
సిద్ధూ రాకలోనూ ప్రియాంకే!
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీతో చివరి నిమిషంలో పొత్తు కుదరటంలో కీలకపాత్ర పోషించిన ప్రియాంక గాంధీ.. పంజాబ్‌లో సిద్ధూను పార్టీలోకి తీసుకురావటంలోనూ క్రియాశీలకంగా వ్యవహరించారు. ఈ విషయాన్ని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్, కెప్టెన్ అమరీందర్ సింగ్ వెల్లడించారు. పంజాబ్‌లో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీకి రాజీనామా చేసిన సిద్ధూను కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చారని తెలిపారు.
‘సిద్ధూ, ప్రగత్ సింగ్‌లను కాంగ్రెస్‌లోకి తీసుకురావటంలో ప్రధాన పాత్ర ప్రియాంకదే. పార్టీకి ఆమె అదనపు బలం అవుతారు’ అని అమరీందర్ తెలిపారు. ‘కాంగ్రెస్‌లో ముందుగానే ముఖ్యమంత్రి అభ్యర్థులను ప్రకటించే సంప్రదాయం లేదు. కానీ నియమాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. పంజాబ్‌లో సీఎం ఎవరో ప్రకటిస్తేనే బాగుంటుంది’ అమరీందర్ సింగ్ తెలిపారు.