
మలాలాకు బ్రిటన్ రాణి ఆహ్వానం
లండన్: తాలిబన్ల కాల్పుల్లో గాయపడి కోలుకున్న పాక్ బాలల హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్(16)కు బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్ ఆహ్వానం పంపారు. మలాలా ధైర్యసాహసాలను మెచ్చుకున్న రాణి ఆమెను బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు రావాలని ఆహ్వానించారు. ఆమె ఆరోగ్యం ఎలా ఉందని బ్రిటన్‌లోని పాక్ హైకమిషనర్‌ను వాకబు చేశారు. ఈ ఆహ్వానం నేపథ్యంలో మలాలాకు నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించే అవకాశముందన్న ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి.