వెనోమ్ 3 పోస్టర్
హాలీవుడ్ హిట్ ఫ్రాంచైజీ ‘వెనోమ్’ మూడో భాగం ‘వెనోమ్ 3’ రెడీ అవుతోంది. ఈ సినిమాకు ‘వెనోమ్: ది లాస్ట్ డ్యాన్స్’ టైటిల్ ఖరారైంది. ఈ సూపర్ హీరో మూవీని ఈ ఏడాది అక్టోబరు 24న రిలీజ్ చేస్తున్నట్లుగా మేకర్స్ వెల్లడించారు. ‘వెనోమ్’ ఫ్రాంచైజీలోని తొలి రెండు భాగాలు ‘వెనోమ్’, ‘వెనోమ్: లెట్ దేర్ బీ కార్నేజ్’లకు రచయితగా పని చేసిన కెల్లీ మార్సెల్ మూడో భాగంతో దర్శకురాలిగా మారారు.
తొలి రెండు భాగాల్లో హీరోగా నటించిన టామ్ హర్డీయే ‘వెనోమ్: ది లాస్ట్ డ్యాన్స్’లోనూ నటిస్తున్నారు. జూనో టెంపుల్, చివెటెల్ ఎజియోఫర్, క్లార్క్ బాకో ఇతర లీడ్ రోల్స్‌లో కనిపిస్తారు. ఈ సినిమా దర్శకురాలు కెల్లీ మార్సెల్, హీరో టామ్ హర్డీలు ‘వెనోమ్: ది లాస్ట్ డ్యాన్స్’కు కథా రచయితలుగా ఉండటంతోపాటు నిర్మాతలుగా కూడా వ్యవహరిస్తుండటం విశేషం. తొలుత ఈ చిత్రాన్ని ఈ ఏడాది నవంబరులో విడుదల చేయాలనుకున్నారు. తాజాగా ఓ నెల ముందే... అక్టోబరుకి ప్రీ పోన్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment