వాషింగ్టన్: 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని యోచిస్తున్నట్లు డెమొక్రటిక్ పార్టీకి చెందిన సెనేటర్ ఎలిజబెత్ వారెన్(69) ప్రకటించారు. కొత్త సంవత్సరం సందర్భంగా తన అభిమానులు, మద్దతుదారులకు పంపిన వీడియో సందేశంలో ఆమె తన మనసులోని మాటను బయటపెట్టారు. అధ్యక్ష ఎన్నికల బరిలో దిగే ముందు, అవకాశాలపై అధ్యయనం చేసేందుకు అన్వేషణ కమిటీని ఏర్పాటుచేయబోతున్నట్లు వెల్లడించారు. దీంతో తదుపరి ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు సవాలు విసరబోతున్నానని అధికారికంగా ప్రకటించిన తొలి డెమొక్రటిక్ నాయకురాలిగా ఆమె నిలిచారు. ట్రంప్ విధానాల్ని తీవ్రంగా ఎండగట్టే వారెన్ ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికల్లో మసాచుసెట్స్ నుంచి సెనేట్‌కు తిరిగి ఎన్నికయ్యారు. ఇండో–అమెరికన్ సెనేటర్ కమలా హ్యారిస్, హిందూ మతానికి చెందిన మరో సభ్యురాలు తులసీ గబ్బార్డ్‌లు కూడా ట్రంప్‌పై పోటీ చేసే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment