
‘‘సుందరం మాస్టర్’ ట్రైలర్ బాగుంది. కల్యాణ్ సంతోష్‌కు తొలి చిత్రమిది.. మంచి ఫలితాన్నివ్వాలి. రవితేజగారు హీరోగా ఎంత బిజీగా ఉన్నా ఇలా కొత్తవాళ్లని ప్రోత్సహించేందుకు సినిమాలు నిర్మిస్తున్నారు’’ అన్నారు హీరో సిద్ధు జొన్నలగడ్డ. హర్ష చెముడు, దివ్య శ్రీపాద జంటగా కల్యాణ్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సుందరం మాస్టర్’. హీరో రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న రిలీజవుతోంది.
ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకి సిద్ధు జొన్నలగడ్డ అతిథిగా హాజరై, మాట్లాడుతూ– ‘‘హర్షని కమెడియన్ అనడం నాకు నచ్చదు. అతను ఓ కామిక్ యాక్టర్. ట్రైలర్‌లో చూసినట్టుగా హర్షని ఎప్పుడూ సీరియస్‌గా చూడలేదు’’ అన్నారు. ‘‘పదేళ్ల క్రితం ప్రేక్షకుల మధ్యలో ఉన్నాను. ఇప్పుడీ వేదికపై ఉన్నాను. గట్టిగా నమ్మితే ఏదైనా సాధించగలం’’ అన్నారు హర్ష చెముడు. ‘‘ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం’’ అన్నారు సుధీర్ కుమార్. ‘‘ఈ సినిమా మా యూనిట్‌కి గౌరవం తెస్తుంది, ప్రేక్షకులకు సంతృప్తినిస్తుంది’’ అన్నారు కల్యాణ్ సంతోష్.
Comments
Please login to add a commentAdd a comment