హాలీవుడ్‌ని వదిలేసి, ప్రిన్స్ హ్యారీని పెళ్లి చేసుకుని బ్రిటన్ వెళ్లిపోవాలని డిసైడ్ అయిన అమెరికన్ నటి మేఘన్ మార్కల్‌ని.. హాలీవుడ్ మాత్రం వదులుకునేందుకు సిద్ధంగా లేనట్లుంది! టీవీలో ‘సూట్స్’ అనే లీగల్ డ్రామా సిరీస్‌లో ‘రేచల్ జేన్’గా ఆడియెన్స్‌ని ఇంప్రెస్ చేసిన మార్కల్‌ని జేమ్స్ బాండ్ గర్ల్‌గా తీసుకునేందుకు ఆ సినిమా నిర్మాతలు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే మార్కల్ ఆల్రెడీ వాళ్లకు ‘నో’ అని చెప్పేశారు. ఈ ఏడాది మే 19న మార్కల్, ప్రిన్స్ హ్యారీల వివాహం. పెళ్లి పనులు కూడా ఆల్రెడీ మొదలైపోయాయి. ఆ లోపే నటిగా తన ష్కెడ్యూళ్లన్నింటినీ పూర్తి చేసుకుని, కొత్త ఒప్పందాలేవీ ఒప్పుకోకూడదని మార్కల్ నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పుడు 25వ బాండ్ మూవీకి ఆమె పేరు షార్ట్‌లిస్ట్ అయింది!
ఆమె ‘నో’ అంటున్న కొద్దీ వాళ్లు ‘ప్లీజ్’ అంటున్నారు. అందులో బాండ్‌గా నటించబోయే డేనియల్ క్రెయిగ్ పక్కన బాండ్ గర్ల్‌గా 36 ఏళ్ల మార్కల్ అయితే బాగుంటుందని ప్రొడ్యూసర్లు ముచ్చట పడుతున్నారు మరి. జేమ్స్ బాండ్ సిరీస్‌లోని 24వ చిత్రం ‘స్పెక్టర్’ 2015లో విడుదలైంది. స్పెక్టర్ అంటే.. వెంటాడే భయం. అంత మంచి చాన్స్‌ను మిస్ చేసుకోకూడదని మార్కల్ అనుకుంటే.. కొత్త పెళ్లి కూతురు కారణంగా బాండ్ మూవీ షూటింగ్‌కి, షూటింగుల కారణంగా వీళ్ల కొత్త దాంపత్యానికీ ‘స్పెక్టర్’లాంటి ప్రాబ్లం ఏదైనా తప్పకపోవచ్చు. చూడాలి! బాండ్ గెలుస్తాడా? బాండింగ్ నిలుస్తుందా?
జేమ్సా? హ్యారీనా?
Published Wed, Jan 3 2018 11:49 PM | Last Updated on Wed, Jan 3 2018 11:49 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment