Marcelo
-
నెల ముందే వెనోమ్ 3
హాలీవుడ్ హిట్ ఫ్రాంచైజీ ‘వెనోమ్’ మూడో భాగం ‘వెనోమ్ 3’ రెడీ అవుతోంది. ఈ సినిమాకు ‘వెనోమ్: ది లాస్ట్ డ్యాన్స్’ టైటిల్ ఖరారైంది. ఈ సూపర్ హీరో మూవీని ఈ ఏడాది అక్టోబరు 24న రిలీజ్ చేస్తున్నట్లుగా మేకర్స్ వెల్లడించారు. ‘వెనోమ్’ ఫ్రాంచైజీలోని తొలి రెండు భాగాలు ‘వెనోమ్’, ‘వెనోమ్: లెట్ దేర్ బీ కార్నేజ్’లకు రచయితగా పని చేసిన కెల్లీ మార్సెల్ మూడో భాగంతో దర్శకురాలిగా మారారు. తొలి రెండు భాగాల్లో హీరోగా నటించిన టామ్ హర్డీయే ‘వెనోమ్: ది లాస్ట్ డ్యాన్స్’లోనూ నటిస్తున్నారు. జూనో టెంపుల్, చివెటెల్ ఎజియోఫర్, క్లార్క్ బాకో ఇతర లీడ్ రోల్స్‌లో కనిపిస్తారు. ఈ సినిమా దర్శకురాలు కెల్లీ మార్సెల్, హీరో టామ్ హర్డీలు ‘వెనోమ్: ది లాస్ట్ డ్యాన్స్’కు కథా రచయితలుగా ఉండటంతోపాటు నిర్మాతలుగా కూడా వ్యవహరిస్తుండటం విశేషం. తొలుత ఈ చిత్రాన్ని ఈ ఏడాది నవంబరులో విడుదల చేయాలనుకున్నారు. తాజాగా ఓ నెల ముందే... అక్టోబరుకి ప్రీ పోన్ చేశారు. -
ఫైనల్లో దివిజ్ శరణ్ జంట
మ్యూనిక్: బీఎండబ్ల్యూ ఓపెన్ ఏటీపీ–250 టోర్నమెంట్లో భారత డబుల్స్ స్టార్ ప్లేయర్ దివిజ్ శరణ్ తన భాగస్వామి మార్సెలో డెమోలైనర్ (బ్రెజిల్)తో కలిసి టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో దివిజ్–మార్సెలో ద్వయం 6–3, 3–6, 10–4తో ‘సూపర్ టైబ్రేక్’లో ఫిలిప్ ఓస్వాల్డ్ (ఆస్ట్రియా)–మ్యాట్ పావిక్ (క్రొయేషియా) జోడీపై విజయం సాధించింది. 77 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో దివిజ్ జంట రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసినా కీలకదశలో పాయింట్లు గెలవడంలో సఫలమైంది. తొలి సెట్లో ఒకసారి ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను బ్రేక్ చేసిన దివిజ్ జంట... రెండో సెట్లో తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయింది. నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో మాత్రం దివిజ్ ద్వయం ఒక్కసారిగా విజృంభించి 9–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ దశలో వరుసగా మూడు పాయింట్లు కోల్పోయి ఆ తర్వాత విజయానికి అవసరమైన ఒక పాయింట్‌ను నెగ్గి ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. దివిజ్ కెరీర్లో ఏటీపీ టోర్నీలో ఫైనల్ చేరడం ఇది ఆరోసారి. నాలుగు డబుల్స్ టైటిల్స్ నెగ్గిన అతను, మరోసారి రన్నరప్‌గా నిలిచాడు. -
అందరికీ ధన్యవాదాలు
రాజమాత క్వీన్ ఎలిజబెత్–2 మనవడు ప్రిన్స్ హ్యారీని (లేడీ డయానా చిన్న కొడుకు) ఈ మే నెలలో వివాహమాడబోతున్న అమెరికన్ నటి మేఘన్ మార్కల్.. సోషల్ మీడియాలో ఇంతకాలం తనను ఫాలో అయిన వాళ్లందరికీ ధన్యవాదాలు తెలిపారు! ఆ వెంటనే ఆమె తన ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్ బుక్ అకౌంట్లను మూసి వేశారు. బ్రిటన్ రాచ కుటుంబపు నియమ నిబంధనలను గౌరవిస్తూ మేఘన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజప్రాసాదంలో ఎవరికీ వ్యక్తిగతంగా సోషల్ మీడియా అకౌంట్లు ఉండవు. వారి తరఫున ప్రత్యేకంగా ఒక మీడియా నిపుణుల బృందం అధికారికంగా ట్వీట్లు, ఇన్‌స్టాగ్రామ్‌లు, ఫేస్బుక్ పోస్టింగ్‌లు ఇస్తుంటుంది. ప్రిన్స్ హ్యారీ జీవిత భాగస్వామిగా మేఘన్ ఆ కుటుంబంలోకి అడుగు పెట్టాక అవసరమైతే ఆమె తరఫున కూడా ఆ ప్రత్యేక బృందమే ట్వీట్లు వగైరాలు ఇస్తుంది. 2017 డిసెంబర్ నాటికి మేఘన్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 19 లక్షల మంది, ట్విట్టర్లో 3 లక్షల 50 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇక ఆమె ఫేస్బుక్ అకౌంట్‌కి 8 లక్షల లైకులు ఉన్నాయి. మెట్టినింటి సంప్రదాయాలకు మేఘన్ మెల్లిమెల్లిగా అలవాటు పడుతున్నట్లే ఉంది. -
జేమ్సా? హ్యారీనా?
హాలీవుడ్‌ని వదిలేసి, ప్రిన్స్ హ్యారీని పెళ్లి చేసుకుని బ్రిటన్ వెళ్లిపోవాలని డిసైడ్ అయిన అమెరికన్ నటి మేఘన్ మార్కల్ని.. హాలీవుడ్ మాత్రం వదులుకునేందుకు సిద్ధంగా లేనట్లుంది! టీవీలో ‘సూట్స్’ అనే లీగల్ డ్రామా సిరీస్‌లో ‘రేచల్ జేన్’గా ఆడియెన్స్‌ని ఇంప్రెస్ చేసిన మార్కల్ని జేమ్స్ బాండ్ గర్ల్‌గా తీసుకునేందుకు ఆ సినిమా నిర్మాతలు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే మార్కల్ ఆల్రెడీ వాళ్లకు ‘నో’ అని చెప్పేశారు. ఈ ఏడాది మే 19న మార్కల్, ప్రిన్స్ హ్యారీల వివాహం. పెళ్లి పనులు కూడా ఆల్రెడీ మొదలైపోయాయి. ఆ లోపే నటిగా తన ష్కెడ్యూళ్లన్నింటినీ పూర్తి చేసుకుని, కొత్త ఒప్పందాలేవీ ఒప్పుకోకూడదని మార్కల్ నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పుడు 25వ బాండ్ మూవీకి ఆమె పేరు షార్ట్‌లిస్ట్ అయింది! ఆమె ‘నో’ అంటున్న కొద్దీ వాళ్లు ‘ప్లీజ్’ అంటున్నారు. అందులో బాండ్‌గా నటించబోయే డేనియల్ క్రెయిగ్ పక్కన బాండ్ గర్ల్‌గా 36 ఏళ్ల మార్కల్ అయితే బాగుంటుందని ప్రొడ్యూసర్లు ముచ్చట పడుతున్నారు మరి. జేమ్స్ బాండ్ సిరీస్‌లోని 24వ చిత్రం ‘స్పెక్టర్’ 2015లో విడుదలైంది. స్పెక్టర్ అంటే.. వెంటాడే భయం. అంత మంచి చాన్స్‌ను మిస్ చేసుకోకూడదని మార్కల్ అనుకుంటే.. కొత్త పెళ్లి కూతురు కారణంగా బాండ్ మూవీ షూటింగ్‌కి, షూటింగుల కారణంగా వీళ్ల కొత్త దాంపత్యానికీ ‘స్పెక్టర్’లాంటి ప్రాబ్లం ఏదైనా తప్పకపోవచ్చు. చూడాలి! బాండ్ గెలుస్తాడా? బాండింగ్ నిలుస్తుందా? -
బ్రెజిల్ దేశాధ్యక్షుడి ప్యాలెస్‌లో దెయ్యం!
దేవుడా! ఏ దేశాధ్యక్షుడికైనా దేశంలోని సమస్యలను మించిన దెయ్యాలు ఏముంటాయి? కానీ బ్రెజిల్ అధ్యక్షుడు మిషెల్ టెమెర్ దేశ సమస్యలకు భయపడడం లేదు. ఇంట్లోని దెయ్యాలకు వణికిపోతున్నారు! అమెరికా అధ్యక్షుడికి ‘వైట్ హౌస్’ ఎలాగో.. బ్రెజిల్ అధ్యక్షుడికి ‘ఆల్వొరాడా ప్యాలెస్’ అలాగ. ఆ ప్యాలెస్సే ఆయన నివాసం. అయితే కొన్నాళ్లుగా ప్యాలెస్‌లో ఏవో వింత శబ్దాలు వినిపిస్తూ టెమెర్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు కంటి కునుకు లేకుండా చేస్తున్నాయి! టెమెర్ వయసు 76 ఏళ్లు. ఆయన అందాల భార్య (మాజీ బ్యూటీ క్వీన్) మార్సెలా వయసు 33 ఏళ్లు. వాళ్ల కొడుకు మిషెల్ జిన్హో వయసు 7 ఏళ్లు. వయసులతో నిమిత్తం లేకుండా ఈ ముగ్గురూ దెయ్యాల భయంతో ప్యాలెస్‌లో ఒకర్నొకరు విడిచిపెట్టకుండా తిరుగుతున్నారు. రాత్రయిందంటే.. ఎవరు ఏ గదిలో ఉన్నా ఒకే గదికి చేరుతున్నారు! పిల్లవాడైతే నాన్న మీద ఒక కాలు, అమ్మ మీద ఒక కాలు వేసి పడుకుంటున్నాడు. టెమెర్కి దెయ్యాలంటే నమ్మకం లేదు. కానీ ఏదో దుష్టశక్తి తనను ఆవహిస్తున్నట్లు ఆయన గమనించారు! మార్సెలా మొదట పట్టించుకోలేదు కానీ, భర్తే స్వయంగా తనకేదో నీడలు కనిపిస్తున్నట్లు చెప్పడంతో భూతవైద్యుడిని ఇంటికి రప్పించారు. మంత్రం వేయించారు. అయినప్పటికీ ఆల్వొరాడా ప్యాలెస్‌లో అలికిడులు, దేశాధ్యక్షుడి మనసులోని అలజడులు తగ్గలేదు. దాంతో ఈ కుటుంబం రెండు రోజుల క్రితమే ఆల్వొరాడా ప్యాలెస్‌ను ఖాళీ చేసి వెళ్లిపోయింది! నిజానికి ఆల్వొరాడో ప్యాలెస్‌లో ఒక్కరోజైనా గడిపేందుకు ప్రపంచ దేశాల అధినేతలు సైతం ఉవ్విళ్లూరుతుంటారు. బ్రెజిల్ రాజధాని బ్రెజీలియాలోని ఒక ద్వీపకల్పంలో ప్రకృతి పంచన ఉన్నట్లుగా ఉంటుంది ఈ ప్యాలెస్. 1957లో ఆస్కార్ నీమియర్ అనే వాస్తుశిల్పి చక్కగా గాలీ వెలుతురూ వచ్చేలా అత్యాధునికంగా ఆల్వొరాడోను డిజైన్ చేశారు. అధ్యక్షుడి ప్రధాన శయనాగారంతో పాటు.. ఓ పెద్ద ఈతకొలను, ఫుట్‌బాల్ మైదానం, చిన్న ప్రార్థనాస్థలం, వైద్యకేంద్రం ఇందులో ఉన్నాయి. ఇప్పుడు ఈ సదుపాయాలన్నిటినీ వదులుకుని అక్కడికి దగ్గర్లోనే ఉన్న జబురు ప్యాలెస్‌కు వెళ్లిపోయింది అధ్యక్షుడి కుటుంబం. జబురు ప్యాలెస్‌లో బ్రెజిల్ వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. మరి ఆయన ఎక్కడ సర్దుకున్నారో కానీ, ఈయన అక్కడకు అన్నీ సర్దుకుని వెళ్లిపోయారు. ఈ రెండు ప్యాలస్‌ల మధ్య దూరం అర కిలోమీటరు కన్నా ఎక్కువ ఉండదు. బ్రెజిల్ దేశాధ్యక్షుడిని నిజంగానే దెయ్యం వెంటాడుతున్నట్లయితే ఆ దెయ్యానికి అదేమంత పెద్ద దూరం కాబోదు. బ్రెజిల్ దేశాధ్యక్షుడు మిషెల్ టెమెర్, ఆయన భార్య మార్సెలా, కొడుకు జిన్హో. ఉపాధ్యక్షుడి అధికార నివాసం జబురు ప్యాలెస్ బ్రెజిల్ దేశాధ్యక్షుడి అధికార నివాసం అల్ వొరాడా ప్యాలెస్