుతం చైనా, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, మలే సియా, పోలాండ్, టర్కీ తదితర దేశాల్లో టెస్కో కార్యకలాపాలు ఉన్నాయి. వివిధ వర్గాల అభ్యంతరాలను పక్కన పెడుతూ మల్టీ బ్రాండ్ రిటైల్‌లో 51% మేర ఎఫ్‌డీఐలను అనుమతించాలని కేంద్రం గతేడాది సెప్టెంబర్‌లో నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఎఫ్‌డీఐ నిబంధనలపై స్పష్టత కోరుతూ టెస్కో సీఈవో ఫిలిప్ క్లార్క్, ట్రెంట్ వైస్ చైర్మన్ నోయల్ టాటా ఈ ఏడాది మే లే ఆనంద్ శర్మతో భేటీ అయ్యారు. వివాదాస్పదమైన సోర్సింగ్ నిబంధనల గురించి ఇందులో చర్చించారు. ఆ తర్వాత ఆగస్టులో కేంద్రం సదరు నిబంధలను సడలించింది. స్థానిక చిన్న, మధ్య తరహా సంస్థల నుంచి 30% మేర ఉత్పత్తులను కొనుగోలు చేయాలన్న నిబంధనను వ్యాపార ప్రారంభ దశకు మాత్రమే పరిమితం చేసింది. అలాగే, పది లక్షల కన్నా తక్కువ జనాభా ఉన్న నగరాల్లో కూడా మల్టీ బ్రాండ్ స్టోర్స్ ఏర్పాటునకు అనుమతించింది. వేగంగా అనుమతులిచ్చేందుకు ప్రయత్నిస్తాం: ఆనంద్ శర్మ భారత మల్టీ బ్రాండ్ రిటైల్‌లో ఇన్వెస్ట్ చేయాలన్న టెస్కో నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్ శర్మ తెలిపారు. అనుమతులు వేగంగా ఇచ్చేందుకు ప్రయత్నించడం ద్వారా తమ వంతు తోడ్పాటు అందించగలమని ఆయన చెప్పారు. ‘దేశీ రిటైల్ పరిశ్రమ రూపాంతరం చెందడానికి ఇది నాంది కాగలదు. ఈ పరిణామంతో మరిన్ని అంతర్జాతీయ దిగ్గజాలు కూడా భారత్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రాగలవు’ అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మల్టీ బ్రాండ్ రిటైల్‌లో ఎఫ్‌డీఐలను అనుమతించడానికి వెనుక ముఖ్యోద్దేశం వ్యవసాయోత్పత్తులు వృధా కాకుండా చూడటమేనని ఆనంద్ శర్మ స్పష్టం చేశారు. మరోవైపు, భారత మార్కెట్‌పై తమకి ఉన్న అవగాహన, అంతర్జాతీయంగా రిటైల్‌లో టెస్కోకి ఉన్న అపార అనుభవం ఒకదానికి మరొకటి తోడు కాగలవని ట్రెంట్ వైస్ చైర్మన్ నోయల్ టాటా పేర్కొన్నారు. తద్వారా దేశీ మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకోగలమని చెప్పారు. -
టెస్కో అమెరికా రిటైల్ స్టోర్స్ దివాళా
లండన్: బ్రిటన్‌కు చెందిన టెస్కో కంపెనీ అమెరికాలోని తన గ్రోసరీ స్టోర్స్ చెయిన్ ఫ్రెష్ అండ్ ఈజీకి సంబంధించి దివాళా పిటిషన్ దాఖలు చేసింది. రాన్ బర్కీ నేతృత్వంలోని ప్రైవేట్ ఈక్విటీ సంస్థకు 167 స్టోర్లను విక్రయించే ప్రణాళికలో భాగంగా టెస్కో కంపెనీ ఈ చర్య తీసుకుందని సమాచారం. 2006లో టెస్కో కంపెనీ అమెరికాలో ఈ గ్రోసరీ స్టోర్స్ చెయిన్‌ను ప్రారంభించింది. అమెరికా రిటైల్ దిగ్గజం, వాల్‌మార్ట్‌కు టెస్కో గట్టి పోటీనిస్తుందని అందరూ భావించారు. కానీ ప్రారంభం నుంచే ఈ చెయిన్‌పై టెస్కో ఎన్నడూ లాభాలు కళ్లజూడలేకపోయింది. విక్రయం కాని స్టోర్స్‌ను మూసేస్తామని టెస్కో పేర్కొంది.