లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్ -2 ఇంట మరో మహారాణి పుట్టింది. ఎలిజబెత్ రాణి మనవరాలు జారా ఫిలిప్స్ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. జారాకు నెలల నిండిన తర్వాత శుక్రవారం ఆడబిడ్డను ప్రసవించింది. బేబీ బరువు 3.5 కిలోల ఉన్నట్లు బక్కింగ్ హమ్ ప్యాలెస్ పేర్కొంది. గ్లోసిస్టర్ రోయల్ ఆస్పత్రిలో జారా బిడ్డకు జన్మినిచ్చే సమయంలో ఆమె భర్త, రగ్బీ ఆటగాడు మైక్ తిండాల్ ఆమె ప్రక్కనే ఉన్నాడు. ప్రిన్స్ జార్జ్, కేట్ లకు బిడ్డ పుట్టిన ఐదు నెలల్లోనే ఎలిజబెత్ రాణి ఇంట్లోమరో శుభవార్త అందడంతో వారు ఆనంద పరవశంలో మునిగితేలుతున్నారు. మైక్ తిండాల్-జారా ఫిలిప్స్ లకు 2011వ సంవత్సరం జూలై నెలలో వివాహమైంది.
ఎలిజబెత్ రాణికి మునిమనవరాలు
Published Fri, Jan 17 2014 6:20 PM | Last Updated on Sat, Sep 2 2017 2:43 AM
Advertisement
Advertisement