
రాజమాత క్వీన్ ఎలిజబెత్–2 మనవడు ప్రిన్స్ హ్యారీని (లేడీ డయానా చిన్న కొడుకు) ఈ మే నెలలో వివాహమాడబోతున్న అమెరికన్ నటి మేఘన్ మార్కల్.. సోషల్ మీడియాలో ఇంతకాలం తనను ఫాలో అయిన వాళ్లందరికీ ధన్యవాదాలు తెలిపారు! ఆ వెంటనే ఆమె తన ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్ బుక్ అకౌంట్‌లను మూసి వేశారు. బ్రిటన్ రాచ కుటుంబపు నియమ నిబంధనలను గౌరవిస్తూ మేఘన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజప్రాసాదంలో ఎవరికీ వ్యక్తిగతంగా సోషల్ మీడియా అకౌంట్‌లు ఉండవు.
వారి తరఫున ప్రత్యేకంగా ఒక మీడియా నిపుణుల బృందం అధికారికంగా ట్వీట్‌లు, ఇన్‌స్టాగ్రామ్‌లు, ఫేస్‌బుక్ పోస్టింగ్‌లు ఇస్తుంటుంది. ప్రిన్స్ హ్యారీ జీవిత భాగస్వామిగా మేఘన్ ఆ కుటుంబంలోకి అడుగు పెట్టాక అవసరమైతే ఆమె తరఫున కూడా ఆ ప్రత్యేక బృందమే ట్వీట్లు వగైరాలు ఇస్తుంది. 2017 డిసెంబర్ నాటికి మేఘన్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 19 లక్షల మంది, ట్విట్టర్‌లో 3 లక్షల 50 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇక ఆమె ఫేస్‌బుక్ అకౌంట్‌కి 8 లక్షల లైకులు ఉన్నాయి. మెట్టినింటి సంప్రదాయాలకు మేఘన్ మెల్లిమెల్లిగా అలవాటు పడుతున్నట్లే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment