తిరువనంతపురమ్: నటి, ట్రాన్స్‌వుమెన్ ఎలిజబెత్ హరిని చందన వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. కొంతకాలంగా తను గాఢంగా ప్రేమిస్తున్న సునీష్‌ను వేదమంత్రాల సాక్షిగా మనువాడారు. కేరళలోని ఎర్నాకులమ్ బీటీహెచ్ హాల్‌లో ఈ పెళ్లి తంతు జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబాలతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. సెలబ్రిటీల మేకప్ ఆర్టిస్ట్, ట్రాన్స్‌జెండర్ రెంజు రెంజిమార్ వధువు తల్లి స్థానంలో నిలబడి తంతును పూర్తి చేశారు. ఎలిజబెత్‌ను పెళ్లి కూతురిని చేసే దగ్గర నుంచి అప్పగింతల వరకు అన్ని కార్యక్రమాలను ఆమె దగ్గరుండి చూసుకున్నారు. పెళ్లికి సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ "తల్లిగా నా బాధ్యతలను పూర్తి చేశాను. నా చేతుల మీదుగా కూతురి పెళ్లి చేశాను. భగవంతుడికి కృతజ‍్క్షతలు" అని రాసుకొచ్చారు. (చదవండి: ఇంట్లో నా ప్రవర్తన నచ్చలేదు)
కాగా కుంబలంగికి చెందిన హరిని చందన 17 ఏళ్ల వయసులో సర్జరీ చేయించుకుని అమ్మాయిగా మారారు. 2017లో కొచ్చిలో జరిగిన ట్రాన్స్‌జెండర్ అందాల పోటీలో ఆమె సెకండ్ రన్నరప్‌గా నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించారు. అనంతరం సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి 'దైవత్తింటే మనవట్టి' అనే మలయాళ హిట్ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు. ఇందులో నటుడు జయసూర్య ముఖ్యపాత్రలో కనిపించారు. (చదవండి: కత్తితో కేక్ కట్ చేసిన హీరో.. క్షమాపణలు)
Comments
Please login to add a commentAdd a comment