మొదలైంది... తెలుసు కదా | Siddhu Jonnalagadda Starrer Telusu Kada Movie Shoot Started | Sakshi
Sakshi News home page

మొదలైంది... తెలుసు కదా

Published Wed, Aug 7 2024 12:04 AM | Last Updated on Wed, Aug 7 2024 12:04 AM

Siddhu Jonnalagadda Starrer Telusu Kada Movie Shoot Started

‘‘మొదలైంది... తెలుసు కదా’ అంటున్నారు సిద్ధు జొన్నలగడ్డ. ప్రముఖ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతున్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘తెలుసు కదా’. ఈ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తుండగా, రాశీ ఖన్నా, శ్రీ నిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ మంగళవారం ప్రారంభమైంది. దాదాపు ముప్పై రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో కొంత టాకీ పార్టుతో పాటు పాటలనూ చిత్రీకరించనున్నారు. ‘‘తొలి రోజు సిద్ధు, రాశీ కాంబినేషన్‌లోని సన్నివేశాల చిత్రీకరణను ప్రారంభించాం’’ అని చిత్రబృందం తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement